🌹. శ్రీమద్భగవద్గీత - 595 / Bhagavad-Gita - 595 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 24 🌴
24. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||
🌷. తాత్పర్యం : కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమముల ద్వారా కార్యమననేమో, అకార్యమననేమో అవగాహనము చేసికొనవలెను. అట్టి విధినియమములను తెలిసియే మనుజుడు కార్యము నొనరించవలెను. తద్ధ్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు.
🌷. భాష్యము : పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు వేదములందలి నియమ, నిబంధనలన్నియును శ్రీకృష్ణభగవానుని తెలియుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుక మనుజుడు భగవద్గీత ద్వారా శ్రీకృష్ణభగవానునెరిగి భక్తియుతసేవలో మిమగ్నుడై కృష్ణభక్తిరసభావన యందు ప్రతిష్టితుడైనచో వేదవాజ్మయమొసగు జ్ఞానమునందు అత్యున్నత పూర్ణత్వమును బడసినట్లే యగును. శ్రీకృష్ణభగవానుని పొందుటకై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీచైతన్యమహాప్రభవు అత్యంత సులభము గావించిరి.
కేవలము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రమును జపించుట, భక్తియుక్తసేవాకార్యమున నిమగ్నుడగుట, కృష్ణునకు అర్పించిన ఆహారమునే ప్రసాదరూపమున గ్రహించుట వంటి కర్మలను గావించుమని ఆయన జనులకు ఉపదేశించిరి. ఇట్టి భక్తికార్యములన్నింటి యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవాడు వేదవాజ్మయము నంతటిని అధ్యయనము చేసినవానిగా భావింపబడును. అట్టివాడు పరిపూర్ణావగాహనకు నిశ్చయముగా వచ్చినట్టివాడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 595 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 24 🌴
24. tasmāc chāstraṁ pramāṇaṁ te kāryākārya-vyavasthitau
jñātvā śāstra-vidhānoktaṁ karma kartum ihārhasi
🌷 Translation : One should therefore understand what is duty and what is not duty by the regulations of the scriptures. Knowing such rules and regulations, one should act so that he may gradually be elevated.
🌹 Purport : As stated in the Fifteenth Chapter, all the rules and regulations of the Vedas are meant for knowing Kṛṣṇa. If one understands Kṛṣṇa from the Bhagavad-gītā and becomes situated in Kṛṣṇa consciousness, engaging himself in devotional service, he has reached the highest perfection of knowledge offered by the Vedic literature. Lord Caitanya Mahāprabhu made this process very easy: He asked people simply to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare and to engage in the devotional service of the Lord and eat the remnants of foodstuff offered to the Deity. One who is directly engaged in all these devotional activities is to be understood as having studied all Vedic literature. He has come to the conclusion perfectly. Of course, for the ordinary persons who are not in Kṛṣṇa consciousness or who are not engaged in devotional service, what is to be done and what is not to be done must be decided by the injunctions of the Vedas.
One should act accordingly, without argument. That is called following the principles of śāstra, or scripture. Śāstra is without the four principal defects that are visible in the conditioned soul: imperfect senses, the propensity for cheating, certainty of committing mistakes, and certainty of being illusioned. These four principal defects in conditioned life disqualify one from putting forth rules and regulations. Therefore, the rules and regulations as described in the śāstra – being above these defects – are accepted without alteration by all great saints, ācāryas and great souls.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment