శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀
🌻 341-1. 'క్షేత్రస్వరూప'🌻
క్షేత్ర రూపము శ్రీదేవియే అని అర్థము. సృష్టి యందు జీవులను వసింప జేయుటకు సృష్టి క్షేత్ర మొకటి యేర్పడవలెను. ఏడులోకముల యందు జీవులు వసించుటకు వలసిన చోటు, జీవులు వసించుటకు వలసిన రూపములు కావలెను. ప్రదేశ మేర్పడవలెను. మరియు జీవులకు రూపము లేర్పడవలెను. అట్లు ఏర్పడిననేగాని సృష్టి కథ లేదు. జీవుల పరిణామ కథ కూడ లేదు. శ్రీమాతయే ఏడు లోకముల యందలి ప్రదేశముగ ఏర్పడును.
ఆమె మూల ప్రకృతి. ఆమె నుండి అష్ట ప్రకృతులు యేర్పడి నవావరణములతో కూడిన చోటు ఏర్పడును. మొత్తము సృష్టి కథ అంతయూ ఈ ఆవరణములలోనే జరుగును. మొత్తము చోటులో నవావరణముల మేరకు చోటు వెలిగింపబడును. ఒక మహారణ్యమున కొంత చోటును చదను చేసి శుభ్రపరచి ఆశ్రమము నిర్మాణము చేసినట్లుగ అనంతమైన చోటులో కొంత చోటు ఒక సృష్టిగ ఏర్పడును. సమస్త జీవ వ్యాపారములును ఈ వెలిగింపబడిన చోటులో జరుగు చుండును. ఇదియే కురు క్షేత్రము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻
🌻 341-1. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻
Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.
Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.
Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”
She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment