భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 173


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 173 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భరద్వాజ మహర్షి - 4 🌻


22. బహు ఉత్తమమయిన ధర్మం అనుత్తమమైనటువంటి కార్యంలో నిర్వహించబడటం మన దేశంలో జరుగుతోంది. A great principle wrongly applied అని దీనిని అనవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవటానికి అహింస పనికివస్తుంది. కాని లోకపాలన కోసమని అహింస అనేది పనికిరాదు. అందుకే, “అనార్యజుష్టం, అస్వర్గం, అకీర్తికరం” అంటూ అర్జునుణ్ణి కోప్పడ్డాడు భవంతుడు.

23. శత్రువులు దండెత్తి వస్తున్నారంటే రాజు మేరుపర్వతంవలె నిశ్చలంగా గంభీరంగా ఉండాలట. రాజులో కలవరం ఏమీ కనబడకూడదు. “అలాగా! శత్రువులు వస్తున్నారా! రానియ్యండి. ఏమీ ఫరవాలేదు ధైర్యంగా ఎదుర్కొందాము!” అని దైర్యంగా కనబడాలి. తనను నమ్ముకున్నవాళ్ళందరికీ రాజు ధైర్యస్థుడిగా కనబడాలి. ఎంత ఉపద్రవం వచ్చినప్పటికీ మేరువువలె ధైర్యంగా ఉండాలి. “ప్రభువు శూన్యగృహంవలె ఉండాలి” అంటాడు భరద్వాజుడు. ఎంత చపత్కారం!

24. అంటే, సంపదల విషయంలో శూన్యగృహంలాగా ఉండాలి. శూన్యగృహాలు ఎప్పుడూకూడా సంపదలు ఎన్నైనా తీసుకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి. ఇంకా తీసుకురా! నవనిధులున్నాయా అని అంటాము. అందుకనే రాజు, శూన్యగృహంవలె, ఎంత సంపద వచ్చినప్పటికీ తీసుకునేటట్లు ఉండాలట.

25. ఆర్యధర్మంలో చాలా గొప్పసూత్రాలు, ఆధర్శాలు ఉన్నాయి. కానీ వాటికి సముచితమైన స్థానాలున్నాయి. సముచితమైన, సందర్భోచితమైన కాలాలుకూడా ఉన్నయి. ఆ ప్రకారంగా రాజు నటుడిలాగా ఉండాలని భరద్వాజుడు రాజధర్మం చెప్పాడు. అనేక అవతారాలతో ఉండాలన్నాడు.

26. అనేక అవతారలక్షణాలు కలిగి ఉండడమంటే – రాజు వద్దకు అనేకులు వస్తారు. పండితులొస్తారు. గోష్ఠి చేస్తారు. కవులు కవిత్వం చెప్తారు. ఒకరు బ్రహ్మసూత్ర భాష్యం చెప్పవచ్చు. మరొకనాడు ఎవరైనా స్వాములవారు వస్తారు. వారి బోధకూడా వినవచ్చు. అయితే అది తనకే, తన జీవలక్షణంలో, తన ఆత్మయొక్క ఔన్నత్యం కోసం మాత్రమే పనికొచ్చే విషయం అది.

27. అంతేకాని Administration లోకి తీసుకెళ్ళే Subject కాదు అది. It is purely personal. Highly Personal. Exclusively Personal. ప్రాపంచిక విషయాలలో సంబంధంలేని విషయమది. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో ఆచితూచి అడుగులేస్తూ వెళ్ళాలి. అందువల్ల అనేక అవతార లక్షణాలు కలిగి ఉండాలి. సర్వతోముఖంగా ఉండాలి. రాజు ఎప్పుడూ రాజ్యాన్ని అభివృద్ధి చేసుకునే దృష్టిలోనే ఉండాలని భరధ్వాజుడి బోధ.

28. కాశ్మీరపటం చూస్తే, ఇప్పటికే సగంపోయింది. ఒకవేళ మనం సరిగా మన ఆర్యధర్మం విస్ధించిన రాజధర్మంతో వ్యవహరించిఉంటే, అది నిలబడి ఉండేది. మనమే అవతలవాడి land ను ఆక్రమించు కొంటామనే భయం వాడికి ఉంటే, వాడు మనదాకారాడు! రాజనీతి అది.

29. అయితే మనం బౌద్ధనీతిని అవలంభించాం. అందుకే రాజ్యం ఈట్లా ఉంది. బౌద్ధనీతి సన్యాస ఆశ్రమంలో ఉండేవాడికి ఉచితం. రాజ్యం పరిపాలించేవాడికి క్షాత్రమే ఉచితం. అయితే మన చరిత్రలో జరిగిందేమంటే, గొప్పగొప్ప విలువలన్నీ, పాటించరాని సందర్భంలో, ప్రదేశంలో, పాటించకూడని వ్యక్తులచేత లేదా వ్యక్తులకొరకు పాటించబడ్డాయి. Great values, కానీ Wrong man, wrong place, wrong application.

30. ఆర్యధర్మం నశించటానికి ఈ మహా సూత్రాల అసందర్భపు ఆచరణే కారణం. ఆర్యధర్మాలన్నీ ఉత్తమధర్మాలే! కాని ఏ ధర్మమూ నేడు సరిగ్గా, సక్రమంగా అమలుజరగటం లేదు. ధర్మాలు సక్రమంగానే ఉన్నాయి. కాని ఏదీకూడ సరిగా, స్వస్థానంలో లేదు. అదే చిత్రం! ఇప్పుడు భారతదేశంలో అన్ని ధర్మాలుకూడా వాటివాటి గతులు తప్పి స్థానాంతరాలల్లో ఉన్నాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Dec 2020

No comments:

Post a Comment