సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 2


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 2 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ



🍀. అభంగ్ - 2 🍀

చహూ వేదీ జాణ్ సాహి శాస్త్రీ కారణ్!
అథరాహి పురాణే హరిసీ గాతీ!!

మంథునీ నవనీతా తై సేఘే అనంతా!
వాయా వ్యర్డ్ కథా సాండీ మారు!!

ఏకహరీ ఆత్మా జీవశివసమా!
వాయా తూ దుర్గమా న ఘలీ మన్!!

జ్ఞానదేవా పాత్ హరి హా వైకుంఠి!
భరలా ఘనదాట్ హరి దిసే!!

భావము:

నాలుగు వేదముల జ్ఞానము ఆరు శాస్త్రాలకు కారణము పద్దెనిమిది

పురాణాలు హరికి సంబంధించిన సారమునే గానము చేయుచున్నవి.

మంథనము చేసి నవనీతము తీసినట్టు అనంతుడిని తీసి పట్టవలెను.

అవసరానికి రాని వ్యర్థ కథలను, మార్గములను వదిలి పెట్టవలెను.

ఒక్క హరియే ఆత్మగా జీవశివులలో సమముగా ఉన్నాడు. కావున

అవసరములేని కథలు, సాధ్యము కానటువంటి సాధనలలో మనసు

పెట్టకు.

నేను నిరంతరముగా హరిపాఠము పఠించుట వలన నాకు

అంతటను హరి దట్టముగా కనిపించినాడు. కావున హరిపాఠము

వైకుంఠమనిపించినదని జ్ఞానదేవుడన్నాడు.


🌻. నామ సుధ -2 🌻

నాలుగు వేదాల సంపూర్ణ జ్ఞానము

ఆరు శాస్త్రాల మూల కారణము

పద్దెనిమిది పురాణాల నామ గానము

హరి నామానికి చెందిన సారము

మంథన చేసి నవనీతము తీయుము

చింతన చేసి అనంతున్ని పొందుము

నామము లేని కథలు వ్యర్థము

అన్య మార్గములు వదిలిపెట్టుము

హరి ఒక్కడే ఆత్మ స్వరూపము

జీవ శివులలో హరి సమానము.

కఠిన సాధనను వదిలి పెట్టుము

నామములోనే మనసు నిలుపుము

జ్ఞాన దేవుడు పఠించే నామము

హరి నామము వైంకుఠ ధామము

నిండియున్నాడు హరి దట్టము

కనిపించినదంతట హరి రూపము.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



11 Dec 2020

No comments:

Post a Comment