2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 160, 161 / Vishnu Sahasranama Contemplation - 160, 161🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 128🌹
4) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 2 🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 149 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 75 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 141, 142 / Sri Lalita Chaitanya Vijnanam - 141, 142🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486🌹
09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 97 📚
10) 🌹. శివ మహా పురాణము - 294 🌹
11) 🌹 Light On The Path - 50🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 182🌹
13) 🌹 Seeds Of Consciousness - 246 🌹
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 121 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 85 / Sri Vishnu Sahasranama - 85🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 19 🌴*
19. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తప: |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
తనను తాను హింసించుకొనుటచే గాని, ఇతరులకు హాని లేదా నష్టమును గూర్చు నిమిత్తముచేగాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.
🌷. భాష్యము :
హిరణ్యకశిపుడు వంటి దానవులు మూఢతపస్సు నొనరించిన దృష్టాంతములు పెక్కు కలవు. అతడు అమరుడగుటకును మరియు దేవతలను నిర్జించుటకును అట్టి నిష్టాపూర్ణమగు తపస్సు నాచరించెను.
ఆ వరములకై అతడు బ్రహ్మదేవుని ప్రార్థించునను అంత్యమున దేవదేవునిచే సంహరింపబడెను. అసాధ్యమైనదాని కొరకు ఒనర్చబడెడి తపస్సు నిక్కముగ తమోగుణప్రధానమైనదే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 575 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 19 🌴*
19. mūḍha-grāheṇātmano yat
pīḍayā kriyate tapaḥ
parasyotsādanārthaṁ vā
tat tāmasam udāhṛtam
🌷 Translation :
Penance performed out of foolishness, with self-torture or to destroy or injure others, is said to be in the mode of ignorance.
🌹 Purport :
There are instances of foolish penance undertaken by demons like Hiraṇyakaśipu, who performed austere penances to become immortal and kill the demigods.
He prayed to Brahmā for such things, but ultimately he was killed by the Supreme Personality of Godhead. To undergo penances for something which is impossible is certainly in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 160, 161 / Vishnu Sahasranama Contemplation - 160, 161 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻160. ధృతాఽఽత్మా, धृताऽऽत्मा, Dhr̥tā’’tmā🌻*
*ఓం ధృతాత్మనే నమః | ॐ धृतात्मने नमः | OM Dhr̥tātmane namaḥ*
ధృతః ఆత్మా యేన సః జన్మాది రహితుడు కావున ఒకే రూపముతో ఎల్లకాలములందును తనచే నిలుపుకొనబడిన ఆత్మ (స్వస్వరూపము) కలవాడు.
:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవచ ।
నిత్యస్సర్వగతస్థ్సాణూరచలోఽయం సనాతనః ॥ 24 ॥
ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఆ ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, స్థిరస్వరూపి, నిశ్చలమూ, పురాతనమూ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 160🌹*
📚 Prasad Bharadwaj
*🌻160. Dhr̥tā’’tmā🌻*
*OM Dhr̥tātmane namaḥ*
Dhr̥taḥ ātmā yena saḥ / धृतः आत्मा येन सः Whose Ātma is controlled or kept in one state, not having birth other change of states. He is always in His inherent form or nature without the any transformation.
Bhagavad Gītā - Chapter 2
Acchedyo’yamadāhyo’yamakledyo’śoṣya evaca,
Nityassarvagatasthsāṇūracalo’yaṃ sanātanaḥ. (24)
:: श्रीमद्भगवद्गीता - साङ्ख्य योग ::
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एवच ।
नित्यस्सर्वगतस्थ्साणूरचलोऽयं सनातनः ॥ २४ ॥
It cannot be cut. It cannot be burnt, cannot be moistened and surely cannot be dried up. It is eternal omnipresent, stationary, unmoving and changeless.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥
ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥
Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 161 / Vishnu Sahasranama Contemplation - 161🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻161. నియమః, नियमः, Niyamaḥ🌻*
*ఓం నియమాయ నమః | ॐ नियमाय नमः | OM Niyamāya namaḥ*
ప్రజాః స్వేషు అధికారేషు నియమయతి ప్రాణులను యోగ్యతకు తగిన విధమున తమ తమ అధికారముల యందు మిక్కిలిగా నియమించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 161🌹*
📚 Prasad Bharadwaj
*🌻161. Niyamaḥ🌻*
*OM Niyamāya namaḥ*
Prajāḥ sveṣu adhikāreṣu niyamayati / प्रजाः स्वेषु अधिकारेषु नियमयति One who appoints or establishes the creatures in their respective places of authority.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥
ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥
Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 128 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 58 🌻*
శ్రోత్రాది ఇంద్రియములు జడములగుట చేత శబ్దాది విషయములను గ్రహించు శక్తి లేనివిగా యున్నవి. ఇంద్రియములకు అంతరముగా ఉన్నటువంటి, విజ్ఞానమే స్వభావముగా గల, ఆత్మమాత్రమే అన్నిటిని తెలుసుకొనుచున్నది. ఎట్లనగా ఆత్మతో కూడిన అంతఃకరణ వృత్తి బహిర్గతమై చక్షరింద్రయముల ద్వారా దశవిధరూపములను, జిహ్వేంద్రియముల ద్వారా షడ్రసములను, ఘ్రాణేంద్రియము ద్వారా చతుర్విధ గంధములను, త్వగీంద్రియము ద్వారా ద్వాదశ స్పర్శలను, శ్రోత్రము ద్వారా చతుర్విధ శబ్దములను, అటులనే విషయానందమును తెలిసికొనుచున్నది. ఈ దేహములో ఆత్మచైతన్యము ఉన్నంత వరకే ఇంద్రియములు విషయములను గ్రహించుచున్నవి.
ఆత్మచైతన్యము లేనప్పుడు, (మరణించినప్పుడు) ఇంద్రియములు వానివాని స్థానములలో ఉన్నప్పటికీ, విషయములను గ్రహించుట లేదు. కనుక అన్నిటిని తెలుసుకొనునది ఆత్మయే. ఆత్మ తెలుసుకొనుటకు శక్యము కాని వస్తువు ఏదియునూ లేదు. ధర్మాధర్మముల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీవు ఎరుంగ గోరితివో, దేవతలు సైతం దేని విషయమున సంశయగ్రస్థులైరో, అట్టి ఆత్మతత్వము ఇదియేనని తెలుసుకొనుము.
జ్ఞాత - జ్ఞాతుం ఇచ్ఛతి. జ్ఞాతకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం - తెలుసుకొనుట. జ్ఞానము- జ్ఞాత్వాం ఇతి సర్వత్రం - మిగిలిన 24 లక్షణాలని, 24 తత్త్వాలని, 24 అంశాలని పిండాండ పంచీకరణ యందున్నటువంటి భావమును, అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. జ్ఞాత చక్షురింద్రియము ద్వారా పని చేస్తున్నాడు అనుకున్నట్లయితే, ఆ యా దృశ్యములను గ్రహిస్తున్నాడు. అదే జ్ఞాత యొక్క ప్రభావం రసనేంద్రియము ద్వారా పనిచేసినప్పుడు, రుచులను సంగ్రహిస్తున్నాడు.
అదే జ్ఞాత ఘ్రాణేంద్రియము ద్వారా పని చేసినప్పుడు, ఆ ఘ్రాణము యొక్క వాసనలను ఆఘ్రాణిస్తున్నాడు. అదే జ్ఞాత స్పర్శేంద్రియమైనటువంటి త్వక్ ద్వారా పనిచేసినప్పుడు ఆ జ్ఞాత యొక్క ప్రభావము చేత త్వక్ - త్వగింద్రియము స్పర్శను తెలుసుకోగలుగుతున్నారు. శీతోష్ణములు, సుఖదుఃఖములు అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శములను తెలుసుకోగలుగుతున్నాడు.
అయితే ఈ జ్ఞానేంద్రియములు అన్నీ కూడాను, స్వయముగా పనిచేయుచున్నవా? అనే విచారణ చేయకపోయినట్లయితే, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుచున్నానని, నోరుంది కాబట్టి తినగలుచున్నానని, ముక్కు ఉన్నది కాబట్టి వాసనను గ్రహించగలుగుతున్నానని, త్వగింద్రియము ఉన్నది కాబట్టి స్పర్శారూప సుఖదుఃఖాలను పొందగలగుచున్నాను అనేటటువంటి భావనలు కలుగుచున్నాయి.
కానీ నిజానికి ఆత్మచైతన్యం కనుక ఈ శరీరంలో వ్యాపకమై, వ్యవహారశీలం కాకపోయినట్లయితే, ఆత్మచైతన్యం యొక్క ఉనికి ఉండక పోయినట్లయితే, ఈ ఇంద్రియములన్నీ సమర్థవంతములు కావు. అవి నిలబడి ఉన్నప్పటికి, శరీరమునందున్నటువంటి ఇంద్రియములు ఆత్మచైతన్యం గనుక సహాయం చేయకపోయినట్లయితే, జ్ఞాత యొక్క సహాయం లేకపోయినట్లయితే, ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఈయజాలవు. దీనికి ఉదాహరణ చెబుతున్నారు.
శవం. శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. లేనిది ఒక్క ఆత్మచైతన్యము మాత్రమే. మరి ఆ ఇంద్రియములు వేటిని గ్రహించడము లేదు కదా! కాబట్టి, ఈ గోళకములు కానీ, ఆ నాడీ వ్యవస్థ అయినటువంటి ఇంద్రియములు కానీ, దానికి ఆధారభూతమైనటువంటి, శబ్దస్పర్శాది రూపకమైన తన్మాత్ర సహిత జ్ఞానము కానీ, దాన్ని అనుసంధానపరిచేటటువంటి మనస్సు కానీ, దాన్ని నిశ్చయించేటటువంటి బుద్ధికానీ, ఇవన్నీ ఆత్మచైతన్యం చేతిలో పనిముట్లు.
ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి మహతత్త్వము, అవ్యక్తములో భాగములు. అట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరము, వాటియందున్నటువంటి ఇంద్రియములు, వాటియందున్న గోళకములు, వాటియందు పనిచేయుచున్న శబ్దాది విషయజ్ఞానము, పంచతన్మాత్రల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా ఒక దానికంటే ఒకటి సూక్ష్మతరము, సూక్ష్మ తమమైనప్పటికి ఇవన్నీ ప్రత్యగాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూఉన్నాయి, వ్యవహరిస్తూఉన్నాయి.
తమకు తాము స్వయముగా వర్తింపజాలవు అనేటటువంటి నిర్ణయాన్ని, పంచీకరణని బాగా అధ్యయనం చేయడం ద్వారా నిరంతరాయముగా అనుసంధానం చేయడం ద్వారా, బాగా పరిశీలనం చేయడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా నిజజీవితంలో ఆ పిండాండ పంచీకరణని అన్వయం చేసుకోవడం ద్వారా తనకు తాను విరమించడం ద్వారా, తనను తాను తెలుసుకోవడం ద్వారా, తనదైనటువంటి స్వస్వరూప ఆత్మాసాక్షాత్కార జ్ఞాన స్థితిలో నిలకడ కలిగి ఉండడం ద్వారా మాత్రమే మానవుడు ఆత్మనిష్ఠను పొందగలుగుచున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 2 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 2 🍀*
చహూ వేదీ జాణ్ సాహి శాస్త్రీ కారణ్!
అథరాహి పురాణే హరిసీ గాతీ!!
మంథునీ నవనీతా తై సేఘే అనంతా!
వాయా వ్యర్డ్ కథా సాండీ మారు!!
ఏకహరీ ఆత్మా జీవశివసమా!
వాయా తూ దుర్గమా న ఘలీ మన్!!
జ్ఞానదేవా పాత్ హరి హా వైకుంఠి!
భరలా ఘనదాట్ హరి దిసే!!
భావము:
నాలుగు వేదముల జ్ఞానము ఆరు శాస్త్రాలకు కారణము పద్దెనిమిది
పురాణాలు హరికి సంబంధించిన సారమునే గానము చేయుచున్నవి.
మంథనము చేసి నవనీతము తీసినట్టు అనంతుడిని తీసి పట్టవలెను.
అవసరానికి రాని వ్యర్థ కథలను, మార్గములను వదిలి పెట్టవలెను.
ఒక్క హరియే ఆత్మగా జీవశివులలో సమముగా ఉన్నాడు. కావున
అవసరములేని కథలు, సాధ్యము కానటువంటి సాధనలలో మనసు
పెట్టకు.
నేను నిరంతరముగా హరిపాఠము పఠించుట వలన నాకు
అంతటను హరి దట్టముగా కనిపించినాడు. కావున హరిపాఠము
వైకుంఠమనిపించినదని జ్ఞానదేవుడన్నాడు.
*🌻. నామ సుధ -2 🌻*
నాలుగు వేదాల సంపూర్ణ జ్ఞానము
ఆరు శాస్త్రాల మూల కారణము
పద్దెనిమిది పురాణాల నామ గానము
హరి నామానికి చెందిన సారము
మంథన చేసి నవనీతము తీయుము
చింతన చేసి అనంతున్ని పొందుము
నామము లేని కథలు వ్యర్థము
అన్య మార్గములు వదిలిపెట్టుము
హరి ఒక్కడే ఆత్మ స్వరూపము
జీవ శివులలో హరి సమానము.
కఠిన సాధనను వదిలి పెట్టుము
నామములోనే మనసు నిలుపుము
జ్ఞాన దేవుడు పఠించే నామము
హరి నామము వైంకుఠ ధామము
నిండియున్నాడు హరి దట్టము
కనిపించినదంతట హరి రూపము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 149 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
141
Sloka:
Ekamevadvitiyoham guruvakyat suniscitam | Evamabhyasato nityam na sevyam vai vanantaram ||
A seeker who practices regularly and constantly thinking that he himself is the non-dual Absolute, as per the Guru’s instructions, need not go to the forest. A lot of people think, “I have to do penance, I need to go to the forest, I have purchased a farm house there, I got a house built that’s going to keep me warm. I’ll go there and meditate.” There is no need to do that, why do you need a house there to keep you warm? No need to do that. You can do it in your house in the city itself. You don’t need to leave everybody behind to do your spiritual practice. No need to leave the samsara, family life or worldly life. You can do it right here, wherever you are located.
Sloka:
Abhyasannimisenaiva samadhimadhi gacchati | Janmakoti krtam papam tatksanadeva nasyati ||
As the practicant goes on practicing this way, he can attain the state of Samadhi (meditative or Yogic trance) within a minute. The sins he perpetrated over crores of births will be destroyed that very moment.
The difficulty is in attaining that one moment. You have to take several births to realize that moment. That one second, that one moment of merging with the Absolute will not keep occurring at will. There is no guarantee that just because you’ve meditated a lot today, you will realize that moment. It is not possible to put timelines or deadlines. You can’t draw a “crossing line” when you will realize that moment. You can do whatever you want…it doesn’t matter, it will take its own course.
That is why, to realize that moment, you need to take several births. It is not easy to attain that bliss. Can any mantras guarantee that moment? Can any penance guarantee it? Can any recommendations guarantee it? No. No knowledge can guarantee it. No beauty can guarantee it. No amount of confidence or ego can guarantee it. Can you imagine how many births we need to take to realize that moment?
We’ve discussed several times that other living beings also have spiritual knowledge. That means, there are plenty of beings that continue their spiritual practice even when they are born as animals. I don’t know whether you’ve witnessed or not, or whether you’ve heard about them or not: a snake brought a flower to place on a Siva Lingam; another snake coiled itself around Lord Shiva like an ornament; an elephant offered fruits and flowers to worship the Lord and brought water in its trunk to perform Abhishekam (pouring libations on the image of the deity being worshiped ); the eagle fanned the Lord to provide cool breeze, the birds all came and offered fruits to the Lord. We’ve heard of all these incidents.
We’ve heard of many suchincidents even in the recent past. The pig circumambulates the temple, the dog circumambulates the temple; a cat, dog and a little bird are sleeping in the same place, the birds are chanting “Rama, Rama”; the birds are chanting “Datta Datta”; the birds are chanting “Appaji”, “Swamiji”. These are not ordinary words they are chanting. Even humans endowed with all the senses cannot utter these words.
Despite Aksharaabhyasam (ceremony where children are introduced to writing skills; akshar = letter; abhyas = learning) and practicing writing alphabets and letters, despite practicing a million times or paying millions to get children better education, they can’t chant these divine names. It’s their fate. That is why, to attain self-realization, we need to take several births.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 75 / Sri Lalitha Sahasra Nama Stotram - 75 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 141, 142 / Sri Lalitha Chaitanya Vijnanam - 141, 142 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |*
*నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖*
*🌻141. 'శాంతా' 🌻*
శమము కలది శాంత అని అర్థము.
అంతమున శాంతి కలిగించునది శాంత. 'శ'కారము అంతమున గలదగుటచే ఆరాధనానంతరము ప్రశాంతత నిచ్చునని అర్థము. దైవారాధనమునకు ఫలశ్రుతి శాంతము పొందుటయే. అట్లే సర్వకార్యముల ముగింపు శుభముగను, ఆనందముగను, శాంతి కలుగునట్లు అనుగ్రహించునది శ్రీలలిత.
దైవారాధకులకు ఏ విధముగ శాంతి కలిగించవలెనో ఆ విధముగ శాంతిని ప్రసాదించునది దైవము. ఆర్తులకు ఆర్తి తీర్చుట, కోరికలు గలవారికి కోరికలు తీర్చుట, జిజ్ఞాసువులకు జ్ఞాన మందించుట,
జ్ఞానులకు సాన్నిధ్యము ఇచ్చుట వలన వారికి శాంతి కలుగును. తాత్కాలికమగు శాంతి నుండి శాశ్వతమగు శాంతివరకు సమస్తమును అనుగ్రహించు శ్రీలలితను 'శాంత' అని పిలుతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 141 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Śantā शन्ता (141) 🌻*
The absence of negation is to be noticed in this nāma. Prefix niṣ or nir means negation of the quality mentioned in that nāma. For Example kalā means parts and niṣ-kalā means without parts. This nāma means that She is calm and tranquil.
The saying of Śvetāśvatara Upaniṣad VI.19 referred in nāma 133 is also applicable to this nāma. All these qualities of the Brahman are cited by Vāc Devi-s in this Sahasranāma. One more quality of the Brahman, the tranquillity is described here.
Please remember that we are now discussing the qualities of nirguṇa Brahman (the Brahman without form and attributes). To make us understand nirguṇa Brahman better, certain qualities are negated and certain other qualities are affirmed in Upaniṣads as well as in this Sahasranāma.
When one is bound by the clutches of bondage, there cannot be any tranquillity. Tranquillity is considered as an essential quality for self-realization.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 142 / Sri Lalitha Chaitanya Vijnanam - 142 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |*
*నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖*
*🌻142. 'నిష్కామా' 🌻*
కామము లేనిది, కామముచే బంధింపబడనిది, కామమునకు అతీతమైనది శ్రీలలిత అని తెలియనగును.
అన్ని కోరికలు పొందగలిగిన సమర్థత వుండి, యే కోరిక యందాసక్తి లేక కేవలము పరతత్త్వమునే ఆశ్రయించి వుండు వారిని నిష్కాములందురు. సృష్టియందలి సమస్తము శ్రీలలితకు అందుబాటు
లోనిదే. కావున సృష్టి నుండి ఆమె పొందవలసిన దేమియు లేదు. తనయందు ఉన్నదే సృష్టి యందు వెలిసినది.
తనయందు ఉన్నవి తనవే కనుక వానిని పొందవలసిన అవసరమేలేదు. జీవులు తమయందు లేనివానిని పొందుటకు శ్రమ పడుచుందురు. అది వారిలోని లేమి. ఉన్నది పొందవలసిన అగత్యము లేదు. నిజమునకు అంతయూ తమలోనే వున్నదని తెలిసిన జ్ఞానులే నిష్కాములు. వారు త్రిగుణములను దాటినవారు. వారిని ఇచ్ఛాశక్తి బంధించదు.
ఇక శ్రీలలిత విషయమునకు వచ్చినచో జ్ఞానులకు సైతము మోహము కలిగించునేమోగాని, తన కెట్టి మోహమూ లేదు. పరమేశ్వరుని యందు కూడ అర్ధ భాగమై స్థిరపడుటవలన యిక పరతత్త్వమును గూర్చి కూడ ఇచ్ఛ లేనిది శ్రీదేవి.
పై కారణముగ శ్రీలలిత పూర్ణస్థితి యందున్నది. ఆమెకు తనకన్న అన్యమైనది లేదు. అన్యమున్నచో గదా పొందవలె ననిపించుట. అంతా తానై వుండుట వలన ఆమె నిజమగు నిష్కామ. పరమశివుడు నిష్కాముడు.
శివుని నిష్కామత్వమునకు, శ్రీలలిత నిష్కామత్వమునకు పోల్చి చూచినచో ఒకవిధముగ ఆమె నిష్కామత్వమే గొప్ప దనిపించును. పరమశివు డన్నిట వుండును.
శివాని ఆయన ఆధారముగ సృష్టిని అల్లుచు, జీవులకు పరిణామము కలిగించుచు, లోకములను పాలించుచు, కోరికయను మోహమున పడకుండుట నిజమగు నిపుణత. చేయుచూ చేయక యుండుట, అల్లుచూ అల్లికయందు బంధింపబడకుండుట శ్రీదేవి గొప్పదనమేమో అనిపించును. యోగుల కామెయే సంపూర్ణమగు ఉదాహరణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 142 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Niṣkāmā निष्कामा (142)🌻*
She is without desire. This is the reason for the previous nāma. When one has desires, he cannot have tranquil mind.
There is no question for any desire for nirguṇa Brahman, the Absolute. Brahman cannot have any desires and this has been confirmed in earlier nāma-s. These nāma-s are in line with Bṛhadāraṇyaka Upaniṣad (II.iii.6) which says ‘neti neti’ meaning not this, not this.
The Upaniṣad is zeroing on the Brahman by negating many known qualities. Finally this verse says ‘satyasya satyaṃ’ meaning “The Truth of truth”. It has identified truth as one of the qualities of the Brahman. The same Upaniṣad further elucidates the Brahman (V.i). “That (the Brahman) is infinite and this (universe) is infinite.
The infinite proceeds from infinite. Then, taking the infinitude of the infinite (universe), it remains as the infinite (the Brahman) alone.” The original verse goes like this:
पूर्णमदः पूण्नमिदम् पूर्णात्पूर्णमुदच्यते।पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
Pūrṇamadaḥ pūṇnamidam pūrṇātpūrṇamudacyate|
Pūrṇasya pūrṇamādāya pūrṇamevāvaśiṣyate||
This nāma is in confirmation of Her Brahmanic status. During the course of this Sahasranāma, one can find a number of such affirmations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴*
31. యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||
🌷. తాత్పర్యం :
బుద్ధిమంతుడైనవాడు భిన్నదేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.
🌷. భాష్యము :
జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు.
ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతికభావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు.
ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 486 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴*
31. yadā bhūta-pṛthag-bhāvam
eka-stham anupaśyati
tata eva ca vistāraṁ
brahma sampadyate tadā
🌷 Translation :
When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.
🌹 Purport :
When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision.
This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies.
When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment