నిర్మల ధ్యానాలు - ఓషో - 118
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 118 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణము అవుతుంది. 🍀
ఉనికిలో నాట్యం చేయని పక్షంలో నీలో ఎట్లాంటి నాట్యానికి అవకాశం లేదు. నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. నిన్ను నువ్వు వదిలించుకో. అప్పుడు నీకూ వునికికి మధ్య నీతనమన్నది అడ్డంకిగా వుండదు.
అహాన్ని అంటే నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణమవుతుంది. అప్పుడు అనంతం లక్షల ఆనందాల్ని ప్రదర్శిస్తుంది. లక్షల పూలని వికసిస్తుంది. అప్పుడు ఆనందం శాశ్వతమవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Jan 22
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment