నిర్మల ధ్యానాలు - ఓషో - 159
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 159 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి తన ప్రయత్నాలలో అనంత శక్తుల్ని కేంద్రీకరించాలి. అది అతని జన్మహక్కు. నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించు కోవాలి. అది నిన్ను అల్పస్థాయి నించి అత్న్నుత శిఖరానికి చేరుస్తుంది. 🍀
నీ శక్తి యుక్తులనన్నిట్నీ నీ ప్రయత్నంలో కేంద్రీకరించు. మరింతగా చైతన్యవంతంగా మారే ప్రయత్నంలో నిలుపు. వ్యక్తి తన ప్రయత్నాలలో అనంత శక్తుల్ని కేంద్రీకరించాలి. అది అతని జన్మహక్కు. అర్థమనస్కంగా వుండకూడదు. దాంట్లో నూటికి నూరుశాతం వుండాలి. దాపరికం పనికిరాదు. నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడు గొప్ప విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అది నిన్ను అల్పస్థాయి నించి అత్న్నుత శిఖరానికి చేరుస్తుంది. జ్ఞాతం నించీ అజ్ఞాతానికి చేరుస్తుంది. మనసు నించీ మనసు లేని తనానికి చేరుస్తుంది.
మనసు లేనితనం అంటే మనసు మాయమయిన తనంలో వుండడం వివేకం. మనసు మాయం కావడమంటే వివేకమే. అప్పుడు నీ జీవితంలో అందం, దయ, దైవత్వం నిండుతాయి. అప్పుడు నువ్వేది చేసినా సరైందే అవుతుంది. అప్పుడు నువ్వు ఎట్లాంటి పొరపాటు చెయ్యలేవు. కారణం నువ్వు కాంతితో, అంతర్దృష్టితో కళకళలాడుతూ వుంటావు. నీ దృష్టి స్పష్టంగా భ్రాంతి రహితంగా వుంటుంది. సరయిన చర్య దాని క్రమంలో అది సంభవిస్తుంది. అప్పుడు ఎట్లాంటి వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా తయారు చెయ్యాల్సిన పని వుండదు. వ్యక్తిత్వం అప్పుడు నీడలా అనుసరిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment