26-AUGUST-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 83 / Bhagavad-Gita - 83 - 2-36🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 652 / Bhagavad-Gita -  652 -18-63🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 480 / Vishnu Sahasranama Contemplation - 480🌹
5) 🌹 DAILY WISDOM - 158 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 64 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 304 / Sri Lalitha Chaitanya Vijnanam - 304 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

26, గురువారం, ఆగస్టు, 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ చవితి 17:15:47 వరకు తదుపరి కృష్ణ పంచమి
భాద్రపద - పౌర్ణమాంతం
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: రేవతి 22:30:28 వరకు తదుపరి అశ్విని
యోగం: దండ 29:25:51 వరకు తదుపరి వృధ్ధి 
కరణం: బాలవ 17:18:47 వరకు
వర్జ్యం: - 
దుర్ముహూర్తం: 10:12:12 - 11:02:24 మరియు 
15:13:27 - 16:03:39
రాహు కాలం: 13:51:51 - 15:26:00
గుళిక కాలం: 09:09:26 - 10:43:35
యమ గండం: 06:01:10 - 07:35:18
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
సూర్యోదయం: 06:01:10
సూర్యాస్తమయం: 18:34:17
వైదిక సూర్యోదయం: 06:04:44
వైదిక సూర్యాస్తమయం: 18:30:42
చంద్రోదయం: 21:20:48
చంద్రాస్తమయం: 09:10:52
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు-ఫలితాలు
ఆనందాదియోగం: మిత్ర యోగం - మిత్ర లాభం 22:30:28 వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం 
పండుగలు మరియు పర్వదినాలు :

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 83 / Bhagavad-Gita - 83 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 36 🌴

36. అ అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితా: | నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||

🌷. తాత్పర్యం :
నీ శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది గలదు?

🌷. భాష్యము :
అర్జునుని అవాంఛితమైన జాలిని గాంచి శ్రీకృష్ణభగవానుడు తొలుత దిగ్బ్రాంతి చెందెను. అట్టి జాలి అనార్యులకు మాత్రమే తగినదని అతడు తెలియజేసెను. ఈ విధముగా భగవానుడు పలువాక్యములతో అర్జునుని అవాంఛిత కరుణకు విరుద్ధముగా తన వాదమును నిరూపణ చేసియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 83 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 36 🌴

36. avācya-vādāṁś ca bahūn vadiṣyanti tavāhitāḥ nindantas tava sāmarthyaṁ tato duḥkha-taraṁ nu kim

🌻 Translation :
Your enemies will describe you in many unkind words and scorn your ability. What could be more painful for you?

🌻 Purport :
Lord Kṛṣṇa was astonished in the beginning at Arjuna’s uncalled-for plea for compassion, and He described his compassion as befitting the non-Āryans. Now in so many words, He has proved His statements against Arjuna’s so-called compassion.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 652 / Bhagavad-Gita - 652 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 63 🌴*

63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||

🌷. తాత్పర్యం : 
ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి, పిదప తోచిన రీతి ఒనరింపుము.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బ్రహ్మభూతజ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించెను. బ్రహ్మభూతస్థితి యందున్నవాడు సదా ఆనందపూర్ణుడై యుండును. అతడు శోకించుటను యొరుగడు మరియు దేనిని వాంచింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూతజ్ఞానమే కారణము. 

బ్రహ్మభూతజ్ఞానమునే గాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము సైతము అర్జునునకు తెలియపరిచెను. అదియును బ్రహ్మజ్ఞానమేయైనను బ్రహ్మభూతజ్ఞానము కన్నను ఉన్నతమైనది.

ఇచ్చట “యథేచ్చసి తథా కురు” అను పదము శ్రీకృష్ణభగవానుడు జీవులకు గల అతిసూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యము కలుగచేసికొనడని సూచించుచున్నది. 

మానవుడు ఏ విధముగా తన జీవనస్థితిని వృద్ధిచేసికొనగలడో శ్రీకృష్ణభగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరిచియున్నాడు. హృదయస్థుడైన పరమాత్మునకు శరణుపొందుమని అర్జునునకు ఒసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరియైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపవలసియున్నది. 

అట్టి అంగీకారము మనుజుడు సదా మానవజన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితియైనటువంటి కృష్ణభక్తిభావనలో నిలిచియుండుటకు తోడ్పడగలదు. యుద్ధము చేయుమని అర్జునుడు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. 

భగవానుని శరణువేడుట జీవుల లాభమునకే గాని, భగవానుని లాభము కొరకు కాదు. కాని శరణాగతికి ముందు తమ బుద్ధిననుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసికొనుటకు ప్రతియొక్కరు స్వాతంత్ర్యమును కలిగియున్నారు. అదియే దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును ఆంగీకరించుటకు ఉత్తమమార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి కూడా లభింపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 652 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 63 🌴*

63. iti te jñānam ākhyātaṁ guhyād guhya-taraṁ mayā
vimṛśyaitad aśeṣeṇa yathecchasi tathā kuru

🌷 Translation : 
Thus I have explained to you knowledge still more confidential. Deliberate on this fully, and then do what you wish to do.

🌹 Purport :
The Lord has already explained to Arjuna the knowledge of brahma-bhūta. One who is in the brahma-bhūta condition is joyful; he never laments, nor does he desire anything. That is due to confidential knowledge. Kṛṣṇa also discloses knowledge of the Supersoul. This is also Brahman knowledge, knowledge of Brahman, but it is superior.

Here the words yathecchasi tathā kuru – “As you like, you may act” – indicate that God does not interfere with the little independence of the living entity. In Bhagavad-gītā, the Lord has explained in all respects how one can elevate his living condition. 

The best advice imparted to Arjuna is to surrender unto the Supersoul seated within his heart. By right discrimination, one should agree to act according to the order of the Supersoul. 

That will help one become situated constantly in Kṛṣṇa consciousness, the highest perfectional stage of human life. Arjuna is being directly ordered by the Personality of Godhead to fight. Surrender to the Supreme Personality of Godhead is in the best interest of the living entities. It is not for the interest of the Supreme. 

Before surrendering, one is free to deliberate on this subject as far as the intelligence goes; that is the best way to accept the instruction of the Supreme Personality of Godhead. Such instruction comes also through the spiritual master, the bona fide representative of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 480 / Vishnu Sahasranama Contemplation - 480 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
 
*🌻 480. క్షరమ్‌, क्षरम्‌, Kṣaram 🌻*

*ఓం క్షరాయ నమః | ॐ क्षराय नमः | OM Kṣarāya namaḥ*

క్షరం సర్వం భూతజాతం 

సర్వ భూతములూ నశించునవి కావున అవి 'క్షరమ్‍' అనబడుతాయి. అవీ విష్ణువే!

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥ 16 ॥

ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అనగా మనస్సుయొక్క అభిమాని అక్షరుడనియు చెప్పబడుచున్నారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 480 🌹*
📚. Prasad Bharadwaj

*🌻480. Kṣaram🌻*

*OM Kṣarāya namaḥ*

क्षरं सर्वं भूतजातं / Kṣaraṃ sarvaṃ bhūtajātaṃ 

All beings perish at some point of time. They are fallible. Hence they are called 'Kṣaram'. Even these are manifestation of Lord Viṣṇu.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरस्सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ १६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Dvāvimau puruṣau loke kṣaraścākṣara eva ca,
Kṣarassarvāṇi bhūtāni kūṭastho’kṣara ucyate. 16.

There are two persons (entities) in the world. The mutable (Kṣara) and the immutable (Akṣara). The mutable consists of all things whereas the indwelling infallible entity is immutable.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 158 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 6. Psychoanalytic Psychology 🌻*

When I say there is a conflict between the ideal and the real, I mean that this conflict occurs in every type of life that one leads and in every stage of life in which one finds oneself. In our personal lives we have this conflict, in our social lives we have this very same conflict, in our political and national lives we have this conflict, and in international life we have this conflict between the ideal and the real—the real conflict between what ought to be and what really is. 

This is also the theme of a subject which comes from the West called ‘psychoanalytic psychology’. We need not go into the details of its techniques as practised in the West, but I am just mentioning the basic principles implied in this science. If conflict is visible everywhere in life, and if this conflict must be resolved if man is to be happy, what is the way to resolve this conflict? This was a question with which analytic psychology concerned itself. The ideal conflicts with the real, and here we are confronted in life with the devil, as it were.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 64 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనిషి అనంత వేదనతో దేని కోసమయినా మరణించడానికి సిద్ధపడితే, సంఘర్షిస్తే, ఆ సంఘర్షణ నించే అతను జన్మిస్తాడు. వీలయినంత మేరకు సాధికారంగా జీవించడం, దానికై ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడం వల్ల ఆత్మ ఆవిర్భవిస్తుంది. 🍀*

ప్రపంచంలో అత్యంత సాహసమయిన విషయం ఇతరులని అనుకరించకుండా వుండడం. వీలయినంత మేరకు సాధికారంగా జీవించడం, దానికై ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడం అర్థవంతమయిన జీవితాన్ని జీవించడానికి ఎట్లాంటి ప్రమాదాలకయినా లోను కావడం అపుడే ఆత్మ ఆవిర్భవిస్తుంది. మనిషి అనంత వేదనతో దేని కోసమయినా మరణించడానికి సిద్ధపడితే, సంఘర్షిస్తే, ఆ సంఘర్షణ నించే అతను జన్మిస్తాడు. జననం బాధ. దానికి సాహసం అవసరం. ధైర్యం అవసరం. 

సలహాలిచ్చే నీతివాదులు, మత పెద్దలు, బుద్ధిహీనులు వాళ్ళనించీ దూరంగా వుండు. నీ జీవితాన్ని నువ్వు జీవించు. యితర్లు చెప్పనట్లు జీవించడం కన్నా ఒక వేళ పొరపాట్లు చేసినా నీ అంతకు నువ్వు జీవించు. ఇతర్లని అనుసరించే వాళ్ళు తప్పుడు మార్గంలో వుంటారు. తనంతకు తను జీవించేవాడు తన తప్పుల నించీ నేర్చుకుంటాడు. ఎదుగుతాడు. లాభపడతాడు. నీ సొంతంగా ఏమయినా చేయి. నీ పొరపాట్లు కూడా నీకే పాఠాలే అవుతాయి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 304 / Sri Lalitha Chaitanya Vijnanam - 304🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*
*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*

*🌻 304. 'హేయోపాదేయవర్జితా'🌻* 

ఇష్టా యిష్టములకు అతీతమైనది శ్రీమాత అని అర్థము. శ్రీమాత మహా చైతన్యము. ఆ చైతన్య మాధారముగనే సమస్త జీవకోటి యేర్పడి యున్నది. అందరి యందు ఆమె లక్షణములే
యుండును. మూడు గుణములు ఐదు భూతములుగ, అష్ట ప్రకృతులుగ ఆమె అవతరించు చుండును. రూపముల కామె ఆధారము. ఆమె అష్ట ప్రకృతుల నుండియే రూపము లేర్పడుచున్నవి. వాటి స్వభావము లేర్పడుచున్నవి. 

అష్ట ప్రకృతుల రసాయనమును బట్టి రూపములు వాటి స్వభావములు వుండును. ఆమె మూల ప్రకృతి. తొమ్మిదవది. ఆమె యందు శివతత్త్వము వసించి యుండును. హీనమగు రూపములు, ఉత్తమములగు రూపములుగ కూడ తానే యున్నది. కుక్క, పిల్లి, పంది వంటి రూపములుగను; ఋషులు, మునులు, దేవతల రూపములుగను ఆమెయే యున్నది. ఇట్లు హేయము, ఉపాదేయము అని భావింపక అన్నిటి యందు నిండి యున్నది. ఇట్లుండుట జీవులకు సాధ్యపడు విషయము కాదు.

ఉత్తమ మగు సంస్కారము గలవారు హీనమగు రూపముల యందు, ప్రదేశముల యందు వుండుట కిచ్చగింపరు, శుచి శుభ్రతలను కోరు చుందురు. శుచి, అశుచి భేదము లేక యుండుట ఊహింప నలవి కాని విషయము. ద్వంద్వములు దాటుట సృష్టి కతీతముగ నుండువారికే వీలుపడును. సృష్టికతీతముగ తానుండి సృష్టిలోనికి వ్యాప్తి చెందుచు, తిరోధానము చెందుచు యిష్టా యిష్టములతో సంబంధము లేక యుండుట శ్రీమాతకే తగును. అంతటా నిండి యున్ననూ అవి అన్నియూ తన యందే యిమిడి యుండుట వలన సాధ్యపడుచున్నది. 

తానే అంతయుగ నున్నది గనుక తన కా రూపములు వేరుగ లేవు. వానికి మాత్రము తా నున్నది. మట్టి కుండగ యున్ననూ కుండ భావములు పొందదు. కుండ యందు మట్టిగనే యుండును. కుండయైనను, బొచ్చె అయినను, ముంత అయినను, ప్రమిదయైననూ మట్టి మట్టిగనే యుండును. చేతి గాజుయైనను, గొలుసుయైనను, కంఠాభరణమైనను, ఉంగరమైనను బంగారము, బంగారముగనే యుండును. అంతయూ తానై యుండుటచేత, మరొకటి లేని స్థితి యుండుటచేత యిష్టాయిష్టము లుండవు. ఉండుట కవకాశము కూడ లేదు. శ్రీకృష్ణుడీ రహస్యమునే అర్జునునికి ఉపదేశించెను. అది రాజ రజస్యమని కూడ తెలిపెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 304 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀*

*🌻 304. Heyopādeya-varjitā हेयोपादेय-वर्जिता (304) 🌻*

She has nothing to reject and nothing to accept. Rejection and acceptance (do this and do not do this) are laid down by scriptures. The source of these scriptures is the Veda-s and based on certain procedures followed by our ancestors. 

These are the rules and regulations that permit certain actions and prohibit certain others. These are also known as śāstra-s. Śāstra-s generally can be explained as compendium of rules or a book of treatise. Many of the śāstra-s are based on the procedures followed by our ancestors.  

The guideline that was applicable centuries ago may not be applicable in today’s situation. Therefore, there is no point in following śāstra-s without understanding their significance. Adjusting to the present day living is not a sin. Such rejections and acceptances are applicable only to human beings and not to the Brahman. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment