1) 🌹 శ్రీమద్భగవద్గీత - 78 / Bhagavad-Gita - 78 - 2 - 31🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 647 / Bhagavad-Gita - 647 - 18-58 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 475 / Vishnu Sahasranama Contemplation - 475 🌹
4) 🌹 Daily Wisdom - 153 🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 127 🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 59 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 301-2 / Sri Lalita Chaitanya Vijnanam - 300 -2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 78 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 31 🌴
31. స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ది యుద్ధాచ్చ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ||
🌷. తాత్పర్యం :
క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరోక్కటి లేదని నివెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు.
🌷. భాష్యము :
సంఘము నడచుటకై అవసరమైన నాలుగు విధములైన వర్ణములలో సత్పరిపాలన కొరకై యున్న రెండవ వర్ణమునకు క్షత్రియవర్ణమని పేరు. “క్షత్” అనగా హాని యని భావము. హాని నుండి రక్షణము గూర్చువారే క్షత్రియులు (త్రాయతే – రక్షించుట). సాధారణముగా సంహారము విషయమున క్షత్రియులకు అరణ్యమున శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి పోయి, ఒంటరిగా పులితో ఖడ్గమును బూని తలపడి, అది మరణించిన పిమ్మట దానికి రాజలాంఛనములతో దహనక్రియలు చేయుదురు.
ఈ విధమైన పధ్ధతి నేటికిని జైపూరు రాష్ట్రమనందలి క్షత్రియవంశరాజులచే పాటింపబడుచున్నది. ధర్మరహితమైన హింసయనునది కొన్నిమార్లు అత్యంత అవసరమైనది కనుక క్షత్రియులకు పోటీపడుట మరియు సంహరించుట యందు అభ్యాసము గూర్చబడును. కావుననే క్షత్రియులు నేరుగా సన్యాసమును స్వీకరించరాదు. అహింస యనునది రాజనీతి యందు ఒక తంత్రమైన అది ఎన్నడును ఒక సిద్ధాంతము కాదు.
స్వధర్మము రెండు రకములు. ముక్తిని పొందనంత వరకు మనుజుడు దేహమునకు సంబంధించిన విధ్యుక్తధర్మములను ధర్మనుసారముగా ముక్తిని పొందుట కొరకై ఒనరించవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము ఆధ్యాత్మికము కాగలదు. అది ఆపై దేహభావన యందున్నంత వరకు బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు వేరు వేరు ధర్మములుండును.
అట్టి ధర్మములు అనివార్యములు. వాస్తవమునకు సస్వధర్మము భగవానునిచే నిర్ణయింపబడినది. ఈ విషయము చతుర్థాధ్యాయము నందు స్పష్టపరుపబడినది. దేహభావనలో ఒనరింపబడెడి స్వధర్మము వర్ణాశ్రమధర్మముగా పిలువబడుచున్నది.అదియే మనుజుని ఆధ్యాత్మిక అవగాహనమునకు సోపానమై యున్నది. వర్ణాశ్రమధర్మ పాలనముతో (గుణముల ననుసరించియున్న ప్రత్యేకధర్మములు) మానవనాగరికత ఆరంభమగును.
ఏ రంగమునందైనను ప్రామాణికులైన వారి ఆజ్ఞల ప్రకారము స్వధర్మము నిర్వహించుట యనునది మనుజుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 78 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 31 🌴
31. sva-dharmam api cāvekṣya na vikampitum arhasi dharmyād dhi yuddhāc chreyo ’nyat kṣatriyasya na vidyate
🌻 Translation :
Considering your specific duty as a kṣatriya, you should know that there is no better engagement for you than fighting on religious principles; and so there is no need for hesitation.
🌻 Purport :
Out of the four orders of social administration, the second order, for the matter of good administration, is called kṣatriya. Kṣat means hurt. One who gives protection from harm is called kṣatriya (trāyate – to give protection). The kṣatriyas are trained for killing in the forest. A kṣatriya would go into the forest and challenge a tiger face to face and fight with the tiger with his sword. When the tiger was killed, it would be offered the royal order of cremation.
This system has been followed even up to the present day by the kṣatriya kings of Jaipur state. The kṣatriyas are specially trained for challenging and killing because religious violence is sometimes a necessary factor. Therefore, kṣatriyas are never meant for accepting directly the order of sannyāsa, or renunciation. Nonviolence in politics may be a diplomacy, but it is never a factor or principle.
There are two kinds of sva-dharmas, specific duties. As long as one is not liberated, one has to perform the duties of his particular body in accordance with religious principles in order to achieve liberation.
When one is liberated, one’s sva-dharma – specific duty – becomes spiritual and is not in the material bodily concept.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 647 / Bhagavad-Gita - 647 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 58 🌴*
58. మచ్చిత్త: సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి ||
🌷. తాత్పర్యం :
నా యందు చిత్తము గలవాడైనచో నా కరుణచే బద్ధజీవనపు ఆటంకముల నన్నింటిని దాటగలవు. కాని ఒకవేళ నామాట వినక అట్టి భావనలో గాక మిథ్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశమును పొందగలవు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడైనవాడు తన జీవనమునకై ఒనరింపవలసిన ధర్మముల యెడ అనవసర చింతను కలిగియుండడు. అటువంటి చింతారాహిత్యమును మూఢుడైనవాడు ఏ మాత్రము అవగాహన చేసికొనజాలడు.
భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే గాంచును. ఇరువదినాలుగు గంటలు తన ప్రీత్యర్థమే కర్మనొనరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకొనును.
కనుక దేహాత్మభావన యందలి మిథ్యాహంకారముచే ఎవ్వరును మోహమునొందరాదు. ప్రకృతినియమములకు లేదా కర్మఫలములకు తాను పరుడనని భావింపరాదు. వాస్తవమునకు ప్రతియొక్కరు కఠినమైన ప్రకృతినియమములకు లోబడియే యుందురు.
కాని కృష్ణభక్తిభావనలో కర్మనొనరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణభక్తిభావనలో వర్తించనివాడు జన్మ, మృత్యు సాగరమనెడి సుడిగుండమున నశించుచున్నవానిగా ప్రతియొక్కరు గమనింపవలెను. చేయదగినదేదో, చేయరనిదేదో ఏ బద్ధజీవుడును వాస్తవముగా ఎరుగాజాలడు.
కాని శ్రీకృష్ణుడే అంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మికగురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణభక్తిరసభావితుడు మాత్రము కర్మ యందు వర్తించ స్వేచ్చను కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 647 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 58 🌴*
58. mac-cittaḥ sarva-durgāṇi
mat-prasādāt tariṣyasi
atha cet tvam ahaṅkārān
na śroṣyasi vinaṅkṣyasi
🌷 Translation :
If you become conscious of Me, you will pass over all the obstacles of conditioned life by My grace. If, however, you do not work in such consciousness but act through false ego, not hearing Me, you will be lost.
🌹 Purport :
A person in full Kṛṣṇa consciousness is not unduly anxious about executing the duties of his existence. The foolish cannot understand this great freedom from all anxiety.
For one who acts in Kṛṣṇa consciousness, Lord Kṛṣṇa becomes the most intimate friend. He always looks after His friend’s comfort, and He gives Himself to His friend, who is so devotedly engaged working twenty-four hours a day to please the Lord. Therefore, no one should be carried away by the false ego of the bodily concept of life.
One should not falsely think himself independent of the laws of material nature or free to act. He is already under strict material laws. But as soon as he acts in Kṛṣṇa consciousness, he is liberated, free from the material perplexities. One should note very carefully that one who is not active in Kṛṣṇa consciousness is losing himself in the material whirlpool, in the ocean of birth and death.
No conditioned soul actually knows what is to be done and what is not to be done, but a person who acts in Kṛṣṇa consciousness is free to act because everything is prompted by Kṛṣṇa from within and confirmed by the spiritual master.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 475 / Vishnu Sahasranama Contemplation - 475 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 475. ధర్మగుప్, धर्मगुप्, Dharmagup 🌻*
*ఓం ధర్మగుపే నమః | ॐ धर्मगुपे नमः | OM Dharmagupe namaḥ*
ధర్మం గోపయతీత్యేష ధర్మగుప్రోచ్యతే హరిః ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామీతి యద్వచః ॥
ధర్మమును గోపించువాడు లేదా రక్షించువాడుగనుక ఆ హరి ధర్మగుప్.
:: శ్రీమద్భగవద్గీత - జ్ఞాన యోగము ::
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 8 ॥
సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును, దుర్మార్గులను నినాశమొనర్చుట కొఱకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 475🌹*
📚. Prasad Bharadwaj
*🌻 475. Dharmagup 🌻*
*OM Dharmagupe namaḥ*
धर्मं गोपयतीत्येष धर्मगुप्रोच्यते हरिः ।
धर्मसंस्थापनार्थाय संभवामीति यद्वचः ॥
Dharmaṃ gopayatītyeṣa dharmaguprocyate hariḥ,
Dharmasaṃsthāpanārthāya saṃbhavāmīti yadvacaḥ.
Lord Hari safeguards Dharma and hence He is called Dharmagup.
:: श्रीमद्भगवद्गीत - ज्ञान योग ::
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 4
Paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkrtām,
Dharmasaṃsthāpanārthāya saṃbhavāmi yuge yuge. 8.
For the protection of the pious, the destruction of the evil-doers and establishing righteousness, I manifest Myself in every age.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥
ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 153 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 1. What We are in Small Things, That We are Also in Big Things 🌻*
It is not proper that we should simply die with the same old ideas with which we were born and which we always thought were the right things. It is possible that we are, in fact, not correct in our assumptions and that they may need correction. Just as this is the circumstance in small matters, this happens to be the situation in big things as well.
What we are in small things, that we are also in big things. We should not think that we can just be careless in small matters but then be very careful in big matters. When we are careless in tiny things, then we will also be careless in big things. Drops make the ocean, as you know. Even the apparently small matter of drinking a cup of tea is important.
A small thing like a few words that we speak to a brother is as important as a big matter like the practice of yoga or even God-realisation itself. I am not just joking. These are serious things upon which we should reflect and meditate. There is nothing that is unimportant. Before God at least, nothing is unimportant, insignificant or unnecessary.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 127 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 104. పెద్దరికము 🌻*
అకస్మాత్ సంఘటనలలో చెదరకుండుట ఒక సాధన. ఆశ్చర్యపడుట, నిశ్చేష్టుడగుట సర్వసామాన్యము. కలవరపడుట, ఆనందోత్సాహముతో తబ్బిబ్బగుట, ఇవి అన్నియు సర్వసామాన్యములే. ఇట్లగుట చిన్నపిల్లలవంతు. అప్పటికప్పుడు నవ్వుదురు. వెంటనే ఏడురు. ఇది పిల్లల తత్త్వము.
అట్లుకాక అన్ని సమయముల యందు, సన్నివేశముల యందు, ఒకేతీరున ప్రశాంతముగ నిర్లిప్తముగ నుండుట పెద్దరికము. ఇది వయస్సును రది కాదు. జీవి
లోతును బట్టి వచ్చునది. జీవచైతన్యము సెలయేరువలె సాగినచో నిర్మలముగ నుండును. దూకుట, పడుట జరిగినచో బురదగ నుండును.
ఈ సాధనకు ఒక సత్యమును గ్రహించవలసి యున్నది. “ఎప్పుడు ఎక్కడ, ఎవరికైనను ఏదైనను జరుగవచ్చును.” సృష్టిలో అకస్మాత్ విషయమేమియును లేదు. గ్రహింపు గలవారికి అకస్మార్లు లేవు. అన్నియును సృష్టి యందు క్రమముగనే జరుగును. లోదృష్టి యున్నప్పుడే అది గమనింపబడును. లేనప్పుడు గమనింపబడవు. ఈ అవగాహనతో నిత్యజీవితమును గడుపువారికి విద్యుత్ ఘాతములు (Shocks) అనునవి ఉండవు. ఈ స్థితి జేరుటకు ఒక సులభమగు మార్గమున్నది.
మీ గురువు లేక దైవము యొక్క రూపమునే మొదలు ధ్యానమందు స్థిరపరచుకొనుడు. ఆయన చేతన యందు మీ చేతన లయము చేయుటకు ప్రయత్నింపుడు. వారిలో మీరు లీనమైనట్లు భావింపుడు. తత్ఫలితముగ మీ యందు వారే వసించియున్నట్లు భావింపుడు. ఇది చాల వివరముగ జరుగవలెను.
అప్పుడు మీ గురువు లేక దేవత యొక్క ఎఱుకయే మీ ఎఱుకగ పనిచేయగలదు. సంకల్ప మాత్రమున మీ మనోఫలకముపై మీ సద్గురువు యొక్క రూపముగానీ, మీరు ఆరాధించు దైవము యొక్క రూపముగాని స్పష్టముగ దర్శించ గలిగిననాడు మీకు ఈ సిద్ధి కలుగును. అట్లు జరిగినచో అపుడు, ఆకస్మికములగు అపాయములు, అద్భుతములేమియు నుండవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 59 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. ఎప్పుడు సమయం దొరికినా నీ లోపలికి దూకు. మునక వేయి. కాంతిని దర్శిస్తావు. అది మన జీవన కాంతి. అది అనంత విశ్వకాంతి. ఆ కాంతే దేవుడు. ఆ కాంతి శాశ్వతం. 🍀*
ఎప్పుడు నీకు సమయం దొరికితే బాహ్యాన్ని మరిచిపో. పై పైన వున్న దాన్ని విస్మరించకు. నీ లోపలికి దూకు. మునక వేయి. కాంతిని దర్శిస్తావు. అది మన జీవన కాంతి. అది అనంత విశ్వకాంతి.
పాత రోజుల్లో దాన్ని దేవుడు అనేవాళ్ళు. ప్రస్తుతం ఆ పదం ప్రమాదకరంగా మారింది. మతాలయాల్లో ఆ పదం అరిగిపోయింది. పరిమితమైపోయింది. అందుకని నేను దేవుణ్ణి ఎదుర్కోండి అంటాను. ఆ కాంతే దేవుడు. ఆ కాంతి శాశ్వతం. దాన్ని ఏదీ నాశనం చేయలేదు. అది యాదృచ్ఛికం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 301-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 301-2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*
*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*
*🌻 301-2. 'హ్రీంకారీ' 🌻*
పరిశుద్ధ జీవనము, నిర్మలమైన మనస్సు, దివ్యలోక ప్రవేశము వాంఛించువారు ఈ నామమును స్మరణ చేయుట ఉచితము. ఈ నామము ఒక మంత్రము. దీనిని నిత్యము నిర్దిష్ట సమయములలో నిష్ఠగ హృదయమున స్మరియించుచు, బంగారు కాంతిని దర్శించుచు అనుష్ఠానము చేయువారు వృద్ధి చెందుచు నుందురు.
హిరణ్య లోకమగు బుద్ధిలోక ప్రవేశము కూడ జరుగును. స్మరణ యందలి భక్తిని బట్టి, శ్రద్ధను బట్టి బంగారు కాంతి శరీరమున ఆవరించి శరీరమును కూడ కాంతివంతము చేయును. ఈ నామ ప్రయోజనమును ఇంత అని కొనియాడ వీలు పడదు. సూకరాజమగు శ్రీ సూక్తము 'హ్రీం' శబ్దము తోనే ప్రారంభమగును.
“హిరణ్యవర్ణాం హరిణీం....."
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 301-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀*
*🌻 301-2. Hrīṁkārī ह्रींकारी (301-2) 🌻*
The bindu though tiny, is yet very powerful. There are three major sub divisions in a bindu leading to the union of Śiva and Śaktī, from where the three exclusive actions of the Brahman viz. creation, sustenance and destruction originate. The three major sub divisions are bindu representing Śiva, bīja representing Śaktī and nāda representing their union. A bindu above ha, one of the alphabets of hrīṁ spells like haṁ. This bīja haṁ, a component of hrīṁ represents creation (h), sustenance (a) and destruction (ṁ) the three functions of the Brahman.
The bindu undergoes subtle changes from its origin to delivery. It originates as Parā Śaktī and gets modified as paśyantī, madhyamā and delivered at vaikari, (Please refer nāma 299 for additional details.) At the time of delivery it undergoes modifications through eight stages) by deriving power from five basic elements and gets blessed by Brahma, Viṣṇu and Rudra. It begins its journey from the heart cakra with the letter ‘a’ (अ), moves to the throat cakra and conjoins with ‘u’(उ) and further goes up to palate where it conjoins with ‘ṁ’ (मं), the three components of OM (a + u + ṁ).
From the palate it moves to forehead where it derives its cosmic energy received through the crown cakra, enters the world of śūnya (cosmic vacuum) where no energy operates, moves further up towards the top of the skull establishing a link through brahmarandhra with mahā śūnya (the great cosmic vacuum), where the Creation takes place. When it moves further, the creation becomes transcendental energy and the life begins to exist out of the Self illuminating cosmic brilliance. That is why bindu is said to be in the form of a luminous dot like the sun, born out of the union of Śiva and Śaktī.
There is no differentiation between the bīja hrīṁ and Śiva-Śaktī combine, the point of origin and the point of annihilation of this universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment