🌹. మత్స్యావతార జయంతి శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 181 / Bhagavad-Gita - 181 - 4-19 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 580 / Vishnu Sahasranama Contemplation - 580🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 29 / Agni Maha Purana 29🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 259 / DAILY WISDOM - 259 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 160 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 98 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 03, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మత్స్యావతార జయంతి, Matsya Jayanti🌻*
*🍀. మత్స్యావతార స్తోత్రం 🍀*
*వేదోద్ధార విచారమతే సోమక దానవ సంహరణే |*
*మీనాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ||*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దివ్యాత్మలు ఎవరితోనైనా సంబంధం పెట్టుకునే ముందు, తమ శక్తి - కాలము వారి యందు వెచ్చించే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరిక్షిస్తారు. - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శుక్ల విదియ 12:40:11 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: అశ్విని 12:38:04 వరకు
తదుపరి భరణి
యోగం: వైధృతి 07:52:37 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 12:42:11 వరకు
వర్జ్యం: 08:25:10 - 10:06:18
మరియు 22:58:24 - 24:41:48
దుర్ముహూర్తం: 16:50:57 - 17:40:18
రాహు కాలం: 16:57:07 - 18:29:40
గుళిక కాలం: 15:24:35 - 16:57:07
యమ గండం: 12:19:30 - 13:52:02
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: 05:02:54 - 06:44:02
పండుగలు మరియు పర్వదినాలు
సూర్యోదయం: 06:09:21
సూర్యాస్తమయం: 18:29:40
చంద్రోదయం: 07:28:30
చంద్రాస్తమయం: 20:24:01
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మేషం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 12:38:04
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*మత్స్యావతార జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ*
*Happy Matsya Avatar Jayanti to All*
*Prasad Bharadwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 181 / Bhagavad-Gita - 181 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 19 🌴*
*19. యస్య సర్వే సమారమ్భా: కామసంకల్పవర్జితా: |*
*జ్ఞానగ్నిదగ్ధకర్మాణాం తమాహు: పణ్డితం బుధా: ||*
🌷. తాత్పర్యం :
*ఎవని ప్రతి కర్మయు భోగవాంఛా రహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. కర్మ ఫలములన్నియు జ్ఞానగ్నిచే దగ్ధమైనవిగా (జ్ఞానాగ్నిదగ్దకర్మడు) అతడు ఋషులచే చెప్పబడును.*
🌷. భాష్యము :
సంపూర్ణమైన జ్ఞానము గలవాడే కృష్ణభక్తిరసభావన యందు మగ్నుడై యుండెడి మనుజుని కర్మలను అవగాహనము చేసికొనగలడు. కృష్ణభక్తిభావన యందుండెడివాడు సర్వవిధములైన ఇంద్రియభోగభావనల నుండి విడివాడియుండును కావున శ్రీకృష్ణభగవానునికి నిత్యదాసుడనెడి తన నిజస్థితి గూర్చిన సంపూర్ణజ్ఞానముతో కర్మఫలములన్నింటిని భస్మీపటలము కావించుకొనెని ఎరుగవలసియున్నది.
అట్టి దివ్యజ్ఞానము సంపాదించిన వాడే వాస్తవమునకు పండితుడు. భగవానునితో గల నిత్యసంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధి అగ్నిచో పోల్చబడును. అది ఒక్కమారు రగిలినచో సర్వములైన కర్మఫలములను సములముగా దహింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 181 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 19 🌴*
*19 . yasya sarve samārambhāḥ kāma-saṅkalpa-varjitāḥ*
*jñānāgni-dagdha-karmāṇaṁ tam āhuḥ paṇḍitaṁ budhāḥ*
🌷 Translation :
*One is understood to be in full knowledge whose every endeavor is devoid of desire for sense gratification. He is said by sages to be a worker for whom the reactions of work have been burned up by the fire of perfect knowledge.*
🌹 Purport :
Only a person in full knowledge can understand the activities of a person in Kṛṣṇa consciousness. Because the person in Kṛṣṇa consciousness is devoid of all kinds of sense-gratificatory propensities, it is to be understood that he has burned up the reactions of his work by perfect knowledge of his constitutional position as the eternal servitor of the Supreme Personality of Godhead.
He is actually learned who has attained to such perfection of knowledge. Development of this knowledge of eternal servitorship to the Lord is compared to fire. Such a fire, once kindled, can burn up all kinds of reactions to work.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 580 / Vishnu Sahasranama Contemplation - 580🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 580. సన్న్యాసకృత్, सन्न्यासकृत्, Sannyāsakrt 🌻*
*ఓం సన్న్యాసకృతే నమః | ॐ सन्न्यासकृते नमः | OM Sannyāsakrte namaḥ*
*సన్న్యాసకృత్, सन्न्यासकृत्, Sannyāsakrt*
*చతుర్థమాశ్రమం వ్యధాదితి సన్న్యాసకృద్ హరిః*
*మోక్షము పొందుట కొరకు సాధనముగా చతుర్థాశ్రమమైన సంన్యాసమును ఏర్పరిచినందున ఆ హరి సన్న్యాసకృత్.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 580🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻580. Sannyāsakrt🌻*
*OM Sannyāsakrte namaḥ*
*चतुर्थमाश्रमं व्यधादिति सन्न्यासकृद् हरिः / Caturthamāśramaṃ vyadhāditi sannyāsakrd hariḥ*
*Since Lord Hari established the fourth phase of Saṃnyāsa i.e., phase of renunciation in our lives to aid us in attaining mokṣa or liberation, He is called Sannyāsakrt.*
:: श्रीमद्भागवते एकादशस्कन्धे षोडशोऽध्यायः ::
धर्माणामस्मि सन्न्यासः क्षेमाणामबहिर्मतिः ।
गुह्यानां सुनृतं मौनं मिथुनानामजस्त्वहम् ॥ २६ ॥
Śrīmad Bhāgavata - Canto 11, Chapter 16
Dharmāṇāmasmi sannyāsaḥ kṣemāṇāmabahirmatiḥ,
Guhyānāṃ sunrtaṃ maunaṃ mithunānāmajastvaham. 26.
Among religious principles I am renunciation, and of all types of security I am consciousness of the eternal soul within. Of secrets I am pleasant speech and silence, and among sexual pairs I am Brahmā.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakrcchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 29 / Agni Maha Purana - 29 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 11*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. ఉత్తర యుద్ధకాండ వర్ణనము - 2 🌻*
సిందుతీరము నందు నివసించు దుష్టగంధర్వుడైన శైలూషుని కూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తక్షుని, పుష్కరిని పాలకులనుగా చేసి భరతుడు శత్రఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవరూపుడైన రాముడు దుష్టులను యుద్దమున సంహరించి శిష్టులను పాలించెను.
లోకాపవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథశ్రవణమును బట్టి తెలిసుకొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేసెను.
ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పరుడై పదివేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగములు చేసి. దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములను వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు రాజ్యము పొందెను.
అగ్ని పలికెను. వాల్మీకి నారదుని నుండి విని రామాయాణమును సవిస్తరముగ రచించెను. దీనిని వినువాడు స్వర్గమునకు వెళ్ళును.
అగ్ని మహాపురాణమునందు రామాయణమున ఉత్తరకాండవర్ణనమున ఏకాదశాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -29 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 11*
*🌻 Uttara ( After War) Kand - 2 🌻*
8-9. (Having killed) Śailūṣa, the wicked Gandharva, a resident on the banks of (the river) Sindhu and having established his sons Takṣa and Puṣkara in those countries, Bharata went to Rāghava along with Lakṣmaṇa and remained worshipping him after having killed the wicked in the battle and protected the pious.
10. The two sons Kuśa and Lava, the excellent brothers were born in the hermitage of Vālmīki to Sītā abandoned on account of rumour among the people; and were known from the hearing of (their) good episode.
11. After having been anointed in the kingdom and being bent on contemplation with (the attitude of) “I am brahman”, (and then) the son of Sītā after having ruled for 11,000 years and after performing sacrifices went to heaven along with the citizens and (his) brother, and being attended to by the people and honoured by the celestials.
Agni said:
12. Vālmīki composed the Rāmāyaṇa in elaborate (form) after hearing from Nārada. One who hears this will go to heaven.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 259 / DAILY WISDOM - 259 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 15. ప్రపంచంలోని వాస్తవ సందర్భాలన్నీ పదార్థ సమయ విన్యాసములే 🌻*
*ప్రపంచంలో జరిగే సంఘటనలు అని పిలవబడే వాటిలోని పదార్థము - విషయం యొక్క పరస్పర అనుసంధానం అనేది స్థలంలో లేదా సమయంలో త్రిమితిలో సాధారణంగా జరిగే సంఘటనలు మాత్రమే కాదని, అంతకు మించి నాలుగవ పరిధి చైతన్యానికి తీసుకుని వెళ్లే స్పృహ యొక్క కొనసాగింపుగా జరుగుతున్నదనే సంక్లిష్ట అంశముగా, తన అధునాతన పరిశీలన కోసం ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ అనే అతను తీసుకున్నాడు. చివరకు తన పరిశోధనలో అతను ఒకే రకమైన ఫలితాలకు ఒకేలాంటి ఖచ్ఛితమైన కారణాలు లేవనే నిర్ధారణకు వచ్చాడు. ఒక ఫలితానికి ఒక చర్య లేక దాని ప్రతిచర్య కానీ ఒకే సమయంలో కారణం కానీ ఫలితం కానీ కావచ్చు అని తీసుకోవాలి. అయితే ప్రపంచం ఒక ఖచ్చితమైన చర్య లేదా ప్రతిచర్య ఎల్లప్పడూ ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తుందనే సిద్ధాంతం ద్వారా మాత్రమే అవగాహన చేసుకో బడుతుంది.*
*విశ్వ సాపేక్షతలో కారణం మరియు ప్రభావం నిరంతరంగా ఉంటాయి అని, ఒక జీవి, దాని అన్ని భాగాలు ఒక దానితో ఒకటి సమగ్రమైన సంబంధం నిరంతరాయంగా కలిగి ఉంటాయి అని అర్ధం చేసుకోవాలి. అలా కాకుంటే కారణం మరియు ఫలితం మధ్య ఏదైనా సంబంధం సాధ్యపడదు. ఈ విశ్వములో జరగే వాస్తవ సంఘటనల ఉనికి మరియు నిర్మాణం అన్నీ కూడా నియంత్రిత శక్తి యొక్క సంభావ్య కేంద్రీకృత బిందువులు. దీని కారణంగా ప్రపంచంలో సమయంలో జరిగే పదార్థ విన్యాసాలను 'వాస్తవ సందర్భాలు' అని పిలుస్తారు. ప్రపంచం ఒక ఘన పదార్ధం కాదు. ఇది వివిధ నియమాల అమలు యొక్క కార్య క్షేత్రంగా, వ్యక్తుల మధ్య అంతర్గత ఇవ్వడం మరియు తీసుకోవడం లాంటి 'వాస్తవ సందర్భాలు' అనేకం కలిగి ఉండి, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనలతో వ్యక్తిగత స్థాయి నుండి ఇతరులతో, అన్నింటితో సామరస్య సంబందాలు కావాలనే ప్రజలతో, మరియు ఇలాంటి అనేకమైన వైరుధ్య విషయాలతో నిండి ఉన్న ప్రపంచం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 259 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 15. Things in the World are called Actual Occasions 🌻*
*The interconnectedness of phenomena in the so-called events of the world taking place not in space or in time, but in a four-dimensional space-time continuum, was taken up with its more advanced implications for consideration by Alfred North Whitehead. In his Philosophy of Organism, Whitehead arrived at the conclusion that there are no set causes producing set effects, but anything can be an effect or a cause in a symmetrical manner of action and reaction, since the world as it is discovered by the theory of relativity is an organism with its parts integrally related to it. Cause and effect are continuous, the absence of which continuity would sever any possible relation between cause and effect.*
*Things in the world are called ‘actual occasions', the potential concentrated points of force whose very existence as well as structure are conditioned by the existence and structure of other ‘actual occasions' which fill the cosmos as its constituents. The world is not a solid substance but is more like a field of law and order, an idea of total inclusiveness, a system of internal give-and-take policy obtaining among the individualities known as ‘actual occasions', transforming the location of individuals into a fluid movement of a liquefied connection, as it were, with everything else also in the world.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 159 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. వ్యక్తి తన ప్రయత్నాలలో అనంత శక్తుల్ని కేంద్రీకరించాలి. అది అతని జన్మహక్కు. నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించు కోవాలి. అది నిన్ను అల్పస్థాయి నించి అత్న్నుత శిఖరానికి చేరుస్తుంది. 🍀*
*నీ శక్తి యుక్తులనన్నిట్నీ నీ ప్రయత్నంలో కేంద్రీకరించు. మరింతగా చైతన్యవంతంగా మారే ప్రయత్నంలో నిలుపు. వ్యక్తి తన ప్రయత్నాలలో అనంత శక్తుల్ని కేంద్రీకరించాలి. అది అతని జన్మహక్కు. అర్థమనస్కంగా వుండకూడదు. దాంట్లో నూటికి నూరుశాతం వుండాలి. దాపరికం పనికిరాదు. నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడు గొప్ప విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అది నిన్ను అల్పస్థాయి నించి అత్న్నుత శిఖరానికి చేరుస్తుంది. జ్ఞాతం నించీ అజ్ఞాతానికి చేరుస్తుంది. మనసు నించీ మనసు లేని తనానికి చేరుస్తుంది.*
*మనసు లేనితనం అంటే మనసు మాయమయిన తనంలో వుండడం వివేకం. మనసు మాయం కావడమంటే వివేకమే. అప్పుడు నీ జీవితంలో అందం, దయ, దైవత్వం నిండుతాయి. అప్పుడు నువ్వేది చేసినా సరైందే అవుతుంది. అప్పుడు నువ్వు ఎట్లాంటి పొరపాటు చెయ్యలేవు. కారణం నువ్వు కాంతితో, అంతర్దృష్టితో కళకళలాడుతూ వుంటావు. నీ దృష్టి స్పష్టంగా భ్రాంతి రహితంగా వుంటుంది. సరయిన చర్య దాని క్రమంలో అది సంభవిస్తుంది. అప్పుడు ఎట్లాంటి వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా తయారు చెయ్యాల్సిన పని వుండదు. వ్యక్తిత్వం అప్పుడు నీడలా అనుసరిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 98 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 79. మహాత్ముల పని -2 🌻*
*స్థూలదృష్టికి సూక్ష్మమగు మార్పులు తెలియవు. చప్పుడు కలవాటు పడిన వారికి నిశ్శబ్దము యొక్క మహాత్మ్యమెట్లు తెలియ గలదు? నేర్పుతో ప్రసంగములు చేయువారు ఆకర్షించినట్లుగ మౌనులు ఆకర్షింపగలరా? ప్రపంచము మేళతాళములను, ఆడంబరములను మాత్రమే గుర్తించును గాని, పూవు వికసించుట, నీటి బొట్టు ముత్యమగుట, పూత పిందె వేయుట గమనించ లేరు కదా!*
*మహాత్ము లొనర్చిన కార్యములన్నియు జీవపరిణామమునకు తోడ్పాటు గావించుచునే యున్నవి. వారి కార్యములు సూక్ష్మతరములు. వాని ప్రభావము స్థూలబుద్ధి గల వారి అవగాహనకు అందుట తరము కాదు. అపహాస్యము చేయుటయే వారి వంతు. వారిని సైతము ఉద్ధరించుటయే మహాత్ముల పని.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment