04 - MAY - 2022 బుధవారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 04, మే 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 196 / Bhagavad-Gita - 196 - 4-34 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 595 / Vishnu Sahasranama Contemplation - 595🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 274 / DAILY WISDOM - 274 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 174 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 113 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 04, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi*

*🍀. శ్రీ నారాయణ కవచం - 2 🍀*

*శ్రీ శుక ఉవాచ |*
*వృతః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే |*
*నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు*
*శ్రీవిశ్వరూప ఉవాచ |*
*ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః |*
*కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అసూయతో, అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ తదియ ఉ.7:34 వరకు
నక్షత్రం : రోహిణి తె.3:19 వరకు
యోగం : అతిగండ సా.5:06 వరకు
కరణం : గరజి ఉ.7:34 వరకు,
వణజి రా.8:48 వరకు
సూర్యోదయం : ఉ.5:52
సూర్యాస్తమయం : సా.6:34
బ్రహ్మ ముహూర్తం : తె.4:16ల తె.5:04
అమృత కాలం : తె.0:01ల తె.2:02,
రా.8:22ల రా.10:23
వర్జ్య కాలం : ఉ.9:34ల ఉ.11:36
గుళిక : ఉ.10:38ల మ.12:13
దుర్ముహూర్తం : ఉ.11:48ల మ.12:38
రాహు కాలం : మ.12:13ల మ.1:48
యమగండం : ఉ.7:28ల ఉ.9:03
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
అమృత యోగం - కార్య సిధ్ది 30:17:15
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 196 / Bhagavad-Gita - 196 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 34 🌴*

*34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |*
*ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శిన: ||*

🌷. తాత్పర్యం :
*గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము. ఆత్మదర్శులు తత్త్వదర్శనము చేసినవారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు.*

🌷. భాష్యము :
ఆత్మానుభవమార్గమును నిస్సందేహముగా కటినమైనదికఠినమైనది. కనుకనే తన నుండియే వచ్చిన గురుపరంపరలోని ఆధ్యాత్మికగురువు దరిచేరుమని శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించుచున్నాడు. పరంపరా సిద్ధాంతమును పాటింపక ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యులు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే ఆది ఆధ్యాత్మికాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలో నున్నవాడే ఆ ఆదిదేవుని ఉపదేశమును యథాతథముగా తన శిష్యులకు తెలియజేయగలడు. 

స్వీయపధ్ధతిని సృష్టించుట ద్వారా ఎవ్వరును ఆధ్యాత్మికానుభవమును పొందలేరు (మూర్ఖులైన కపటులకు అది మోజు వంటిది). “ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణితం” అని శ్రీమద్భాగవతము (6.3.19) తెలుపుచున్నది. అనగా ధర్మము భగవానుని చేతనే స్వయముగా మార్గమునకు చేర్చజాలవు. 

అదే విధముగా ఎవ్వరినీ సంప్రదింపక స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవ్వరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతియొక్కరు జ్ఞానమును పొందుటకు తప్పక గురువును సంతృప్తి పరచుటయే ఆధ్యాత్మికజీవన పురోభివృద్ధికి రహస్యము. ప్రశ్నలు మరియు శరణాగతి మరియు సేవ లేనిదే గురువుకు వేయబడు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. 

ప్రతియొక్కరు గురుపరీక్షలో జయమును సాధింపవలెను. శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన గురుదేవుడు అప్రయత్నముగా అతనికి నిజమైన ఆధ్యాత్మికావగాహనను ప్రదానము చేయగలడు. గ్రుడ్డిగా అనుసరించుట మరియు అర్థరహిత ప్రశ్నలు వేయుట రెండును ఈ శ్లోకమునందు నిరసింపబడినవి. 

ప్రతి యొక్కరు గురువు నుండి అణుకవతో శ్రవణము చేయుటయే గాక, అణుకువ, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను సైతము పొందవలసియున్నది. ఆధ్యాత్మికగురువు తన ప్రవృత్తిరీత్యా శిష్యుని యెడ కరుణను కలిగియుండును. కనుక శిష్యుడు అణుకవతో సదా సేవచేయు సిద్ధపడినపుడు అతని జ్ఞానసముపార్జనము మరియు పరిప్రశ్నలు పూర్ణత్వము నొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 196 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 34 🌴*

*34. tad viddhi praṇipātena paripraśnena sevayā*
*upadekṣyanti te jñānaṁ jñāninas tattva-darśinaḥ*

🌷 Translation : 
*Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service unto him. The self-realized souls can impart knowledge unto you because they have seen the truth.*

🌹 Purport :
The path of spiritual realization is undoubtedly difficult. The Lord therefore advises us to approach a bona fide spiritual master in the line of disciplic succession from the Lord Himself. No one can be a bona fide spiritual master without following this principle of disciplic succession.

The Lord is the original spiritual master, and a person in the disciplic succession can convey the message of the Lord as it is to his disciple. No one can be spiritually realized by manufacturing his own process, as is the fashion of the foolish pretenders. The Bhāgavatam (6.3.19) says, dharmaṁ tu sākṣād bhagavat-praṇītam: the path of religion is directly enunciated by the Lord. Therefore, mental speculation or dry arguments cannot help lead one to the right path. 

Nor by independent study of books of knowledge can one progress in spiritual life. One has to approach a bona fide spiritual master to receive the knowledge. Such a spiritual master should be accepted in full surrender, and one should serve the spiritual master like a menial servant, without false prestige. Satisfaction of the self-realized spiritual master is the secret of advancement in spiritual life. Inquiries and submission constitute the proper combination for spiritual understanding.

Unless there is submission and service, inquiries from the learned spiritual master will not be effective. One must be able to pass the test of the spiritual master, and when he sees the genuine desire of the disciple, he automatically blesses the disciple with genuine spiritual understanding. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 595 / Vishnu Sahasranama Contemplation - 595🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 595. వృషప్రియః, वृषप्रियः, Vr‌ṣapriyaḥ 🌻*

*ఓం వృషప్రియాయ నమః | ॐ वृषप्रियाय नमः | OM Vr‌ṣapriyāya namaḥ*

*వృషశ్చాసౌ ప్రియశ్చేతి వృషప్రియ ఇతీర్యతే ।*
*వృషో ధర్మః ప్రియో యస్య హరిర్వాఽయం వృషప్రియః ।*
*వా ప్రియస్యేత్యతః పూర్వనిపాతస్య వికల్పనాత్ ॥*

*వృషము ఎవనికి ప్రియమో అనగా ధర్మము ఎవనికి ప్రియమో ఆతడు వృషప్రియః. లేదా ఈ భగవానుడు సర్వకామిత ఫలములను వర్షించు వృషుడును, ప్రియకరుడగు ప్రియుడునుగనుక వృషప్రియః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 595🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻595. Vr‌ṣapriyaḥ🌻*

*OM Vr‌ṣapriyāya namaḥ*

वृषश्चासौ प्रियश्चेति वृषप्रिय इतीर्यते ।
वृषो धर्मः प्रियो यस्य हरिर्वाऽयं वृषप्रियः ।
वा प्रियस्येत्यतः पूर्वनिपातस्य विकल्पनात् ॥

Vr‌ṣaścāsau priyaśceti vr‌ṣapriya itīryate,
Vr‌ṣo dharmaḥ priyo yasya harirvā’yaṃ vr‌ṣapriyaḥ,
Vā priyasyetyataḥ pūrvanipātasya vikalpanāt.

*He to whom vr‌ṣa i.e., dharma or righteousness is priya or dear. Or He who abundantly bestows fulfillment of all the appropriate desires and also the One who is very dear.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 274 / DAILY WISDOM - 274 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 30. జీవితమంతా వ్యాపించి ఉన్నది ఒకే ఆత్మ 🌻*

*భగవద్గీత కర్మని భౌతిక మరియు సామాజిక పరిధుల నుండి విముక్తం చేసి కర్మ యొక్క గౌరవాన్ని పెంచింది. భగవద్గీత ప్రతి వ్యక్తి విధిగా కర్మ చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పడమే కాక మనం ఎందుకు కర్మ చేయాలో కూడా మనకు జ్ఞానోదయం చేసింది. కర్మ చేయడమన్నది కేవలం భౌతిక సౌకర్యాలు మరియు సంఘంలో స్థానం కోసం కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం నీ మీద పెట్టిన ఒక విధి. ఈ ఆధ్యాత్మిక ప్రకృతి లో నువ్వు భాగమైతే చరాచర జగత్తు లో అంతటా వ్యాపించి ఉన్నది ఒకటే అని, అదే నీలో మరియు నీ తోటివారిలో వ్యాపించి ఉన్నదని, వారిని కలవడమంటే వారిలో ఉన్న నిన్ను నువ్వు కలవడమే అని తెలుసుకుంటావు.*

*అది తెలుసుకున్నప్పుడు కర్మ కేవలం భౌతిక అవసరం అవ్వదు. గీత మనల్ని భగవంతుడు సృష్టి చేసిన రీతిన కర్మ ఆచరించమని ఉద్భోదిస్తుంది. భగవంతుడు జీవులను సృష్టించినప్పుడు పరస్పర త్యాగ భావన (సహయజ్ఞం)తో ఉండే పరిస్థితులను సృష్టించాడు. తన దగ్గర ఉన్న దానిని అందరితోనూ పంచుకునేలా, తద్వారా పరస్పర సహకారంతో ముందుకు ఎదిగే అవకాశాన్ని ఇచ్చాడు. ఎలాగంటే ప్రతివారి దగ్గర తన తోటి వారికి అవసరమయ్యేది కొంతైనా ఉంటుంది. తమ అవసరాలు అన్ని తమ దగ్గరే ఉండటం జరగదు. ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకోవాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 274 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 30. The One Soul Permeating All Life 🌻*

*It is the gospel of the Bhagavadgita that has lifted the dignity of labour and social welfare work above its ordinary meaning generally limited to the physical and empirical circumference of society. While the Bhagavadgita emphasises the need to work as an obligatory call on each and every person, it also enlightens us as to why we should work at all. The reason is not just the material comforts of social existence but a higher demand from the spiritual side of human nature which in a state of insight beholds the one soul permeating all life and the need to present oneself before others in the light of a presence in others of that which is present in oneself also.*

*Work, then, becomes a larger requirement on the part of man than merely a social necessity. The Gita exhorts us to work and serve as a Superman does, nay, as God Himself operates in creation. We are told that the Creator projected beings together with a compulsion for sacrifice (sahayajna), an impulse to share with others what one has, even as one would wish to share for oneself something of what others have, in a mutual give-and-take system of cooperation, inasmuch as everyone may have something which may be the need of another and no one can have all things that one may require in life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 174 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ధ్యానం అస్తిత్వ సంబంధమైనది. తాత్వికమైంది కాదు. అది నీకు మెలకువనిస్తుంది. అందువల్ల నిన్ను నువ్వు ఎదుర్కోగలవు. సత్యమే జ్ఞానోదయం. 🍀*

*మనిషి అచేతనంగా జీవిస్తాడు. యితరులు చేస్తారు కాబట్టి తనూ ఆ పనులు చేస్తాడు. అనుసరిస్తాడు. అనుకరిస్తాడు. తను పనులు ఎందుకు చేస్తున్నానని ఆలోచించడు. తనెవరో అన్న కనీస స్పృహ కూడా వుండదు. తనెక్కడి నించీ వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో కూడా ఆలోచించడు. ధ్యానం ద్వారా వ్యక్తి పరిష్కరించాల్సిన మౌళిక విషయాలివి.*

*ఎట్లాంటి ఫిలాసఫీ దీనికి సహకరించదు. అవి సమాధానాలిస్తాయి. కానీ అవన్నీ భ్రాంతులే. ధ్యానం అస్తిత్వ సంబంధమైనది. తాత్వికమైంది కాదు. అది నీకు మెలకువ నిస్తుంది. అందువల్ల నిన్ను నువ్వు ఎదుర్కోగలవు. సత్యమే జ్ఞానోదయం. ఆలోచన చేసే నిర్ణయం కాదు. ధ్యానం వల్ల జ్ఞానోదయమవుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 113 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 89. దైవకారుణ్యము - 1 🌻*

*సృష్టి కథ యందు పూర్వార్ధము అవతరణమునకు సంబంధించి యుండగ, ఉత్తరార్థము పరిణామమునకు సంబంధించి యుండును. సృష్టి పరిణామము జీవుల పరిణామము కొఱకే. అసలు సృష్టి కూడ జీవుల కొఱకే. పరిణామము పరిపూర్ణము కాని అసంఖ్యాకులైన జీవుల
కొఱకు మరొకసృష్టి ఏర్పాటు చేయబడుచున్నది. ఇదియే దైవము యొక్క కారుణ్యము. జీవులందరును, తనంతటి వారు కావలెనని దైవము అభిలాష.*

*అందరును పరిమితత్త్వమును దాటి పరమ పదమున పడయవలెనని బహు విస్తారమగు సృష్టినిర్మాణము గావించి పరిణామమునకు దైవము జీవుల కవకాశము కలిగించు చున్నాడు. జీవునకు దేహము నిచ్చి పోషణము గావించి విద్యాభ్యాసము గావించి దారి చూపు తండ్రి, కుమారుడు తనంతట వాడు కావలెననియే కదా! ఇది సహజమైన ప్రేమ. బాధ్యతతో, ప్రేమతో, కారుణ్యముతో అందించిన అవకాశమును, దుర్వినియోగము చేసుకొను జీవుల నేమన వలయును? అజ్ఞానులవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment