🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 367-2.‘ప్రత్యక్చితీ’🌻
ఈ ప్రత్యక్చితి ఆధారముగనే త్రిగుణాత్మకమగు తత్త్వమున కాధారమైన అవ్యక్తము పుట్టుచున్నది. ఈ బిందువు నుండియే కార్యము, కారణము, నాదము పుట్టుచున్నవి. మరల సృష్టి ప్రళయములోనికి పోవునపుడు కూడ చిట్టచివరగ నుండునది ప్రతీచియే లేక ప్రత్యక్సితియే. అవ్యక్తమైన బ్రహ్మరూపము కలిగి అంతర్గతమైన జ్ఞాన స్వరూపమై నిలచునది ప్రతీచియే. మనము నిద్రనుండి మెలకువ గాంచు స్థితి ఇది. నిద్ర యందు వున్నామని కూడ తెలియదు.
నిద్ర నుండి మెలకువ కలుగుచున్నప్పుడు వున్నామని మెర మెర మాత్ర ముండును. నిద్ర కూడ యుండును. ఇతర భావము లేవియూ వుండవు. తన అస్తిత్వము తన కేర్పడుచుండును. ఇతరము లేవియూ లేవు గనుక అవ్యక్తము. అటుపైన ఏర్పడునవి కారణ, కార్యములు. దానికి మూలము ఇచ్ఛ. ఈ ప్రాగ్ అవస్థను (నిద్ర నుండి మేల్కొనుట) గూర్చి శ్రద్ధతో తదేక దీక్షతో పరిశీలించుట, ధ్యానించుట యోగుల లక్ష్యము. ప్రత్యక్చితి పరమ పదమున నిలిచి యున్న స్థితిగా భావించవచ్చును. అటుపైన వున్నది 'పరా'. ఏమీ లేనట్లుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 367-2. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻
When She is referred to as the inner consciousness, it means Her un-manifested Brahman form, discussed in nāma-s 397 and 398. This is beautifully explained in Katha Upaniṣad (II.i.1) which says “The Self-created Lord has created the sense organs with the inherent defect that they are by nature outgoing.
This is why beings see things outside and cannot see the Self within. Rarely is there found a wise person seeking immortality, who can withdraw his sense organs from external objects to the Self within.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 May 2022
No comments:
Post a Comment