🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 566. 'నిత్యతృప్తా' - 1 🌻
నిత్యమూ తృప్తిగ నుండునది శ్రీమాత అనియు, నిత్యమైన స్థితి యందుండుటచే తృప్తిగ నుండుననియు అర్థము. తృప్తి కలిగియుండుట వలన సుఖ ముండును. కోరిక కలిగి నపుడెల్ల అది తీరు వరకు ఆందోళన కలుగుచుండును. కోరిక తృప్తి అను స్థానము నుండి జీవుని వైదొలగించును. సత్వము నుండి రజస్సు లోనికి నెట్టును. రజస్సు అధికమైన కొలది తృప్తికి దూరమై పోవు చుండును. ఎంత సంపద అయిననూ అంగబలము, కీర్తిబలము వున్ననూ రజస్సున నున్నచో సుఖ ముండదు. మిక్కుటముగ సంపద, అంగబలము, కీర్తిబలము లేకున్ననూ తృప్తి కలిగియున్నచో సుఖముండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 566. 'Nityatrupta' - 1 🌻
"Eternal Contentment" refers to the ever-satisfied state of Sri Mata. This term implies that Sri Mata is always in a state of fulfillment and that her contentment is eternal. When one is content, they experience happiness. When desires arise, there is restlessness until those desires are fulfilled. Desires pull a person away from contentment and push them into the realm of rajas (activity and restlessness). The more one is influenced by rajas, the farther they move from contentment. No matter how much wealth, physical strength, or fame one possesses, happiness will elude them if they are dominated by rajas. On the other hand, even without immense wealth, physical power, or fame, a person can find happiness if they are content.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment