శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀

🌻 335-2. 'వేదవేద్యా' 🌻

సంకల్పము పుట్టినచోటు శ్రీదేవి గృహమునకు తూర్పు ద్వారము. దానిని గూర్చి ధ్యానించుట ద్వారా తూర్పు ద్వారమునుండి శ్రీదేవి చింతామణి గృహమున ప్రవేశింప వచ్చును. జీవుల యందు ప్రాణ స్పందన మున్నది. ఈ ప్రాణ స్పందనమే సామగానము. అది హంస గానమువలె హృదయమున స్థితిగొని యున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములే హంస రెక్కలు. వానికి మూలమైన స్పందనము హంస. ఈ హంస 'సోహం' అను ద్వయాక్షరీ గానము చేయుచు నుండును. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా హంసగానమును చేరి గానము ఆధారముగ యానము సాగించినచో హృదయ మందలి హంస మన యందలి ఉత్తర దిక్కునకు కొనిపోగలదు.

మనయందలి శిఖే ఉత్తర దిక్కు. ఇట్లు హృదయము నుండి శిఖకు గాన మాధారముగ యానము చేయుట సామవేదము నుపాసించుట. ఇట్లు పాసించువారు ఉత్తర ద్వారమున శ్రీమాత గృహమును చేరి ఆమె దర్శనమును పొందగలరు. యజుర్వేదము దక్షిణ దిక్కు యజుర్వేదము యజ్ఞార్థ జీవనమును సూచించును. అనగా పరహిత జీవనమే జీవనమని తెలుపును. పరహిత మొనర్చుచు తనను తాను మైమరచువాడు ఈ మార్గమున దక్షిణ ద్వారమును చేరగలడు. ఇట్టివారు లోకహితులు. వీరికిని శ్రీమాత దర్శనమనుగ్రహింపబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 335-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻


🌻 335-2. Veda-vedyā वेद-वेद्या (335) 🌻

{Further reading on Veda-s: The Veda-s (वेद) are the most important treatise to the humanity. They are in classical Sanskrit language that was widely used in ancient Aryan times. The Vedic verses can be interpreted from various angles like literature, spiritual, religious, grammar, philosophy etc. Though there are interpretations on Veda-s available today, it is doubtful whether they truly convey the intended meaning. This is not because of defective interpretations or lack of efficiency of the interpreters, but mainly due to the abilitie-s of Veda-s to communicate both gross and subtle renditions.

A careful reading of Vedic verses reveals that they deal with symbolic separation of bodily organs of the performer and offered to higher energy fields for purification. Veda-s never advocated physical slaying of animals. But it is wrongly interpreted that various organs of an animal are offered as oblations. Veda-s originated from divine commune. For a long time, they were not penned down as the verses and were channeled from a master to his disciples. The sages have chosen the oral path for communication as these verses relied more on orthoepy to prevent any distortions. Most of the texts of Veda-s are in the form of verses. These are called mantra verses and their oral delivery largely depends on phonics and rhythm. There are portions of prose as well and they are known as Brāhmaṇa (ब्राह्मण) passages. These passages explain the procedures for rituals and dwell more on the practical side.

There are four Veda-s, Rig, Yajur, Sāma and Atharva (ऋग्, यजुर्, साम, अथर्व). The first three are known as trividyā (त्रिविद्या) (literal translation – three types of knowledge). Atharva Veda is not included here because of its late origin. The origin of the other three Vedas is not known. But the fact remains that they defied Nature’s fury and continued to guide even in this contemporary world. Vedas are also known as Śruti-s (श्रुति). Veda-s in their original form is too difficult to comprehend as they are considered to have been delivered by God Himself to the ancient sages and saints. The sages conglomerated the speech of God, by colligating their highest level of cosmic intelligence with the Supreme Consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jan 2022

No comments:

Post a Comment