నిత్య ప్రజ్ఞా సందేశములు - 259 - 15. ప్రపంచంలోని వాస్తవ సందర్భాలన్నీ పదార్థ సమయ విన్యాసములే / DAILY WISDOM - 259 - 15. Things in the World are called Actual Occasions
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 259 / DAILY WISDOM - 259 🌹
🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 15. ప్రపంచంలోని వాస్తవ సందర్భాలన్నీ పదార్థ సమయ విన్యాసములే 🌻
ప్రపంచంలో జరిగే సంఘటనలు అని పిలవబడే వాటిలోని పదార్థము - విషయం యొక్క పరస్పర అనుసంధానం అనేది స్థలంలో లేదా సమయంలో త్రిమితిలో సాధారణంగా జరిగే సంఘటనలు మాత్రమే కాదని, అంతకు మించి నాలుగవ పరిధి చైతన్యానికి తీసుకుని వెళ్లే స్పృహ యొక్క కొనసాగింపుగా జరుగుతున్నదనే సంక్లిష్ట అంశముగా, తన అధునాతన పరిశీలన కోసం ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ అనే అతను తీసుకున్నాడు. చివరకు తన పరిశోధనలో అతను ఒకే రకమైన ఫలితాలకు ఒకేలాంటి ఖచ్ఛితమైన కారణాలు లేవనే నిర్ధారణకు వచ్చాడు. ఒక ఫలితానికి ఒక చర్య లేక దాని ప్రతిచర్య కానీ ఒకే సమయంలో కారణం కానీ ఫలితం కానీ కావచ్చు అని తీసుకోవాలి. అయితే ప్రపంచం ఒక ఖచ్చితమైన చర్య లేదా ప్రతిచర్య ఎల్లప్పడూ ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తుందనే సిద్ధాంతం ద్వారా మాత్రమే అవగాహన చేసుకో బడుతుంది.
విశ్వ సాపేక్షతలో కారణం మరియు ప్రభావం నిరంతరంగా ఉంటాయి అని, ఒక జీవి, దాని అన్ని భాగాలు ఒక దానితో ఒకటి సమగ్రమైన సంబంధం నిరంతరాయంగా కలిగి ఉంటాయి అని అర్ధం చేసుకోవాలి. అలా కాకుంటే కారణం మరియు ఫలితం మధ్య ఏదైనా సంబంధం సాధ్యపడదు. ఈ విశ్వములో జరగే వాస్తవ సంఘటనల ఉనికి మరియు నిర్మాణం అన్నీ కూడా నియంత్రిత శక్తి యొక్క సంభావ్య కేంద్రీకృత బిందువులు. దీని కారణంగా ప్రపంచంలో సమయంలో జరిగే పదార్థ విన్యాసాలను 'వాస్తవ సందర్భాలు' అని పిలుస్తారు. ప్రపంచం ఒక ఘన పదార్ధం కాదు. ఇది వివిధ నియమాల అమలు యొక్క కార్య క్షేత్రంగా, వ్యక్తుల మధ్య అంతర్గత ఇవ్వడం మరియు తీసుకోవడం లాంటి 'వాస్తవ సందర్భాలు' అనేకం కలిగి ఉండి, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనలతో వ్యక్తిగత స్థాయి నుండి ఇతరులతో, అన్నింటితో సామరస్య సంబందాలు కావాలనే ప్రజలతో, మరియు ఇలాంటి అనేకమైన వైరుధ్య విషయాలతో నిండి ఉన్న ప్రపంచం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 259 🌹
🍀 📖 from Essays in Life and Eternity 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 15. Things in the World are called Actual Occasions 🌻
The interconnectedness of phenomena in the so-called events of the world taking place not in space or in time, but in a four-dimensional space-time continuum, was taken up with its more advanced implications for consideration by Alfred North Whitehead. In his Philosophy of Organism, Whitehead arrived at the conclusion that there are no set causes producing set effects, but anything can be an effect or a cause in a symmetrical manner of action and reaction, since the world as it is discovered by the theory of relativity is an organism with its parts integrally related to it. Cause and effect are continuous, the absence of which continuity would sever any possible relation between cause and effect.
Things in the world are called ‘actual occasions', the potential concentrated points of force whose very existence as well as structure are conditioned by the existence and structure of other ‘actual occasions' which fill the cosmos as its constituents. The world is not a solid substance but is more like a field of law and order, an idea of total inclusiveness, a system of internal give-and-take policy obtaining among the individualities known as ‘actual occasions', transforming the location of individuals into a fluid movement of a liquefied connection, as it were, with everything else also in the world.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment