శ్రీ శివ మహా పురాణము - 558 / Sri Siva Maha Purana - 558
🌹 . శ్రీ శివ మహా పురాణము - 558 / Sri Siva Maha Purana - 558 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴
🌻. పెండ్లి వారి భోజనములు - 4 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి, దయా దృష్టితో చూచి శయ్యను వీడెను (33). 'ఓ ధర్మా! నీవు ముందు అచటకు వెళ్లుము. నేను కూడా శీఘ్రమే రాగలను. సందేహము వలదు' అని ఆయన నవ్వి పలికెను (34). శంకరుడిట్లు పలుకగా ఆతడు జనుల నివాసమునకు వెళ్లెను. శంభు ప్రభుడు కూడా అచటకు స్వయముగా వెళ్లవలెనని తలంచెను (35).
ఆ విషయము తెలిసి స్త్రీలందరు అచటకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాద ద్వయమును చూచుచూ మంగళ గానములను పాడిరి (36). అపుడు శంభుడు లోకాచారమునను సరించి ప్రాతః కృత్యములను పూర్తి చేసుకొని మేనా హిమవంతుల అనుమతిని తీసుకొని జనావాసమునకు వెళ్లెను (37). ఓ మునీ! అపుడు మహోత్సవమారంభమాయెను. వేదధ్వని మొదలాయెను. జనులు నాల్గు విధముల వాద్యములను మ్రోగించిరి (38).
శంభుడు అపుడు తన స్థానమునకు వచ్చి లోకాచారముననుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (39). తరువాత జయధ్వానములు, సమశ్శబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను (40).
శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది (52).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 558 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴
🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 4 🌻
Brahmā said:—
33. On hearing these words of Dharma lord Śiva laughed. He surveyed him with sympathetic looks and got up from the bed.
34. He laughingly said to Dharma—“You go ahead. I shall come there presently. There is no doubt in this matter.
35. Thus addressed by Śiva, he returned to the audience hall. The lord Śiva too wanted to go.
36. On coming to know of it the ladies came enthusiastically. With their eyes fixed on the feet of Śiva, they sang auspicious songs.
37. Śiva then, in accordance with the worldly customs, went through his morning routine. He took leave of Menā and the mountain and went to the audience hall.
38. There was great jubilation there, O sage. Vedic mantras were recited loudly. The people played on the four kinds of musical instruments.
39. Śiva came to His apartment and bowed to the sages, Viṣṇu and me in accordance with the worldly conventions and was saluted by the gods and others.
40. Shouts of Victory and Obeisance rose up along with the auspicious sound of Vedic chants. There was great tumult.
Continues....
🌹🌹🌹🌹🌹
03 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment