శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 296 -2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 296 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 296 -2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀
🌻 296. 'అనాది నిధనా' - 2 🌻
అష్టసిద్ధులు ఈ విధముగ నున్నవి.
1. సరియగు ఊహ.
2. వినుట ద్వారా సర్వమును ఎఱుగుట.
3. గురూపదేశము నెరుగుట.
4. మంచి స్నేహితులను పొందుట.
5. సత్పురుషుల యొక్క శుశ్రూష.
6. భౌతిక దేహ సంపూర్ణ సహకారము.
7. స్వభావ సహకారము.
8. ప్రార్థనా ధ్యానాదులయందు ప్రజ్ఞ స్థిరమై దైవ సాన్నిధ్యము నందుండుట.
ఈ విధముగ 28 వధలు- బుద్ధిరాహిత్యము వలన (11), తుష్టి లేమి వలన (9), సిద్ధి లేమి వలన (8) కలుగుచున్నవి. ఈ అవరోధములు తొలగినచో వధ రూపమైన మరణములు దాట వచ్చును.
ఈ ఇరువది ఎనిమిదియూ జీవునికి మరణహేతువులే. అనగా తాను శాశ్వత ధర్మ స్వరూపుడను సత్యమును మరుగు పఱచి అజ్ఞానపు మార్గములలో పడవేయును. వీని వలననే రాబోవు జన్మలలో గ్రుడ్డితనము, చెవిటితనము, మూగతనము కలుగుట మరియు అంగవైకల్యములతో పుట్టుట జరుగుచుండును.
ఇక పాశ మరణములు 52గ వివరింపబడినవి. "ఆశాపాశము తా గడున్ విడుపు లేదు రాజేంద్రా! ” అని భాగవతమున బోధింప బడినది. ఆశకు అంతు లేదు. అహంకార మున్నంత కాలము ఆశ వుండును. పదమూడు లోకములలో, నాలుగు స్థితులలో జీవు లందరికిని ఏదో ఒక ఆశ. ఈ ఆశ దైవమును గూర్చి కానపుడు మరణము తథ్యము. ఇట్టి పలువిధములగు మరణములను శ్రీమాత దాటించగలదు. అందులకే ఆమె ఆరాధనము. ఈ పై వివరణ మంతయూ అనాది అను పదమును గూర్చి. దాని నంత మొందించునది శ్రీదేవి గనుక ఆమె 'ఆనాదినిధనా' అయి వున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 296 -2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀
🌻 296. Anādi-nidhanā अनादि-निधना (296) - 2 🌻
Anādi means existing from eternity and nidhana means domicile. Nidhana also means destruction. Sāṃkhya sūtra (III.38, 39 and 40) refers to three types of destructions (in fact, they are not destructions but distractions), “Inability is twenty eight fold; Acquiescence is nine fold; Perfection is eight fold.” Inability means depravation.
One can worship Her using his organs of perception (jñānendriya-s), five cognitive faculties (knowledge) and the mind. If they become dysfunctional, She cannot be worshipped. The cause of dysfunction is known as aśaktī. There are two other distractions. One is tuṣṭi, satisfaction personified. This arises out of illusion. For example, having a false feeling of emancipation is tuṣṭi, which is again divided into two types.
The third is siddhi-s, the acquisition of supernatural powers by magical means or the supposed faculty so acquired (the eight usually enumerated are given in the following verse, “aṇimā laghimā prāptiḥ prākāmyam mahimā tathā īśitvaṃ ca vaśitvaṃ ca tathā kāmāvasāyitā”. These siddhi-s are hindrance to the Ultimate realisation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment