శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 168 / Sri Lalitha Chaitanya Vijnanam - 168


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 168 / Sri Lalitha Chaitanya Vijnanam - 168 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖


🌻168. 'నిష్క్రోధా' 🌻

క్రోధము లేనిది శ్రీదేవి అని అర్థము.

ద్వేషమున్నచో క్రోధముండును. ప్రేమయున్నచోట ద్వేష ముండదు. ప్రేమయున్నచోట తప్పులున్ననూ సహించుట యుండును. సహనము ప్రేమనుండే పుట్టును. క్రోధము తాను అనుకున్న రీతిలో సన్నివేశములు సాగకుండనప్పుడు రజోగుణ ద్వేషమున వుద్భవించును.

హిరణ్యకశిపుని కోపము, రావణుని కోపము క్రోధమునకు తార్కాణములు. తన భావమునకు, చేతకు, మర్యాదకు, గౌరవమునకు అడ్డము వచ్చిన వారినందరిని అణచివేయుట, సంహరించుట, హింసించుట క్రోధ లక్షణములు. క్రోధము ఆసురీ ప్రభావమున కలుగును.

మదించిన అహంకారము కలవారికి క్రోధమెక్కువగా నుండును. క్రోధము వలన పరిసరముల యందు శత్రుత్వమును పెంచుకొందురు. క్రోధనులు నిత్యమూ దుఃఖమునే అనుభవించు చుందురు. శ్రీమాతకు క్రోధము లేదు. ఆమె కందరూ ప్రియులే. ఆమె క్రోధమును నటించును గాని క్రోధమను గుణమునకు వశపడదు. ఇది నిజమగు దైవీ సంపత్తి. రాక్షస సంహారము చేయునపుడు శ్రీమాత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు క్రోధమును తెచ్చిపెట్టుకొనిరే కాని, క్రోధ వశులు కాలేదు. వారు క్రోధమును తెచ్చిపెట్టుకొని, అధర్మమును శిక్షింతురు.

వాలి సంహారమున శ్రీరాముని ప్రవర్తనము, మహిషాసుర వధయందు శ్రీదేవి ప్రవర్తనము గమనించినచో, నిహ్కోధ స్థితి అవగాహన యగును. తల్లితండ్రులకు తమ పిల్లలపై ద్వేషము, క్రోధము యుండవు కదా! కానీ అవసరమగుచో మందలింతురు కదా! వారి నడుమ యున్నది ప్రేమయగుటచే క్రోధము నాయుధముగా వినియోగింతురే గాని, క్రోధవశులు కారు. సమస్త సృష్టి జీవులూ తన బిడ్డలే యుగుటచే శ్రీమాత అందరియందునూ ఒకే విధమగు ప్రేమ కలిగి యుండును.

ఆమె కెవ్వరిపైన క్రోధముండదు. ఆమె క్రోధము నటించుట జీవోద్ధరణమునకే. అవతార పురుషులు కూడ అట్టివారే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 168 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niṣkrodhā निष्क्रोधा (168) 🌻

She is without anger. Even at the time of total dissolution (mahā-pralayā), the Brahman is without anger. Kṛṣṇa says in Bhagavad Gīta (IX.29) “none is hateful to me, none is dear to me”. This is one of the qualities of the Brahman. Brahman is like a mirror.

Unless one stands before a mirror, he cannot see his image. Unless one is devoted to Her, he cannot realize Her grace. Whether one is devoted to Her or not, She is without anger.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jan 2021

No comments:

Post a Comment