నిర్మల ధ్యానాలు - ఓషో - 53
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 53 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రార్థన అన్నది నిశ్శబ్దం నించీ అనివార్యంగా ఆవిర్భవించేది. అది నిశ్శబ్ద పరిమళం. నిశ్శబ్దాన్ని సృష్టించడంతో నీ పని పూర్తి అయ్యాకా ప్రార్థన దానంతట అదే వస్తుంది. నిశ్శబ్దాన్ని సృష్టిస్తే ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది. 🍀
ప్రార్థన అంటే నిశ్శబ్దం మినహా మరేమీ కాదు. స్వచ్ఛమైన నిశ్శబ్దం. నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పవు. దాని ముందు మరేదీ వుండదు. నీ చైతన్యంలో ఎట్లాంటి విషయమూ వుండదు. నీ చైతన్య సదస్సులో కేవలం చిన్ని అల కూడా వుండదు. అంతా నిశ్చలంగా, నిర్మలంగా వుంటుంది. అక్కడ ఏదీ చెప్పడము వుండదు. ఏదీ వినడమూ వుండదు. గుండె సవ్వడి, రక్తప్రసరణ, పరిసరాల్ని ఆక్రమించిన అనంత దయ, అపూర్వ అనుభూతి యివన్నీ సమస్త అస్తిత్వానికి మనల్ని అవగతం చేస్తాయి. అదే ప్రార్థన.
అందువల్ల నేను ప్రార్థన గురించి బోధించను. నిశ్శబ్దం గురించి చెబుతాను. కారణం ప్రార్థన అన్నది నిశ్శబ్దం నించి అనివార్యంగా ఆవిర్భవించేది. అది నిశ్శబ్ద పరిమళం. నిశ్శబ్దాన్ని సృష్టించడంతో నీ పని పూర్తి అయ్యాకా ప్రార్థన దానంతట అదే వస్తుంది. అది వసంతం లాంటిది. వృక్షాలన్నీ పూలతో కళకళలాడుతాయి. నిశ్శబ్దాన్ని నువ్వు సృష్టిస్తే వసంతాన్ని సృష్టించినట్లే. అప్పుడు పూలు ఎంతో దూరంలో వుండవు. అవి సమీపంలో నవ్వుతూ వుంటాయి. నిశ్శబ్దాన్ని సృష్టిస్తే ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment