బ్రహ్మచారిణి Brahmacharini


_(04.10.24) శ్రీశైలంలో బ్రహ్మచారిణి దుర్గాఅలంకారం_

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑


బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి , కుడి చేతిలో జప మాల , కమండలం , ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.


శబ్ద ఉత్పత్తి

బ్రహ్మచారిణీ అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది.

బ్రహ్మ , అంటే అన్నీ తెలిసిన , తానే జగత్తుగా కలిగిన , స్వయంగా దైవం , జ్ఞానం కలిగిన అనే అర్ధం వస్తుంది.చారిణి , అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం. కదలడం , ఒక పనిలో నిమగ్నమవడం , ఒక దానిని అనుసరించడం వంటి అర్ధాలు వస్తాయి.మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్ధిని.


పురాణ గాథ

పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా , హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా , ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ , ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీ దేవిగా జన్మెత్తి , శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి , తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ , తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు , తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.


ధ్యాన శ్లోకం

"దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా"

నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ శుక్ల విదియ నాడు పూజిస్తారు.

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄






_(04.10.24)ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవి అలంకారం_

🥭🥭🥭🥭🥭🥭🥭🍋🍋🥭🥭🥭


గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...

మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....

తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...


ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా , ‘నా , స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో , దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని , అగ్ని నుండి వాయువు , వాయువు నుండి ఓంకారం , ఓంకారంతో హృతి , హ్రుతితో వ్యాహృతి , వ్యాహృతితో గాయత్రి , గాయత్రితో సావిత్రి , సావిత్రితో వేదాలు , వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.


గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.

గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు , వారి చైతన్య శక్తులు:


1. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

2. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

3. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

4. ఈశ్వరుడు:

సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.


5. శ్రీకృష్ణుడు:

యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.


6. రాధాదేవి:

ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.


7. లక్ష్మీదేవి:

ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

8. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి , తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

9. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.


10. సరస్వతి:

విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.


11. దుర్గాదేవి:

దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.


15. శ్రీరాముడు:

ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.


17. చంద్రుడు:

శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.


19. బ్రహ్మ:

సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు: భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.


23. హంస:

వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


శ్రీ గాయత్రీ మాత మహాత్యం :

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.

నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.


గాయత్రి మంత్రాక్షరాలు :

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి , దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా , 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామావళి

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



ఓం తరుణాదిత్య సంకాశాయై నమః

ఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమః

ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః

ఓం తుహినాచల వాసిన్యై నమః

ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః

ఓం రేవాతీర నివాసిన్యై నమః

ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః

ఓం యంత్రాకృత విరాజితాయై నమః

ఓం భద్రపాదప్రియాయై నమః

ఓం గోవింద పదగామిన్యై నమః (10)

ఓం దేవర్షిగణ సంస్తుత్యాయై నమః

ఓం వనమాలా విభూషితాయై నమః

ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః

ఓం ధీరజీమూత నిస్వనాయై నమః

ఓం మత్తమాతంగ గమనాయై నమః

ఓం హిరణ్యకమలాసనాయై నమః

ఓం ధీజనాధార నిరతాయై నమః

ఓం యోగిన్యై నమః

ఓం యోగధారిణ్యై నమః

ఓం నటనాట్యైక నిరతాయై నమః (20)

ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః

ఓం చోరచారక్రియాసక్తాయై నమః

ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః

ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః

ఓం తురీయపథగామిన్యై నమః

ఓం గాయత్ర్యై నమః

ఓం గోమత్యై నమః

ఓం గంగాయై నమః

ఓం గౌతమ్యై నమః

ఓం గరుడాసనాయై నమః (30)

ఓం గేయగానప్రియాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం గోవిందపద పూజితాయై నమః

ఓం గంధర్వ నగరాకారాయై నమః

ఓం గౌరవర్ణాయై నమః

ఓం గణేశ్వర్యై నమః

ఓం గదాశ్రయాయై నమః

ఓం గుణవత్యై నమః

ఓం గహ్వర్యై నమః

ఓం గణపూజితాయై నమః (40)

ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః

ఓం గుణత్రయ వివర్జితాయై నమః

ఓం గుహావాసాయై నమః

ఓం గుణాధారాయై నమః

ఓం గుహ్యాయై నమః

ఓం గంధర్వరూపిణ్యై నమః

ఓం గార్గ్య ప్రియాయై నమః

ఓం గురుపదాయై నమః

ఓం గుహ్యలింగాంగ ధారిన్యై నమః

ఓం సావిత్ర్యై నమః (50)

ఓం సూర్యతనయాయై నమః

ఓం సుషుమ్నా నాడిభేదిన్యై నమః

ఓం సుప్రకాశాయై నమః

ఓం సుఖాసీనాయై నమః

ఓం సుమత్యై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం సుషుప్త్యవస్థాయై నమః

ఓం సుదత్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం సాగరాంబరాయై నమః (60)

ఓం సుధాంశు బింబవదనాయై నమః

ఓం సుస్తన్యై నమః

ఓం సువిలోచనాయై నమః

ఓం సీతాయై నమః

ఓం సర్వాశ్రయాయై నమః

ఓం సంధ్యాయై నమః

ఓం సుఫలాయై నమః

ఓం సుఖదాయిన్యై నమః

ఓం సుభ్రువే నమః

ఓం సునాసాయై నమః (70)

ఓం సుశ్రోణ్యై నమః

ఓం సంసారార్ణవతారిణ్యై నమః

ఓం సామగాన ప్రియాయై నమః

ఓం సాధ్వ్యై నమః

ఓం సర్వాభరణ పూజితాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం విమలాకారాయై నమః

ఓం మహేంద్ర్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః (80)

ఓం మహాసిద్ధ్యై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మోహిన్యై నమః

ఓం మధుసూదన చోదితాయై నమః

ఓం మీనాక్ష్యై నమః

ఓం మధురావాసాయై నమః

ఓం నగేంద్ర తనయాయై నమః

ఓం ఉమాయై నమః

ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః (90)

ఓం త్రిస్వరాయై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః

ఓం చంద్రమండల సంస్థితాయై నమః

ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః

ఓం వాయుమండల సంస్థితాయై నమః

ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః

ఓం చక్రిణ్యై నమః

ఓం చక్రరూపిణ్యై నమః

ఓం కాలచక్ర వితానస్థాయై నమః (100)


ఓం చంద్రమండల దర్పణాయై నమః

ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః

ఓం మహామారుత వీజితాయై నమః

ఓం సర్వమంత్రాశ్రయాయై నమః

ఓం ధేనవే నమః

ఓం పాపఘ్న్యై నమః

ఓం పరమేశ్వర్యై నమః (108)

_ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామావళిః సంపూర్ణం_

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅




_(04.10.24) బతుకమ్మ పండుగలో "ముద్దపప్పు బతుకమ్మ"_

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


మూడో రోజు ఆశ్వయుజ విదియ నాడు 'ముద్దపప్పు బతుకమ్మ'గా పూజిస్తారు. ఇవాళ ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

ఇవాళ తామర పాత్రల్లో మూడంతరాలలో చామంతి , సీతమ్మజడ , రామబాణం , మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ... , పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా , సోదరభావం , ప్రేమానురాగాలతో జరుపుకుంటారు.

గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే.. చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి.. ఒకరికొకరు పంచిపెడతారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి , తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ ఇళ్లకు చేరతారు.

పల్లెల్లో కోలాహలం

ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకుంటారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు , స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


No comments:

Post a Comment