మైత్రేయ మహర్షి బోధనలు - 52
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 52 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 40. నీరు 🌻
పరిశుద్ధ జీవనమునకు పవిత్రమైన నీరు ఎంతో ముఖ్యము. నీటి పవిత్రత దేహమునకు, మనస్సునకు కూడ పవిత్రత కలిగించ గలదు. ఈ విషయమును మానవజాతి అశ్రద్ధ వహించి యున్నారు. నీటిని రకరకములైన రసాయనములతో శుద్ధి చేసుకొనుట పరిపాటి అయినది. నిజమునకు అట్లు చేయుటలో నీటియందు సహజముగ గల రసములు అదృశ్యమగును. నీటిని మరిగించి త్రాగుట ఆరోగ్యకరమని మరికొందరి భావన. మరిగించిన నీటి యందు కొన్ని జీవకణములు మరణించును. నిజమునకు జీవము నీరే! దానిని మరిగించి నప్పుడు కొన్ని సూక్ష్మక్రిములు నశించుటతో పాటు, ఆ నీరు చల్లార్చిన సమయమున కొన్ని చచ్చిన కణములు వాతావరణము నుండి ఆకర్షింపబడును. మరిగించి, చల్లార్చిన వెనుక త్రాగిన నీరు మెదడును మందముగ తయారుచేయగలదని మా హెచ్చరిక.
మరిగించిన నీరు త్రాగు అభ్యాసము కలవారు ఆ నీటిని వేడిగనే త్రాగవలెను. నీరు దాహము తీర్చుటయే కాక ప్రాణశక్తిని కూడ పెంపొందించును. తీవ్రమైన గాయములు కూడ పవిత్రమైన నీటిలో ముంచి నపుడు నయమగుట మేమెరిగిన సత్యము. పవిత్ర జలమునందు పటిష్టమైన ఔషధ బలము కలదు. మమ్మ అనుసరించు బృందములు నీరు విషయమున అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి యుండవలెను. నీటి వాడకము విషయమున పై మెలకువలను అనుసరించి ఆరోగ్య వంతులుగ నుండవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jan 22
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment