2) 🌹. శ్రీమద్భగవద్గీత - 138 / Bhagavad-Gita - 138 - 3-19🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 535 / Vishnu Sahasranama Contemplation - 535 🌹
4) 🌹 DAILY WISDOM - 213🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 52🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 118🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-2🌹
🌹. పుష్య మాసం విశిష్టత 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 03, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్రనమక స్తోత్రం-5 🍀*
*యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!*
*రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!*
*అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!*
*అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
పౌష్య మాసం
తిథి: శుక్ల పాడ్యమి 20:33:17 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పూర్వాషాఢ 13:34:52 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యాఘత 25:24:59 వరకు
తదుపరి హర్షణ
కరణం: కింస్తుఘ్న 10:17:40 వరకు
వర్జ్యం: 00:51:36 - 02:16:12
మరియు 20:41:00 - 22:06:36
సూర్యోదయం: 06:46:45
సూర్యాస్తమయం: 17:54:08
వైదిక సూర్యోదయం: 06:50:37
వైదిక సూర్యాస్తమయం: 17:50:15
చంద్రోదయం: 07:16:37
చంద్రాస్తమయం: 18:35:14
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దుర్ముహూర్తం: 12:42:41 - 13:27:11
మరియు 14:56:10 - 15:40:40
రాహు కాలం: 08:10:10 - 09:33:36
గుళిక కాలం: 13:43:52 - 15:07:17
యమ గండం: 10:57:01 - 12:20:26
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:42
అమృత కాలం: 09:19:12 - 10:43:48
మరియు 29:14:36 - 30:40:12
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య
నాశనం 13:34:52 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -138 / Bhagavad-Gita - 138 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 19 🌴*
*19. తస్మాదసక్త: సతతం కార్యం కర్మ సమాచర |*
*ఆసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష: ||*
🌷. తాత్పర్యం :
*కనుక ప్రతియొక్కరు కర్మఫలముల యందు ఆసక్తిని గొనక తన విధియని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు.*
🌷. భాష్యము :
భక్తులకు “పరము” అనునది దేవదేవుడైన శ్రీకృష్ణుడు కాగా, నిరాకారవాదికి మోక్షమై యున్నది. కనుక సరియైన నిర్దేశమునందు కర్మఫలము నెడ సంగము లేకుండా కృష్ణుని కొరకై కర్మను చేయువాడు (కృష్ణభక్తిరసభావితుడు) తప్పక జీవితపు పరమలక్ష్యము వైపుకు పురోగమించును. కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణుని కొరకే యుద్ధము చేయుమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణుడు కోరియుండుటయే అందులకు కారణము. సాధువుగా లేదా అహింసాత్మకునిగా వర్తించుట యనునది సంగత్వమును కూడినది. కాని భగవానుని పక్షమున కర్మచేయుట ఫలమునందాసక్తి లేకుండా వర్తించుట వంటిది. పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన అత్యుత్తమ పూర్ణకర్మమదియే.
ఇంద్రియభోగానుభవమునందు ఒనర్చబడు పాపకర్మలను శుద్ధిపరచుట కొరకే యజ్ఞముల వంటి వేదవిహితకర్మలు నిర్వహింపబడును. కాని కృష్ణభక్తి యందలి కర్మలు శుభాశుభకర్మఫలములకు అతీతములై యున్నవి. కృష్ణభక్తుడైనవాడు కర్మఫలములందు ఆసక్తుడు గాక, కేవలము కృష్ణుని తరపున కర్మను సాగించును. అతడు అన్నిరకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అసంగుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 138 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 19 🌴*
*19. tasmād asaktaḥ satataṁ kāryaṁ karma samācara*
*asakto hy ācaran karma param āpnoti pūruṣaḥ*
🌷Translation :
*Therefore, without being attached to the fruits of activities, one should act as a matter of duty, for by working without attachment one attains the Supreme.*
🌷 Purport :
The Supreme is the Personality of Godhead for the devotees, and liberation for the impersonalist. A person, therefore, acting for Kṛṣṇa, or in Kṛṣṇa consciousness, under proper guidance and without attachment to the result of the work, is certainly making progress toward the supreme goal of life.
Arjuna is told that he should fight in the Battle of Kurukṣetra for the interest of Kṛṣṇa because Kṛṣṇa wanted him to fight. To be a good man or a nonviolent man is a personal attachment, but to act on behalf of the Supreme is to act without attachment for the result. That is perfect action of the highest degree, recommended by the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa.
Vedic rituals, like prescribed sacrifices, are performed for purification of impious activities that were performed in the field of sense gratification. But action in Kṛṣṇa consciousness is transcendental to the reactions of good or evil work. A Kṛṣṇa conscious person has no attachment for the result but acts on behalf of Kṛṣṇa alone. He engages in all kinds of activities, but is completely nonattached.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 535 / Vishnu Sahasranama Contemplation - 535🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 535. త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ 🌻*
*ఓం త్రిదశాధ్యక్షాయ నమః | ॐ त्रिदशाध्यक्षाय नमः | OM Tridaśādhyakṣāya namaḥ*
త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ
గుణావేశేన సఞ్జాతా అవస్థా జాగ్రదాదయః ।
త్రిసో దశాస్తదధ్యక్ష స్త్రిదశాధ్యక్ష ఉచ్యతే ॥
*సత్త్వము మొదలగు ఆయాగుణముల ఆవేశముచే కలుగు జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశలకు మూడిటికిని అధ్యక్షుడు అనగా వానికి పైన తానుండి వానిని సాక్షాత్తుగా అవి తానై చూచువాడు గనుక ఆ దేవ దేవునికి త్రిదశాధ్యక్షః అను నామముగలదు.*
:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ...జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు లెవ్వనిచేత గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగి ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన బుద్ధిబేదంబుల నాత్మ నెరుంగందగు నని చెప్పి. (237)
*...జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు! సుమాలకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములూ, కర్మజన్యములూ అయిన బుద్ధిబేదాల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 535🌹*
📚. Prasad Bharadwaj
*🌻 535. Tridaśādhyakṣaḥ 🌻*
*OM Tridaśādhyakṣāya namaḥ*
गुणावेशेन सञ्जाता अवस्था जाग्रदादयः ।
त्रिसो दशास्तदध्यक्ष स्त्रिदशाध्यक्ष उच्यते ॥
Guṇāveśena sañjātā avasthā jāgradādayaḥ,
Triso daśāstadadhyakṣa stridaśādhyakṣa ucyate.
*By the combination with guṇas i.e., Sattva, Rajas and Tamas - arise three states of the mind viz., jāgrat (awake), svapna (dream) and suṣupti (deep sleep). He being unaffected by them, presides upon these states as the witness and hence He is Tridaśādhyakṣaḥ.*
:: श्रीमद्भागवते सप्तमस्कन्धे सप्तमोऽध्यायः ::
बुद्धेर्जागरणं स्वप्नः सुषुप्तिरिति वृत्तयः ।
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ॥ २५ ॥
Śrīmad Bhāgavata - Canto 7, Chapter 7
Buddherjāgaraṇaṃ svapnaḥ suṣuptiriti vrttayaḥ,
Tā yenaivānubhūyante so’dhyakṣaḥ puruṣaḥ paraḥ. 25.
*The state of mind or intelligence can be perceived in three states of activity - wakefulness, dreaming and deep sleep. The entity which perceives these three is to be considered the original master, the ruler and the Supreme Lord.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ krtajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśrṃgaḥ krtāntakrt ॥ 57 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 213 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 31. God Never Withdraws His Grace 🌻*
*God manifests Himself at all times, and this manifestation is a perpetual process. Divine grace is like the flood of a river or the flow of the oceanic waves that never cease. God never withdraws His grace; He is an unconditional Giver. There is a perpetual flow of charity from the benign hands of the Almighty, and His charity is not merely material. He is not giving something out of Himself—He is giving Himself. The charity that comes from God is not a charity of objects, as is the case with the charity of people—it is a sacrifice of Himself that He makes.*
*A self-abandonment is performed by the great Almighty in the incarnation that He takes, in the blessings that He gives, and in the grace that He bestows. So there is a great solace for all of us in the midst of the turmoil of life, in the sorrows of our days and the grief through which we are passing every moment of time. Yada yada hi dharmasya glanir bhavati bharata, abhyutthanam adharmasya tadatmanam srjmyaham. Paritranaya sadhunam vinasaya ca duskrtam, dharma-samsthapanarthaya sambhavami yuge yuge (Gita 4.7-8) is an eternal gospel. This one gospel is enough to keep us rejoicing day and night, completely forgetful of all the apparent sorrows of life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 52 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 40. నీరు 🌻*
*పరిశుద్ధ జీవనమునకు పవిత్రమైన నీరు ఎంతో ముఖ్యము. నీటి పవిత్రత దేహమునకు, మనస్సునకు కూడ పవిత్రత కలిగించ గలదు. ఈ విషయమును మానవజాతి అశ్రద్ధ వహించి యున్నారు. నీటిని రకరకములైన రసాయనములతో శుద్ధి చేసుకొనుట పరిపాటి అయినది. నిజమునకు అట్లు చేయుటలో నీటియందు సహజముగ గల రసములు అదృశ్యమగును. నీటిని మరిగించి త్రాగుట ఆరోగ్యకరమని మరికొందరి భావన. మరిగించిన నీటి యందు కొన్ని జీవకణములు మరణించును. నిజమునకు జీవము నీరే! దానిని మరిగించి నప్పుడు కొన్ని సూక్ష్మక్రిములు నశించుటతో పాటు, ఆ నీరు చల్లార్చిన సమయమున కొన్ని చచ్చిన కణములు వాతావరణము నుండి ఆకర్షింపబడును. మరిగించి, చల్లార్చిన వెనుక త్రాగిన నీరు మెదడును మందముగ తయారుచేయగలదని మా హెచ్చరిక.*
*మరిగించిన నీరు త్రాగు అభ్యాసము కలవారు ఆ నీటిని వేడిగనే త్రాగవలెను. నీరు దాహము తీర్చుటయే కాక ప్రాణశక్తిని కూడ పెంపొందించును. తీవ్రమైన గాయములు కూడ పవిత్రమైన నీటిలో ముంచి నపుడు నయమగుట మేమెరిగిన సత్యము. పవిత్ర జలమునందు పటిష్టమైన ఔషధ బలము కలదు. మమ్మ అనుసరించు బృందములు నీరు విషయమున అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి యుండవలెను. నీటి వాడకము విషయమున పై మెలకువలను అనుసరించి ఆరోగ్య వంతులుగ నుండవలెను.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 118 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణము అవుతుంది. 🍀*
*ఉనికిలో నాట్యం చేయని పక్షంలో నీలో ఎట్లాంటి నాట్యానికి అవకాశం లేదు. నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. నిన్ను నువ్వు వదిలించుకో. అప్పుడు నీకూ వునికికి మధ్య నీతనమన్నది అడ్డంకిగా వుండదు.*
*అహాన్ని అంటే నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణమవుతుంది. అప్పుడు అనంతం లక్షల ఆనందాల్ని ప్రదర్శిస్తుంది. లక్షల పూలని వికసిస్తుంది. అప్పుడు ఆనందం శాశ్వతమవుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 335-2. 'వేదవేద్యా' 🌻*
*సంకల్పము పుట్టినచోటు శ్రీదేవి గృహమునకు తూర్పు ద్వారము. దానిని గూర్చి ధ్యానించుట ద్వారా తూర్పు ద్వారమునుండి శ్రీదేవి చింతామణి గృహమున ప్రవేశింప వచ్చును. జీవుల యందు ప్రాణ స్పందన మున్నది. ఈ ప్రాణ స్పందనమే సామగానము. అది హంస గానమువలె హృదయమున స్థితిగొని యున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములే హంస రెక్కలు. వానికి మూలమైన స్పందనము హంస. ఈ హంస 'సోహం' అను ద్వయాక్షరీ గానము చేయుచు నుండును. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా హంసగానమును చేరి గానము ఆధారముగ యానము సాగించినచో హృదయ మందలి హంస మన యందలి ఉత్తర దిక్కునకు కొనిపోగలదు.*
*మనయందలి శిఖే ఉత్తర దిక్కు. ఇట్లు హృదయము నుండి శిఖకు గాన మాధారముగ యానము చేయుట సామవేదము నుపాసించుట. ఇట్లు పాసించువారు ఉత్తర ద్వారమున శ్రీమాత గృహమును చేరి ఆమె దర్శనమును పొందగలరు. యజుర్వేదము దక్షిణ దిక్కు యజుర్వేదము యజ్ఞార్థ జీవనమును సూచించును. అనగా పరహిత జీవనమే జీవనమని తెలుపును. పరహిత మొనర్చుచు తనను తాను మైమరచువాడు ఈ మార్గమున దక్షిణ ద్వారమును చేరగలడు. ఇట్టివారు లోకహితులు. వీరికిని శ్రీమాత దర్శనమనుగ్రహింపబడును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 335-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 335-2. Veda-vedyā वेद-वेद्या (335) 🌻*
{Further reading on Veda-s: The Veda-s (वेद) are the most important treatise to the humanity. They are in classical Sanskrit language that was widely used in ancient Aryan times. The Vedic verses can be interpreted from various angles like literature, spiritual, religious, grammar, philosophy etc. Though there are interpretations on Veda-s available today, it is doubtful whether they truly convey the intended meaning. This is not because of defective interpretations or lack of efficiency of the interpreters, but mainly due to the abilitie-s of Veda-s to communicate both gross and subtle renditions.
A careful reading of Vedic verses reveals that they deal with symbolic separation of bodily organs of the performer and offered to higher energy fields for purification. Veda-s never advocated physical slaying of animals. But it is wrongly interpreted that various organs of an animal are offered as oblations. Veda-s originated from divine commune. For a long time, they were not penned down as the verses and were channeled from a master to his disciples. The sages have chosen the oral path for communication as these verses relied more on orthoepy to prevent any distortions. Most of the texts of Veda-s are in the form of verses. These are called mantra verses and their oral delivery largely depends on phonics and rhythm. There are portions of prose as well and they are known as Brāhmaṇa (ब्राह्मण) passages. These passages explain the procedures for rituals and dwell more on the practical side.
There are four Veda-s, Rig, Yajur, Sāma and Atharva (ऋग्, यजुर्, साम, अथर्व). The first three are known as trividyā (त्रिविद्या) (literal translation – three types of knowledge). Atharva Veda is not included here because of its late origin. The origin of the other three Vedas is not known. But the fact remains that they defied Nature’s fury and continued to guide even in this contemporary world. Vedas are also known as Śruti-s (श्रुति). Veda-s in their original form is too difficult to comprehend as they are considered to have been delivered by God Himself to the ancient sages and saints. The sages conglomerated the speech of God, by colligating their highest level of cosmic intelligence with the Supreme Consciousness.
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. పుష్య మాసం విశిష్టత 🌹*
*03-01- 2022 నుండి పుష్యమాసం*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. *“పుష్య”* అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.*
*ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.*
*విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.*
*ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.*
*శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.*
*అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.*
*పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.*
*అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.*
*ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.*
*పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ , ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.*
*ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ , నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి.*
*సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి, షట్తిలైకాదశి , కల్యాణైకాదశి అని పిలుస్తారు.*
*సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం , నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం , మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం , తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.*
*ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి , పితృ తర్పణాలు , ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.*
*పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.*
*మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము , ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment