విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 206, 207 / Vishnu Sahasranama Contemplation - 206, 207


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 206, 207 / Vishnu Sahasranama Contemplation - 206, 207 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻206. శాస్తా, शास्ता, Śāstā🌻

ఓం శాస్త్రే నమః | ॐ शास्त्रे नमः | OM Śāstre namaḥ

🌾శస్తా, शास्ता, Śāstā🌾

శ్రుతిస్మృత్యాదిభిః సర్వేషాం అనుశిష్టిం అనుశాసనం కరోతి శ్రుతి స్మృత్యాదుల ద్వారా ఎల్లవారిని, మీరిట్లు వర్తించుడు అని అనుశాసించువాడు శాస్తా.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::

మ. వనజాక్ష స్తవశూన్యులై మఱి వషట్స్వాహా స్వధా వాక్య శో

భన రాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులు న్నైన వి

ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలిం బాటిల్లినం గల్కియై

జననం బంది యధర్మము న్నడఁచు సంస్థాపించు ధర్మం బిలన్‍. (198)

కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ళ నోటినుండి 'వషట్‍, స్వాహా, స్వధా' అనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు, భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 206🌹

📚. Prasad Bharadwaj


🌻206. Śāstā🌻

OM Śāstre namaḥ

Śrutismr̥tyādibhiḥ sarveṣāṃ anuśiṣṭiṃ anuśāsanaṃ karoti / श्रुतिस्मृत्यादिभिः सर्वेषां अनुशिष्टिं अनुशासनं करोति One who instructs, disciplines and directs all through the scriptures i.e., Śrūtis and Smr̥tis.

Śrīmad Bhāgavata, Canto 2, Chapter 7

Yarhyālayeśvāpi satāṃ na hareḥ kathāḥ syuḥ

Pāṣāṇḍinó dvijajanā vr̥ṣalā nr̥devāḥ,

Svāhā svadhā vaṣaḍiti sma giró na yatra

Śāstā bhavisyati kalerbhagavānyugānte. (38)

:: श्रीमद्भागवते, द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः

यर्ह्यालयेश्वापि सतां न हरेः कथाः स्युः

पाषाण्डिनो द्विजजना वृषला नृदेवाः ।

स्वाहा स्वधा वषडिति स्म गिरो न यत्र

शास्ता भविस्यति कलेर्भगवान्युगान्ते ॥ ३८ ॥

When it so happens that in none of the residences of so-called saints and respectable gentlemen, the topics on the subject of God exists; higher three classes declaring themselves to be atheists and governance is held by lower class, and when nothing is known of the techniques of sacrifice, even by word, at that time, at the end of Kaliyuga the Lord will appear as the supreme chastiser.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 207/ Vishnu Sahasranama Contemplation - 207🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻207. విశ్రుతాత్మా, विश्रुतात्मा, Viśrutātmā🌻

ఓం విశ్రుతాత్మనే నమః | ॐ विश्रुतात्मने नमः | OM Viśrutātmane namaḥ

🌾వశ్రుతాత్మా, विश्रुतात्मा, Viśrutātmā🌾

విశేషేణ శ్రుతః సత్యజ్ఞానాది లక్షణః ఆత్మా యేన ఎవనిచే సత్యం జ్ఞానం అనంతం ఇత్యాది రూపము అగు ఆత్మ తత్త్వము విశేష రూపమున శ్రవణము చేయబడెనో అట్టివాడు విశ్రుతాత్మ. జీవుడుగా పలుమారులు ఆత్మ తత్త్వ శ్రవణమును పరమాత్ముడే చేసియున్నాడు.

:: శ్రీమద్భగవద్గీత - జ్ఞాన యోగము ::

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।

వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥ 1 ॥

నాశరహితమగు ఈ నిష్కామకర్మయోగము పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువునకుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 207🌹

📚. Prasad Bharadwaj


🌻207. Viśrutātmā🌻

OM Viśrutātmane namaḥ

Viśeṣeṇa śrutaḥ satyajñānādi lakṣaṇaḥ ātmā yena / विशेषेण श्रुतः सत्यज्ञानादि लक्षणः आत्मा येन His nature marked by Satyam i.e., truth, jñānaṃ i.e., knowledge, anantam i.e., limitless - is well known. One who is specially known through signifying terms like truth, knowledge etc.

Śrīmad Bhagavadgīta - Chapter 4

Imaṃ vivasvate yogaṃ proktavānahamavyayam,

Vivasvān manave prāha manurikṣvākave’bravīt. (1)

:: श्रीमद्भगवद्गीत - ज्ञान योग ::

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।

विवस्वान् मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥

I gave this imperishable Yoga to Vivasvat the Sun god. Vivasvat passed on the knowledge to Manu the law giver. Manu instructed this to Ikṣvāku the founder of solar dynasty of Kshatriyas.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


03 Jan 2021

No comments:

Post a Comment