నిర్మల ధ్యానాలు - ఓషో - 64


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 64 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి అనంత వేదనతో దేని కోసమయినా మరణించడానికి సిద్ధపడితే, సంఘర్షిస్తే, ఆ సంఘర్షణ నించే అతను జన్మిస్తాడు. వీలయినంత మేరకు సాధికారంగా జీవించడం, దానికై ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడం వల్ల ఆత్మ ఆవిర్భవిస్తుంది. 🍀


ప్రపంచంలో అత్యంత సాహసమయిన విషయం ఇతరులని అనుకరించకుండా వుండడం. వీలయినంత మేరకు సాధికారంగా జీవించడం, దానికై ఎట్లాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడం అర్థవంతమయిన జీవితాన్ని జీవించడానికి ఎట్లాంటి ప్రమాదాలకయినా లోను కావడం అపుడే ఆత్మ ఆవిర్భవిస్తుంది. మనిషి అనంత వేదనతో దేని కోసమయినా మరణించడానికి సిద్ధపడితే, సంఘర్షిస్తే, ఆ సంఘర్షణ నించే అతను జన్మిస్తాడు. జననం బాధ. దానికి సాహసం అవసరం. ధైర్యం అవసరం.

సలహాలిచ్చే నీతివాదులు, మత పెద్దలు, బుద్ధిహీనులు వాళ్ళనించీ దూరంగా వుండు. నీ జీవితాన్ని నువ్వు జీవించు. యితర్లు చెప్పనట్లు జీవించడం కన్నా ఒక వేళ పొరపాట్లు చేసినా నీ అంతకు నువ్వు జీవించు. ఇతర్లని అనుసరించే వాళ్ళు తప్పుడు మార్గంలో వుంటారు. తనంతకు తను జీవించేవాడు తన తప్పుల నించీ నేర్చుకుంటాడు. ఎదుగుతాడు. లాభపడతాడు. నీ సొంతంగా ఏమయినా చేయి. నీ పొరపాట్లు కూడా నీకే పాఠాలే అవుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Aug 2021

No comments:

Post a Comment