శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 15

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻


కృష్ణుడున్నప్పుడే నా బలము అని అర్జునుడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

ఆ మహాప్రస్థానము నందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో పాండవ చరిత వర్ణనమను పంచదశాధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 42 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 15

🌻 Ascendance of Pāṇḍavas to heaven - 2 🌻


9-12. Being consoled by Vyāsa, he thought, “My strength remains only in the presence of Kṛṣṇa.” Having come to Hastināpura, Pārtha then informed Yudhiṣṭhira, his brothers and the guards of the people. That bow, those weapons and the chariot and those horses were lost in the absence of Kṛṣṇa, just as a charity made to a person not well learned (would be lost). Having heard that (news), the intelligent Dharmarāja (Yudhiṣṭhira), having established Parīkṣīt in the kingdom, set out on his final journey to relinquish this world along with Draupadī and his brothers, after having realized the transitory nature of the mundane existence and repeating 108 (names) of Hari.

13. Draupadī, Sahadeva, Nakula, Phālguna[2] (Arjuna), Bhīma had fallen on the way (of their march). The king was grief-stricken.

14. Mounting the chariot brought by Indra he reached heavens along with his brothers, having seen Duryodhana and others and Vāsudeva and becoming happy. This is (the story of) Bhārata told to you. Whoever reads this, goes to heaven.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

03 May 2022

No comments:

Post a Comment