నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. 🍀


జీవితం అపూర్వ సౌందర్యభరితమైంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం. ఆ సంగతి గురించి మనకు తెలీదు. కళ్ళు మూసుకుని వుంటాం. అదెంతో ఔన్నత్యం నిండింది. కానీ ఆ సంగతి గ్రహించే సున్నితత్వం మనకుండదు. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. అందువల్ల సున్నితత్వాన్ని సృష్టించడమెలా? అన్నది సమస్య.

మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. వేరే దేవుడంటూ లేడు. జీవితానికి జననమంటూ లేదు. మరణమంటూ లేదు. అది శాశ్వతమైంది. మనం ఆ శాశ్వతత్వంలో భాగాలం. మనం మన చుట్టూ దుమ్ము పేర్చుకున్నాం. అద్దలాంటి మన అస్తిత్వం పై దుమ్ము పేరుకుపోయింది. అందువల్ల అదేమీ ప్రతిఫలించదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


19 Jan 2022

No comments:

Post a Comment