నిర్మల ధ్యానాలు - ఓషో - 174


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 174 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం అస్తిత్వ సంబంధమైనది. తాత్వికమైంది కాదు. అది నీకు మెలకువనిస్తుంది. అందువల్ల నిన్ను నువ్వు ఎదుర్కోగలవు. సత్యమే జ్ఞానోదయం. 🍀


మనిషి అచేతనంగా జీవిస్తాడు. యితరులు చేస్తారు కాబట్టి తనూ ఆ పనులు చేస్తాడు. అనుసరిస్తాడు. అనుకరిస్తాడు. తను పనులు ఎందుకు చేస్తున్నానని ఆలోచించడు. తనెవరో అన్న కనీస స్పృహ కూడా వుండదు. తనెక్కడి నించీ వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో కూడా ఆలోచించడు. ధ్యానం ద్వారా వ్యక్తి పరిష్కరించాల్సిన మౌళిక విషయాలివి.

ఎట్లాంటి ఫిలాసఫీ దీనికి సహకరించదు. అవి సమాధానాలిస్తాయి. కానీ అవన్నీ భ్రాంతులే. ధ్యానం అస్తిత్వ సంబంధమైనది. తాత్వికమైంది కాదు. అది నీకు మెలకువ నిస్తుంది. అందువల్ల నిన్ను నువ్వు ఎదుర్కోగలవు. సత్యమే జ్ఞానోదయం. ఆలోచన చేసే నిర్ణయం కాదు. ధ్యానం వల్ల జ్ఞానోదయమవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


04 May 2022

No comments:

Post a Comment