🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 113 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 89. దైవకారుణ్యము - 1 🌻
సృష్టి కథ యందు పూర్వార్ధము అవతరణమునకు సంబంధించి యుండగ, ఉత్తరార్థము పరిణామమునకు సంబంధించి యుండును. సృష్టి పరిణామము జీవుల పరిణామము కొఱకే. అసలు సృష్టి కూడ జీవుల కొఱకే. పరిణామము పరిపూర్ణము కాని అసంఖ్యాకులైన జీవుల
కొఱకు మరొకసృష్టి ఏర్పాటు చేయబడుచున్నది. ఇదియే దైవము యొక్క కారుణ్యము. జీవులందరును, తనంతటి వారు కావలెనని దైవము అభిలాష.
అందరును పరిమితత్త్వమును దాటి పరమ పదమున పడయవలెనని బహు విస్తారమగు సృష్టినిర్మాణము గావించి పరిణామమునకు దైవము జీవుల కవకాశము కలిగించు చున్నాడు. జీవునకు దేహము నిచ్చి పోషణము గావించి విద్యాభ్యాసము గావించి దారి చూపు తండ్రి, కుమారుడు తనంతట వాడు కావలెననియే కదా! ఇది సహజమైన ప్రేమ. బాధ్యతతో, ప్రేమతో, కారుణ్యముతో అందించిన అవకాశమును, దుర్వినియోగము చేసుకొను జీవుల నేమన వలయును? అజ్ఞానులవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
04 May 2022
No comments:
Post a Comment