సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 25
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 25 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 25 🍀
జాణీవ్ నేణీవ్ భగవతీ నాహీ!
ఉచ్చారణీ పాహీ మోక్ష సదా!
నారాయణ హరీ ఉచ్చార్ నామాచా!
తేథే కళికాళాచా రీఘ్ నాహీ!!
తేథీల్ ప్రమాణ్ నేణవే వేదాసీ!
తే జీవ జంతూ సీ కేవి కళే!!
జ్ఞానదేవా ఫళ్ నారాయణ పార్!
సర్వత్ వైకుంఠి కేలే అసే!!
భావము:
బుద్ధి తెలిసిన వాడా! తెలియని వాడా! అనే భేదభావము భగవంతుడి వద్దలేదు. నామోచ్ఛారణ చేయు వారందరికి సదా మోక్షమును ఇచ్చును. నారాయణ హరి అని నామ ఉచ్చారణ చేయు వారికి కలికాలముది, మరియు కాలుడిది. భయమే లేదు.
ఆ దేవుడి లీలలు వేదాలకు తెలియ జాలవు. మరి జీవజంతులకు తెలియుట ఎలా సాధ్యము. ?
నారాయణ నామ పఠనము యొక్క ఫలము నాకు అంతట వైకుంఠము వలెనే అగుపించినదని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -25 🌻
జ్ఞాని అజ్ఞానియని లేదు భేదము
భగవంతునికి అందరు సమానము
ఉచ్ఛరించినంతనే పలికేటి దైవము
చల్లగ చూసి ఇచ్చేను మోక్షము
నారాయణ హరినామ గీతము
మరవకుండగ పాడుచుండుము
కన్నెత్తి చూడదు కలి కాలము
సాగదు ఇచ్చట కాలుని పాశము
దేవుడి యొక్క సమగ్ర ప్రమాణము
తెలుసుకో జాలదు వేదము
జీవ జంతువులకు ఎలా సాధ్యము
హరి చరణములే మనకు శరణ్యము
జ్ఞానదేవునికి లభించిన ఫలము
నారాయణహరి నామ పఠనము
సర్వత్రము వెలిసెను వైకుంఠము
కలిగెను వారికి నామ అనుభవము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment