ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 141, 142 / Sri Lalitha Chaitanya Vijnanam - 141, 142 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖
🌻141. 'శాంతా' 🌻
శమము కలది శాంత అని అర్థము.
అంతమున శాంతి కలిగించునది శాంత. 'శ'కారము అంతమున గలదగుటచే ఆరాధనానంతరము ప్రశాంతత నిచ్చునని అర్థము. దైవారాధనమునకు ఫలశ్రుతి శాంతము పొందుటయే. అట్లే సర్వకార్యముల ముగింపు శుభముగను, ఆనందముగను, శాంతి కలుగునట్లు అనుగ్రహించునది శ్రీలలిత.
దైవారాధకులకు ఏ విధముగ శాంతి కలిగించవలెనో ఆ విధముగ శాంతిని ప్రసాదించునది దైవము. ఆర్తులకు ఆర్తి తీర్చుట, కోరికలు గలవారికి కోరికలు తీర్చుట, జిజ్ఞాసువులకు జ్ఞాన మందించుట,
జ్ఞానులకు సాన్నిధ్యము ఇచ్చుట వలన వారికి శాంతి కలుగును. తాత్కాలికమగు శాంతి నుండి శాశ్వతమగు శాంతివరకు సమస్తమును అనుగ్రహించు శ్రీలలితను 'శాంత' అని పిలుతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 141 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Śantā शन्ता (141) 🌻
The absence of negation is to be noticed in this nāma. Prefix niṣ or nir means negation of the quality mentioned in that nāma. For Example kalā means parts and niṣ-kalā means without parts. This nāma means that She is calm and tranquil.
The saying of Śvetāśvatara Upaniṣad VI.19 referred in nāma 133 is also applicable to this nāma. All these qualities of the Brahman are cited by Vāc Devi-s in this Sahasranāma. One more quality of the Brahman, the tranquillity is described here.
Please remember that we are now discussing the qualities of nirguṇa Brahman (the Brahman without form and attributes). To make us understand nirguṇa Brahman better, certain qualities are negated and certain other qualities are affirmed in Upaniṣads as well as in this Sahasranāma.
When one is bound by the clutches of bondage, there cannot be any tranquillity. Tranquillity is considered as an essential quality for self-realization.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 142 / Sri Lalitha Chaitanya Vijnanam - 142 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖
🌻142. 'నిష్కామా' 🌻
కామము లేనిది, కామముచే బంధింపబడనిది, కామమునకు అతీతమైనది శ్రీలలిత అని తెలియనగును.
అన్ని కోరికలు పొందగలిగిన సమర్థత వుండి, యే కోరిక యందాసక్తి లేక కేవలము పరతత్త్వమునే ఆశ్రయించి వుండు వారిని నిష్కాములందురు. సృష్టియందలి సమస్తము శ్రీలలితకు అందుబాటు
లోనిదే. కావున సృష్టి నుండి ఆమె పొందవలసిన దేమియు లేదు. తనయందు ఉన్నదే సృష్టి యందు వెలిసినది.
తనయందు ఉన్నవి తనవే కనుక వానిని పొందవలసిన అవసరమేలేదు. జీవులు తమయందు లేనివానిని పొందుటకు శ్రమ పడుచుందురు. అది వారిలోని లేమి. ఉన్నది పొందవలసిన అగత్యము లేదు. నిజమునకు అంతయూ తమలోనే వున్నదని తెలిసిన జ్ఞానులే నిష్కాములు. వారు త్రిగుణములను దాటినవారు. వారిని ఇచ్ఛాశక్తి బంధించదు.
ఇక శ్రీలలిత విషయమునకు వచ్చినచో జ్ఞానులకు సైతము మోహము కలిగించునేమోగాని, తన కెట్టి మోహమూ లేదు. పరమేశ్వరుని యందు కూడ అర్ధ భాగమై స్థిరపడుటవలన యిక పరతత్త్వమును గూర్చి కూడ ఇచ్ఛ లేనిది శ్రీదేవి.
పై కారణముగ శ్రీలలిత పూర్ణస్థితి యందున్నది. ఆమెకు తనకన్న అన్యమైనది లేదు. అన్యమున్నచో గదా పొందవలె ననిపించుట. అంతా తానై వుండుట వలన ఆమె నిజమగు నిష్కామ. పరమశివుడు నిష్కాముడు.
శివుని నిష్కామత్వమునకు, శ్రీలలిత నిష్కామత్వమునకు పోల్చి చూచినచో ఒకవిధముగ ఆమె నిష్కామత్వమే గొప్ప దనిపించును. పరమశివు డన్నిట వుండును.
శివాని ఆయన ఆధారముగ సృష్టిని అల్లుచు, జీవులకు పరిణామము కలిగించుచు, లోకములను పాలించుచు, కోరికయను మోహమున పడకుండుట నిజమగు నిపుణత. చేయుచూ చేయక యుండుట, అల్లుచూ అల్లికయందు బంధింపబడకుండుట శ్రీదేవి గొప్పదనమేమో అనిపించును. యోగుల కామెయే సంపూర్ణమగు ఉదాహరణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 142 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Niṣkāmā निष्कामा (142)🌻
She is without desire. This is the reason for the previous nāma. When one has desires, he cannot have tranquil mind.
There is no question for any desire for nirguṇa Brahman, the Absolute. Brahman cannot have any desires and this has been confirmed in earlier nāma-s. These nāma-s are in line with Bṛhadāraṇyaka Upaniṣad (II.iii.6) which says ‘neti neti’ meaning not this, not this.
The Upaniṣad is zeroing on the Brahman by negating many known qualities. Finally this verse says ‘satyasya satyaṃ’ meaning “The Truth of truth”. It has identified truth as one of the qualities of the Brahman. The same Upaniṣad further elucidates the Brahman (V.i). “That (the Brahman) is infinite and this (universe) is infinite.
The infinite proceeds from infinite. Then, taking the infinitude of the infinite (universe), it remains as the infinite (the Brahman) alone.” The original verse goes like this:
पूर्णमदः पूण्नमिदम् पूर्णात्पूर्णमुदच्यते।पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
Pūrṇamadaḥ pūṇnamidam pūrṇātpūrṇamudacyate|
Pūrṇasya pūrṇamādāya pūrṇamevāvaśiṣyate||
This nāma is in confirmation of Her Brahmanic status. During the course of this Sahasranāma, one can find a number of such affirmations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Dec 2020
No comments:
Post a Comment