మైత్రేయ మహర్షి బోధనలు - 60


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 47. వస్తు సంపద -1 🌻


వస్తు సంపదను పోగుచేసు కొనుటలో గల అపాయమును ఏ విద్యాలయముల యందును బోధించుట లేదు. అందరును నీతులు బోధింతురు కాని, వస్తువులను పోగు వేసుకొను అభ్యాసము ఎంత దురవస్థను కలిగించునో తెలుపరు. అస్తేయము (ఒకరి సంపదల నాశింపకుండుట), అపరిగ్రహము అను విలువైన విషయములు చిన్నతనముననే బోధింపవలెను. “తాతకు కుర్చీ యున్నది, నాకేది?" అను భావము ఏర్పడిన మనుమడు సన్మార్గమున పయనించుట లేదని తెలియవలెను.

వస్తువులను కోరు తెలివి క్రమశః వికసింపక కుంచించుకొనిపోవును. హక్కులను కోరు పసివారు బాధ్యతల యందు అప్రమత్తులై యుండలేరు. ఈ కాలమున వస్తు ఉత్పత్తి విపరీతముగ నున్నది. వస్తువులను విపరీతముగ జన సామాన్యులకు అంటగట్టుచున్నారు. పనికిరాని వస్తువులన్నియు కూడ పనికివచ్చు వస్తువులని నమ్మించి, ఆకర్షించి, కామోద్రిక్తులను చేయుచున్నారు. వ్యాపారము శ్రేయోదాయకము కాక ప్రజా పీడితముగ మార్పు చెందినది. ఇది కలి ప్రభావము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹



19 Jan 2022

No comments:

Post a Comment