శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 304 / Sri Lalitha Chaitanya Vijnanam - 304


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 304 / Sri Lalitha Chaitanya Vijnanam - 304🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 304. 'హేయోపాదేయవర్జితా'🌻


ఇష్టా యిష్టములకు అతీతమైనది శ్రీమాత అని అర్థము. శ్రీమాత మహా చైతన్యము. ఆ చైతన్య మాధారముగనే సమస్త జీవకోటి యేర్పడి యున్నది. అందరి యందు ఆమె లక్షణములే

యుండును. మూడు గుణములు ఐదు భూతములుగ, అష్ట ప్రకృతులుగ ఆమె అవతరించు చుండును. రూపముల కామె ఆధారము. ఆమె అష్ట ప్రకృతుల నుండియే రూపము లేర్పడుచున్నవి. వాటి స్వభావము లేర్పడుచున్నవి.

అష్ట ప్రకృతుల రసాయనమును బట్టి రూపములు వాటి స్వభావములు వుండును. ఆమె మూల ప్రకృతి. తొమ్మిదవది. ఆమె యందు శివతత్త్వము వసించి యుండును. హీనమగు రూపములు, ఉత్తమములగు రూపములుగ కూడ తానే యున్నది. కుక్క, పిల్లి, పంది వంటి రూపములుగను; ఋషులు, మునులు, దేవతల రూపములుగను ఆమెయే యున్నది. ఇట్లు హేయము, ఉపాదేయము అని భావింపక అన్నిటి యందు నిండి యున్నది. ఇట్లుండుట జీవులకు సాధ్యపడు విషయము కాదు.

ఉత్తమ మగు సంస్కారము గలవారు హీనమగు రూపముల యందు, ప్రదేశముల యందు వుండుట కిచ్చగింపరు, శుచి శుభ్రతలను కోరు చుందురు. శుచి, అశుచి భేదము లేక యుండుట ఊహింప నలవి కాని విషయము. ద్వంద్వములు దాటుట సృష్టి కతీతముగ నుండువారికే వీలుపడును. సృష్టికతీతముగ తానుండి సృష్టిలోనికి వ్యాప్తి చెందుచు, తిరోధానము చెందుచు యిష్టా యిష్టములతో సంబంధము లేక యుండుట శ్రీమాతకే తగును. అంతటా నిండి యున్ననూ అవి అన్నియూ తన యందే యిమిడి యుండుట వలన సాధ్యపడుచున్నది.

తానే అంతయుగ నున్నది గనుక తన కా రూపములు వేరుగ లేవు. వానికి మాత్రము తా నున్నది. మట్టి కుండగ యున్ననూ కుండ భావములు పొందదు. కుండ యందు మట్టిగనే యుండును. కుండయైనను, బొచ్చె అయినను, ముంత అయినను, ప్రమిదయైననూ మట్టి మట్టిగనే యుండును. చేతి గాజుయైనను, గొలుసుయైనను, కంఠాభరణమైనను, ఉంగరమైనను బంగారము, బంగారముగనే యుండును. అంతయూ తానై యుండుటచేత, మరొకటి లేని స్థితి యుండుటచేత యిష్టాయిష్టము లుండవు. ఉండుట కవకాశము కూడ లేదు. శ్రీకృష్ణుడీ రహస్యమునే అర్జునునికి ఉపదేశించెను. అది రాజ రజస్యమని కూడ తెలిపెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 304 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀


🌻 304. Heyopādeya-varjitā हेयोपादेय-वर्जिता (304) 🌻


She has nothing to reject and nothing to accept. Rejection and acceptance (do this and do not do this) are laid down by scriptures. The source of these scriptures is the Veda-s and based on certain procedures followed by our ancestors.

These are the rules and regulations that permit certain actions and prohibit certain others. These are also known as śāstra-s. Śāstra-s generally can be explained as compendium of rules or a book of treatise. Many of the śāstra-s are based on the procedures followed by our ancestors.

The guideline that was applicable centuries ago may not be applicable in today’s situation. Therefore, there is no point in following śāstra-s without understanding their significance. Adjusting to the present day living is not a sin. Such rejections and acceptances are applicable only to human beings and not to the Brahman.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Aug 2021

No comments:

Post a Comment