6-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 194🌹  
2) 🌹. శివ మహా పురాణము - 394🌹 
3) 🌹 Light On The Path - 141🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -22🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 216🌹
6) 🌹 Osho Daily Meditations - 11🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 71 / Lalitha Sahasra Namavali - 71🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasranama - 71🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -194 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 35 - 2

*🍀 34. అభ్యాసము - నిత్యానిత్య వస్తువివేకమే వైరాగ్యమునకు మూలము. ఏది నిత్యము, ఏది అనిత్యము అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావు లేదు. తానొకడే నిత్యుడు. దేహముతో పాటు తన కేర్పడినవన్నీ అనిత్యము. తాను నేర్చినది కూడా తనతోపాటు జన్మ జన్మలు అనుసరించు చుండును, జ్ఞానము - అజ్ఞానము, బలము - బలహీనత కూడా వాసనల రూపమున వెంటనంటి వచ్చు చుండును. వైరాగ్యము కొరకై దేనినైననూ విసర్జించుట కృష్ణుడిచ్చిన మార్గము కాదు. విసర్జించుట, నిర్జించుట, బహిష్కరించుట అనునవి విరాగికి వుండవు. అట్లే అంటుకొని యుండుట కూడా వుండదు. వైరాగ్యమునకు రెండు ప్రధానమగు విఘ్నములు కలవు. ఒకటి మమకారము, రెండు అహంకారము. అతడే తానుగ నున్నాడు అని నిశ్చయమైనపుడు యిక తనను గూర్చి భావన జారును. అదియే నిరహంకార స్థితి. 🍀*

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యా సేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్య తే || 35

కేవలము కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు, సమయము వృధా చేయక విచక్షణా బుద్ధితో జీవించుడని తెలిపినాడు. ఇవి యన్నియు 15, 16, 17, 18, 19వ ధ్యాన యోగము 119 శ్లోకములలో తెలిపినాడు. ఈ మాత్రపు నియమములను పాటించి నచో ప్రాథమికమగు వైరాగ్యమబ్బును. దాని వలన మనస్సు కప్పగంతులు వేయక, చిందులు తొక్కక ఏకోన్ముఖమై యుండును.

కుందేలు నడకగా కాక, తాబేలు నడకగ సాగును. సాధన సిద్ధించును. నిత్యానిత్య వస్తువివేకమే వైరాగ్యమునకు మూలము. ఏది నిత్యము, ఏది అనిత్యము అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావు లేదు. సాధకులకు రెంటియందు ఆసక్తి కలగాపులగముగా నుండును. అతడు నిత్య దినచర్యయందు భాగముగ నిత్యమగు విషయమేమి? అనిత్యమగు విషయమేమి? అని విచారించి తెలుసుకొనుచుండును. తానొకడే నిత్యుడు. దేహముతో పాటు తన కేర్పడినవన్నీ అనిత్యము. 

తాను నేర్చినది కూడా తనతోపాటు జన్మ జన్మలు అనుసరించు చుండును, జ్ఞానము - అజ్ఞానము, బలము - బలహీనత కూడా వాసనల రూపమున వెంటనంటి వచ్చు చుండును. అట్లే కళత్ర బాంధవ్యము, సంతానము, బంధు మిత్రులు, పరిచయములు, ఆస్తిపాస్తులు కూడా ఏర్పడుచుండును. ఇది ఏర్పడుటకు కూడా శుభాశుభ వాసనలే కారణము. శుభవాసనలు శ్రేయస్కరమగు సంపర్కముల నిచ్చును. 

అశుభ వాసనలు అపాయము కల్గించు సంపర్కముల నిచ్చును. ఇవి అన్నియు మిశ్రమముగా సంస్కారముల రూపమున వెంటనంటి వచ్చుచుండును. 

ధనికుడగుట, పేదయగుట, పురుషుడగుట, స్త్రీ యగుట యిత్యాది వన్నియూ కూడ సంస్కారముల కారణముగనే జరుగును. తాను జీవుడని మాత్రము గుర్తుండుట, జీవుడుగా తాను దేవునికి చెందినవాడని కూడా గుర్తుండుట వైరాగ్యమునకు చిహ్నము. ఇతరమగు సంబంధములన్నియు దైవలీలగా భావించి దైవవిలాసమున తన పాత్రను హెచ్చుతగ్గులు లేక పోషించువాడు విరాగి. 

వైరాగ్యము కొరకై దేనినైననూ విసర్జించుట కృష్ణుడిచ్చిన మార్గము కాదు. విసర్జించుట, నిర్జించుట, బహిష్కరించుట అనునవి విరాగికి వుండవు. అట్లే అంటుకొని యుండుట కూడా వుండదు. కేవలము ప్రేమపూర్వకమగు జీవ సంబంధమే యుండును. జీవుడు సహజముగ ప్రేమ స్వరూపుడు గనుక, అది ఒక్కటి జ్ఞానమై మిగులును. 

ఇట్టి వైరాగ్యము సిద్ధించుటకు నిత్య స్మరణ మార్గమొకటి యున్నది. “నేను జీవుడను. జీవుడుగా దైవ కుమారుడను. అట్లే సమస్త జీవులునూ. వారును దైవమునుండి ఉద్భవించినవారే. జీవులుగా అందరునూ సమానులే. అందరి యందు నేను సోదరభావమును ప్రయత్నింతును. ఇతరమగు విషయములయందు నాకున్నది పాత్ర పోషణమే. దానిని శ్రద్ధ, భక్తి, అనురక్తిలతో నిర్వర్తించెదను. 

ఇట్టి జ్ఞానము చర్యలలో నిలబడుటకు నా కాధారము దైవమే. అనిత్యమగు విషయము లందు అనాసక్తి చూపక, అట్లని మమకారపడక జీవించు శౌర్యము కూడ నాకు దైవమే ఈయవలెను.

వైరాగ్యమునకు రెండు ప్రధానమగు విఘ్నములు కలవు. ఒకటి మమకారము, రెండు అహంకారము. పై స్మరణమున మమకారము కల్గిననూ అహంకారము యింకనూ యుండును. అది కలుగుటకు దైవమే నేనై యున్నాను, అతడే నేనుగ నున్నాను అని కూడా భావింపవలెను. శ్వాస రూపమున ఈ సత్యమునే హృదయము పలుకుచున్నది.

దానినే సంస్కృతమున 'సోహమస్మి' అను మంత్రముగ తెలిపిరి. దీనిని నిత్యము అనుష్ఠానము చేయు వానికి అహంకారము తొలగును. అతడే తానుగ నున్నాడు అని నిశ్చయమైనపుడు యిక తనను గూర్చి భావన జారును. అదియే నిరహంకార స్థితి. ఇట్టి వైరాగ్యము భావనాపరముగ నిత్యము పటిష్ఠము గావించుకొనుచూ, ముందు తెలిపిన అభ్యాసమును నిర్వర్తించుచూ యోగసాధకుడు క్రమముగా యోగసిద్ధి దిశకు సాగును. ఈ కారణముగనే అభ్యాసము, వైరాగ్యము రెంటిని సాధనములుగ భగవంతుడు పేర్కొనినాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 394🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 18

*🌻. కాముని విజృంభణము - 2 🌻*

ఈ విధముగా మన్మథుడు విజృంభించగా, శృంగారరసము కూడా హావ భావములతో కూడివదై అచట గణములతో గూడియున్న శివుని సమీపమును చేరుకొనెను (17). మనోభవుడగు మన్మథుడు అచట ప్రకటముగా బయటనే నివసించజొచ్చెను. కాని ఆతడు శంభుని ధైర్యమును చెదరగొట్టుటకు ఉపకరించు దుర్బలతను ఆయనలో కనుగొన లేకపోయెను (18). అపుడు యోగిశ్రేష్ఠుడగు ఆ మహాదేవుని యందు దౌర్బల్యమును గానరాక ఆ మన్మథుడు మహా భయమును పొంది మోహితుడాయెను (19). మండే జ్వాలలతో గూడిన అగ్నిని పోలియున్న మూడవ కంటితో గూడియున్న శంకరుడు ధ్యానము నందుండగా, ఆయనను సమీపంచి ఆయన ధ్యానమును చెదరగొట్టగలిగే సామర్థ్యము ఎవరికి గలదు ? (20)

ఇంతలో అచటకు సఖురాండ్రిద్దరితో గూడి పార్వతి అనేక పుష్పములను తీసుకొని శివపూజ కొరకు వెళ్లెను (21). భూమండలములో దేనిని మానవులు గొప్ప సౌందర్యమని వర్ణింతురో, ఆ సౌందర్యమంతయూ మాత్రమే గాక, అంతకంటె అధికమగు సౌందర్యము కూడ పార్వతియందు నిశ్చితముగా గలదు (22). ఆ యా ఋతువులలో పూసిన అందమగు పుష్పములను ధరించిన సమయములో ఆమె సౌందర్యమును వర్ణించుటకు వంద సంవత్సరముల కాలమైననూ చాలదు (23). ఏ క్షణములో ఆ పార్వతి శివుని సమీపమునకు వెళ్లినదో, అదే సమయములో శంకరుడు క్షణకాలము ధ్యానమును వీడి యుండెను (24). 

ఆ లొసుగును కనిపెట్టిన మన్మథుడు ముందుగా హర్షణము అనే బాణముతో పార్వతి ప్రక్కన ఉన్న చంద్రశేఖరుని హర్షింపజేసెను (25). ఓ మహర్షీ! అపుడు శృంగార భావములతో గూడిన పార్వతి వసంతునితో బాటు మన్మథునకు సహాయపడు విధముగా శివుని వద్దకు వెళ్లెను (26). అదే సమయములో మన్మథుడు జాగరూకతతో తన ధనస్సును ఎక్కుపెట్టి శూలధారియగు శివునియందు ప్రేమను ఉత్పన్నము చేయుట కొరకై వెనువెంటనే పుష్పబాణమును ప్రయోగించెను (27). 

ప్రతి దినము విడువకుండగా ఆమె ఏ తీరున శివుని వద్దకు వచ్చెడిదో, సరిగా అదే విధముగా ఆమె వచ్చి, నమస్కరించి, పూజచేసి ఆయన యెదుట నిలబడెను (28). అచట స్త్రీ స్వభావము వలన మిక్కిలి లజ్జతో పార్వతి నిలబడి యుండగా ఆమె అవయవములలో ప్రకటమగు చున్న శోభను కైలాసపతి యగు శివప్రభుడు చూచెను (29). పూర్వము ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరమును శివుడు స్మరించుకొనెను. ఓ మహర్షీ! అపుడా ప్రభుడు ఆనందముతో ఆమె అంగములను వర్ణించెను (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 141 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 8 🌻*

 *🍁 537. Those that ask shall have. But though the ordinary man asks perpetually, his voice is not heard. For he asks with his mind only; and the voice of the mind is only heard on that plane on which the mind acts. Therefore, not until the first twenty-one rules are passed do I say that those that ask shall have. 🍁*

538. People generally take this to mean that their prayers will be answered and that if they knock at the door of heaven it will be opened to them. They vaguely think that if they try to obtain salvation it will be vouchsafed to them. This passage takes a higher standpoint, and refers quite clearly to truth and occult development. It does not apply to the ordinary man, but to the pupil who, when the first twenty-one rules are passed, has reached the first Initiation.

539. The man who asks with his mind only is endeavouring to gain occult knowledge, trying to peer into the mysteries of life and nature, merely by his mental powers, and the Master says quite clearly that that is not enough. 

That man will get his reply, but only at the level on which the mind acts. That is, he will acquire only an intellectual conception of certain matters. Still, that is a very fine thing to have, and is not at all to be despised. The man who in studying Theosophy obtains a firm intellectual grasp of its teaching has done exceedingly well. He then accepts it as true, because it satisfies the demands of his intellect. 

That is already a valuable result, but it is not actual knowledge; it is not at all the same thing as the absolute certainty which comes from knowledge gained on the intuitional plane, and the occultist thinks only of that knowledge as marking a really important advance.

540. One cannot have too keen an intellect; we may take that quite definitely for granted. It is well that we should endeavour to add to our knowledge, to develop our intellects by doing something definite, because, as I have explained before, no great progress can be made before there is mental as well as astral development. 

In some cases the man who gains an intellectual grasp of the Theosophical system may run a considerable risk of exalting his intellect unduly. He may be tempted to criticize, to feel that he could have planned the universe much better than it is at present arranged. 

The man who does that is making an entirely wrong use of his intellect and will do himself harm. It would be much better for him if he were able to acquire some development along the line of feeling more deeply and keenly. 

But if along with his intellectual development the man can retain humility, if, while he grasps as much as he can of the system, he can yet, within himself and without, refrain from sitting in judgment upon it, then only good will result from his development.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 22 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : పవన్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌸. మహాపూర్ణవాణి 🌸

నీవు దేవలోకంలో భోగాలు అనుభవించాలి అనుకొంటే, కేవలం సత్కర్మలనే చేయటానికి తగిన గుణములను సంపాదించుకో చాలు. 

నీవు పరమాత్మ అనుగ్రహమును బ్రహ్మానుభూతిని‌ పొందాలి అనుకొంటే, నీ‌ మాటలవలన గాని, చేతల వలనగాని, భావాలవలన గాని నీ ఏ‌ కదలికల‌వల్లా పుణ్యంగాని, పాపంగాని రావటానికి వీలు లేని స్థితిలో ప్రవర్తించు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 11 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 THE EGO 🍀*

*🕉 There are moments, a few moments, far and few between, when ego disappears because you are in such a total drunkenness. In love it sometimes happens; in orgasm it sometimes happens.. 🕉*

In deep orgasm your history disappears, your past recedes, goes on receding, receding, and disappears. You don't have any history in orgasm, you don't have any past, you don't have any mind, you don't have any autobiography. You are utterly here now. You don't know who you are, you don't have any identity. In that moment the ego is not functioning, hence the joy of orgasm, the refreshing quality of it, the rejuvenation of it. 

That's why it leaves you so silent, so quiet, so relaxed, so fulfilled. But again the ego comes in, the past enters and encroaches on the present. Again history starts functioning and you stop functioning. The ego is your history, it is not a reality. And this is your enemy; the ego is the enemy.

Every person comes around this corner many times in life, because life moves in a circle. Again and again we come to the same point, but because of fear we escape from it. Otherwise the ego is a falsity. In fact, to let it die should be the easiest thing and to keep it alive should be the hardest thing, but we keep it alive and we think it is easier.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 71 / Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

🍀 305. రాజరాజార్చితా - 
రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.

🍀 306. రాఖినీ - 
కామేశ్వరునికే రాణి.

🍀 307. రమ్యా - 
మనోహరమైనది.

🍀 308. రాజీవలోచనా - 
పద్మములవంటి కన్నులు కలది.

🍀 309. రంజనీ - 
రంజింప చేయునది లేదా రంజనము చేయునది.

🍀 310. రమణీ - 
రమింపచేయునది.

🍀 311. రస్యా - 
రస స్వరూపిణి.

🍀 312. రణత్కింకిణి మేఖలా - 
మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🌻*

🌻 305 ) Raja rajarchitha -   
She who is being worshipped by king of kings

🌻 306 ) Rakhini -   
She who is the queen of Kameshwara

🌻 307 ) Ramya -   
She who makes others happy

🌻 308 ) Rajeeva lochana -   
She who is lotus eyed

🌻 309 ) Ranjani -   
She who by her red colour makes Shiva also red

🌻 310 ) Ramani -   
She who plays with her devotees

🌻 311 ) Rasya -   
She who feeds the juice of everything

🌻 312 ) Ranath kinkini mekhala -   
She who wears the golden waist band with tinkling bells

Continues..
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasra Namavali - 71 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*జ్యేష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 71.బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |*
*బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖ 🍀*

🍀 661) బ్రహ్మణ్య: - 
బ్రహ్మను అభిమానించువాడు.

🍀 662) బ్రహ్మకృత్ - 
తపస్సు మొదలైనవిగా తెలియ జేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.

🍀 663) బ్రహ్మా - 
బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.

🍀 664) బ్రహ్మ - 
బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.

🍀 665) బ్రహ్మవివర్థన: - 
తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.

🍀 666) బ్రహ్మవిత్ - 
బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.

🍀 667) బ్రాహ్మణ: - 
వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.

🍀 668) బ్రహ్మీ - 
తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.

🍀 669) బ్రహ్మజ్ఞ: - 
వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.

🍀 670) బ్రాహ్మణప్రియ: - 
బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 71 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Jeshta 3rd Padam*

*🌻 brahmaṇyō brahmakṛdbrahmā brahma brahmavivardhanaḥ |*
*brahmavidbrāhmaṇō brahmī brahmajñō brāhmaṇapriyaḥ || 71 || 🌻*

🌻 661. Brahmaṇyaḥ: 
The Vedas, Brahmanas and knowledge are indicated by the word Brahma. As the Lord promotes these, He is called Brahmanya.

🌻 662. Brahmakṛt: 
One who performs Brahma or Tapas (austerity).

🌻 663. Brahmā: 
One who creates everything as the creator Brahma. 

🌻 664. Brahma: 
Being big expanding, the Lord who is known from indications like Satya (Truth), is called Brahma. Or Brahma is Truth, Knowledge and Infinity!

🌻 665. Brahma-vivardhanaḥ: 
One who promotes Tapas (austerity), etc.

🌻 666. Brahmavid: 
One who knows the Vedas and their real meaning.

🌻 667. Brāhmaṇaḥ: 
One who, in the form of Brahmana, instructs the whole world, saying, 'It is commanded so and so in the Veda'.

🌻 668. Brahmī: 
One in whom is established such entities as Tapas, Veda, mind, Prana etc. which are parts of Brahma and which are also called Brahma.

🌻 669. Brahmajñaḥ: 
One who knows the nature of Brahman.

🌻 670. Brāhmaṇapriyaḥ: 
One to whom holy men are devoted.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment