19-JANUARY-2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, జనవరి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 146 / Bhagavad-Gita - 146 - 3-27 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543 🌹
4) 🌹 DAILY WISDOM - 220య1🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 126🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 19, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ హేరంబగణపతి ధ్యానం 🍀*

*11. అభయవరదహస్తః పాశదంతాక్షమాలా*
*సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |*
*ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో*
*గణపతి రతిగౌరః పాతు హేరంబనామా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 06:55:09 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆశ్లేష 32:25:58 వరకు
తదుపరి మఘ
యోగం: ప్రీతి 16:06:52 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 06:54:09 వరకు
వర్జ్యం: 20:25:24 - 22:08:12
దుర్ముహూర్తం: 12:04:15 - 12:49:12
రాహు కాలం: 12:26:44 - 13:51:02
గుళిక కాలం: 11:02:25 - 12:26:44
యమ గండం: 08:13:48 - 09:38:07
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 30:42:12 - 32:25:00
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:03:58
వైదిక సూర్యోదయం: 06:53:18
వైదిక సూర్యాస్తమయం: 18:00:09
చంద్రోదయం: 19:19:39
చంద్రాస్తమయం: 07:52:02
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
రాక్షస యోగం - మిత్ర కలహం 32:25:58
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -146 / Bhagavad-Gita - 146 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 27 🌴*

*27. ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: |*
*అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||*

🌷. తాత్పర్యం :
*మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాయుతుడు, భౌతికభావన యందున్నవాడు అను ఇరువురు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మనొనరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరింతురు. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతికభావన యందున్నవాడు మిథ్యాహంకారము చేత తననే ప్రతిదానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించ బడినదనియు మరియు అట్టి ప్రకృతి భగవానుని నిర్దేశము నందు వర్తించుననియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అదుపులోనే ఉన్నాననెడి జ్ఞానమును కలిగియుండడు. మిథ్యాహంకారపూరితుడగు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. 

అట్టివాడు స్థూల, సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారము ప్రకృతిచే సృష్టింపబడినవనియు మరియు తన మానసికకర్మలు, దేహపరకర్మలన్నియును భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞానియైనవాడు బహుకాలము తన ఇంద్రియములను ఇంద్రియభోగములందు దురుపయోగము కావించినందున శ్రీకృష్ణభగవానుడు హృషీకేశుడని (దేహేంద్రియములకు ప్రభువు) తెలిసికొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణభగవానునితో గల నిత్య సంబంధమును మరపింపచేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మోహపరవశుడైనట్టి వాడే.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 146 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 27 🌴*

*27. prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ*
*ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate*

🌷Translation :
*The spirit soul bewildered by the influence of false ego thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature.*

🌷 Purport :
Two persons, one in Kṛiṣhṇa consciousness and the other in material consciousness, working on the same level, may appear to be working on the same platform, but there is a wide gulf of difference in their respective positions. The person in material consciousness is convinced by false ego that he is the doer of everything. He does not know that the mechanism of the body is produced by material nature, which works under the supervision of the Supreme Lord. 

The materialistic person has no knowledge that ultimately he is under the control of Kṛiṣhṇa. The person in false ego takes all credit for doing everything independently, and that is the symptom of his nescience. He does not know that this gross and subtle body is the creation of material nature, under the order of the Supreme Personality of Godhead, and as such his bodily and mental activities should be engaged in the service of Kṛṣṇa, in Kṛiṣṇa consciousness. 

The ignorant man forgets that the Supreme Personality of Godhead is known as Hṛṣīkeśa, or the master of the senses of the material body, for due to his long misuse of the senses in sense gratification, he is factually bewildered by the false ego, which makes him forget his eternal relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 543. గభీరః, गभीरः, Gabhīraḥ 🌻*

*ఓం గభీరాయ నమః | ॐ गभीराय नमः | OM Gabhīrāya namaḥ*

*గభీరః, गभीरः, Gabhīraḥ*

*జ్ఞానైశ్వర్యాదిభిర్విష్ణోర్గమ్భీరత్వాత్ గభీరతః*

*జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగు ఉత్తమ లక్షణములచే గంభీరుడు.*

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
చ. చతురత నట్టి యీశ్వరుఁడు సజ్జనలోక నిరస్త సర్వ కా
     మిత విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
     పితుఁ డగుచున్ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
     శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‍. (960)

భగవంతుడు ఆశ్రితజన వత్సలుడు. కాబట్టి పరిశుద్ధమైన సజ్జనుల మనస్సులో చేరి విడవకుండా నిత్యమూ అక్కడే ఉంటాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 543🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 543. Gabhīraḥ 🌻*

*OM Gabhīrāya namaḥ*

ज्ञानैश्वर्यादिभिर्विष्णोर्गम्भीरत्वात् गभीरतः /
*Jñānaiśvaryādibhirviṣṇorgambhīratvāt gabhīrataḥ*

*The unfathomable or Supreme in wisdom, wealth, strength, valor etc., and hence He is Gabhīraḥ.*

:: श्रीमद्भागवते एकादशस्कन्धे षष्ठोऽद्यायः ::
अस्यासि हेतुरुदयस्थितिसंयमानाम्
     आव्यक्तजीवमहतामपि कालमाहुः ।
सोऽयं त्रिणाभिरखिलापचये प्रवृत्तः
     कालो गभीररय उत्तमपूरुषस्त्वम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 6
Asyāsi heturudayasthitisaṃyamānām
     Āvyaktajīvamahatāmapi kālamāhuḥ,
So’yaṃ triṇābhirakhilāpacaye pravr‌ttaḥ
     Kālo gabhīraraya uttamapūruṣastvam. 15.

You are the cause of the creation, maintenance and destruction of this universe. As time, You regulate the subtle and manifest states of material nature and control every living being. As the threefold wheel of time You diminish all things by Your imperceptible actions, and thus You are the Supreme Lord.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 221 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 8. We can Never be Happy if There is Another Person Near Us 🌻*

*The Brihadaranyaka Upanishad tells us in one little passage: dvitiyad vai bhayam bhavati (Brih. Up. 1.4.2). We can never be happy if there is another person near us. Always we have to adjust ourselves with that person and we do not know what to expect from that person. We cannot keep even a mouse in front of us; we will be very disturbed because the mouse is sitting in front. The mouse cannot do any harm to us, but we do not like the presence of even a little ant.*

*“Oh, another thing has come.” This “another thing” is what is troubling us. The difficulty arising out of the cognition of another is because of the fact that the basic Reality, that unchanging Eternity, has no “another” outside It. Because of the absence of another in the basic reality of our own Self—the Truth of this cosmos—we feel a discomfiture at the perception of anything outside, human or otherwise. Whatever it is, we would like to be alone. Finally, we would like to be alone because that Aloneness, which is spaceless and timeless, is telling us: “You are really alone.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. 🍀*

*జీవితం అపూర్వ సౌందర్యభరితమైంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం. ఆ సంగతి గురించి మనకు తెలీదు. కళ్ళు మూసుకుని వుంటాం. అదెంతో ఔన్నత్యం నిండింది. కానీ ఆ సంగతి గ్రహించే సున్నితత్వం మనకుండదు. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. అందువల్ల సున్నితత్వాన్ని సృష్టించడమెలా? అన్నది సమస్య.*

*మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. వేరే దేవుడంటూ లేడు. జీవితానికి జననమంటూ లేదు. మరణమంటూ లేదు. అది శాశ్వతమైంది. మనం ఆ శాశ్వతత్వంలో భాగాలం. మనం మన చుట్టూ దుమ్ము పేర్చుకున్నాం. అద్దలాంటి మన అస్తిత్వం పై దుమ్ము పేరుకుపోయింది. అందువల్ల అదేమీ ప్రతిఫలించదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 47. వస్తు సంపద -1 🌻*

*వస్తు సంపదను పోగుచేసు కొనుటలో గల అపాయమును ఏ విద్యాలయముల యందును బోధించుట లేదు. అందరును నీతులు బోధింతురు కాని, వస్తువులను పోగు వేసుకొను అభ్యాసము ఎంత దురవస్థను కలిగించునో తెలుపరు. అస్తేయము (ఒకరి సంపదల నాశింపకుండుట), అపరిగ్రహము అను విలువైన విషయములు చిన్నతనముననే బోధింపవలెను. “తాతకు కుర్చీ యున్నది, నాకేది?" అను భావము ఏర్పడిన మనుమడు సన్మార్గమున పయనించుట లేదని తెలియవలెను.*

*వస్తువులను కోరు తెలివి క్రమశః వికసింపక కుంచించుకొనిపోవును. హక్కులను కోరు పసివారు బాధ్యతల యందు అప్రమత్తులై యుండలేరు. ఈ కాలమున వస్తు ఉత్పత్తి విపరీతముగ నున్నది. వస్తువులను విపరీతముగ జన సామాన్యులకు అంటగట్టుచున్నారు. పనికిరాని వస్తువులన్నియు కూడ పనికివచ్చు వస్తువులని నమ్మించి, ఆకర్షించి, కామోద్రిక్తులను చేయుచున్నారు. వ్యాపారము శ్రేయోదాయకము కాక ప్రజా పీడితముగ మార్పు చెందినది. ఇది కలి ప్రభావము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment