14-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 185🌹  
2) 🌹. శివ మహా పురాణము - 385🌹 
3) 🌹 Light On The Path - 134🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -13🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 207🌹
6) 🌹 Osho Daily Meditations - 2 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 62 / Lalitha Sahasra Namavali - 62🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 62 / Sri Vishnu Sahasranama - 62🌹
🌹. వసంత నవ రాత్రులు 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -185 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 26

*🍀 26. ఆత్మ వైభవము - క్రమమగు సాధన చేయు సాధకునకు చంచలమగు మనస్సు క్రమముగ స్థిరచిత్తముగ మారి, బుద్ధియందు ప్రవేశించి, ఆత్మయందు లగ్నమగుట వలన మనస్సెచ్చటకు సంచరించినను, అచట ఆత్మ దర్శనము జరుగుచు, సమస్తమునందు గల ఆత్మ దర్శన మిచ్చి, ఆత్మ యందు నిలచి, ఆత్మను చూచు ఉత్తమమగు స్థితి కలుగును. జీవితము దివ్యవైభవముతో నిండియుండును. అన్నిట, అంతట, సర్వకాలముల యందు ఆత్మయందే తానున్నట్లు, తనయందు ఆత్మ యున్నట్లు భావన కలుగును. పరమ భక్తులు, యోగులు నిత్యము పొందు అనుభూతి ఇదియే. అట్టి వారికి సర్వమును దివ్యమే. దైవము యొక్క లీలావిలాసము. 🍀*

యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్ |
తతస్తతో నియమ్యై దాత్మన్యేవ వశం నయేత్ || 26

ఈ క్రమమగు సాధన చేయు సాధకునకు చంచలమగు మనస్సు క్రమముగ స్థిరచిత్తముగ మారి, బుద్ధియందు ప్రవేశించి, ఆత్మయందు లగ్నమగుట వలన మనస్సెచ్చటకు సంచరించినను, అచట ఆత్మ దర్శనము జరుగుచు, సమస్తమునందు గల ఆత్మ దర్శన మిచ్చి, ఆత్మ యందు నిలచి, ఆత్మను చూచు ఉత్తమమగు స్థితి కలుగును.

“ఆత్మన్యేవ వశం నయేత్" అనునది ఈ శ్లోకమున ఫల శ్రుతి. చపల స్వభావముగల మానవుడు నిలకడలేని మనస్సుతో ఇదివర కెచటెచట సంచరించెనో అచటచటనే క్రమముగ ఆత్మ దర్శన మగుట కన్న అద్భుత మేమున్నది? ఇల్లు వాకిలి, భర్త భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, వృత్తి వ్యాపారాదులు, ఆస్తిపాస్తులు ఇదివరకు గోచరించిన రీతిగ గాక ఆత్మ వైభవముగ గోచరించును. తనను బంధించునవిగాక, ఆనందమునకు నిలయములై గోచరించును. 

భార్యను చూచి నను, అట్లే భార్య భర్తను చూచినను పై తెలిపిన ఇతరము లన్నియు ఏమి చూచినను, అందాత్మవైభవమే గోచరించి ఆనందము కలిగించును. పూర్వము చపల స్వభావముతో చూచుట జరిగినది. అది గ్రుడ్డివాని చూపువంటిది. ప్రస్తుతము ఆత్మ, బుద్ధి, మనస్సు ఏకత్వ మొందుట వలన సమస్తము నందలి ఆత్మయే గోచరించుచు నుండును. 

ఈయనుభవమునే గోపికల అనుభవముగ భాగవతము దశమ స్కంధమున వర్ణింబడినది. ఇట్టివాని జీవితము దివ్యవైభవముతో నిండియుండును. అన్నిట, అంతట, సర్వకాలముల యందు ఆత్మయందే తా నున్నట్లు, తనయందు ఆత్మ యున్నట్లు భావన కలుగును. పరమ భక్తులు, యోగులు నిత్యము పొందు అనుభూతి ఇదియే. అట్టి వారికి సర్వమును దివ్యమే. దైవము యొక్క లీలావిలాసము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 385🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 15

*🌻. తారకుని తపస్సు - 2 🌻*

ఓ మహర్షీ! ఈ తీరున బహు విధముల ఉత్పాతములు పుట్టినివి. అచటి అజ్ఞానులగు జనులు జగత్తునకు ప్రలయము వచ్చుచున్నదని తలపోసిరి. (17) తరువాత కశ్యప ప్రజాపతి విమర్శలను చేసి, మహాతేజశ్శాలియగు ఆ రాక్షస బాలకునకు తారకుడని పేరు పెట్టెను(18). మహా వీరుడు , ప్రకటింపబడుచున్న స్వీయ పౌరుషము గలవాడు నగు ఆ తారకుడు పర్వతమువలె పాషాణదృఢమగు శరీరముతో శీఘ్రముగా పెరుగ మొదలిడెను.(19) గొప్ప బలపరాక్రమములు గలవాడు, దృఢచిత్తము గలవాడునగు ఆ తారకుడపుడు తపస్సును చేయుటకు తల్లి ఆజ్ఞను వేడుకొనెను.(20)

మాయావులనైనా మోహింప చేయగలిగే ఆ మాహామాయావి తల్లి ఆజ్ఞను పొంది, దేవతలనందరినీ జయించుటకై తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయించుకొనెను(21). పెద్దల ఆజ్ఞను పాలించి అతడు మధువలమును చేరి బ్రహ్మ గారినుద్ధేశించి మిక్కిలి తీవ్రముగు తపస్సును యథావిధిగా చేసెను.(22) అతడు చేతులు పైకెత్తి ఒక కాలిపై నిలబడి సూర్యుని చూచుచూ దృఢమగు మనస్సు దృఢమగు దీక్ష గలవాడై వంద సంవత్సరములు తపస్సు చేసెను(23). దృఢనిశ్చయము గలవాడు, రాక్షసులకు అధీశ్వరుడు అగు ఆ తారకుడు బొటన వ్రేలిపై నిలబడి అదే తీరున వంద సంవత్సరములు తపస్సు చేసెను(24).

అతడు వంద సంవత్సరములు నీటిని మాత్రమే త్రాగుచూ , వంద సంవత్సరములు గాలిని మాత్రమే భక్షించి, వంద సంవత్సరములు నీటిలో నిలబడి, మరియు వంద సంవత్సరములు నేలపై నిలబడి తపస్సును చేసెను (25). వంద సంవత్సరములు అగ్నుల మధ్యలో , వంద సంవత్సరముల శీర్షాసనములో మరియు వంద సంవత్సరములు అరిచేతిపై నేలమీద నిలబడి తపస్సును చేసెను(26). ఓ మహర్షీ! వంద సంవత్సరములు చెట్టు కొమ్మనుండి కాళ్లతో వ్రేలాడుతూ , మరియు క్రిందకు వ్రేలాడు ముఖముతో నిప్పులనుండి వెలువడు పొగను త్రాగి తపస్సును చేసెను.(27) ఈ విధముగా ఆ రాక్షస రాజు వినువారలకు కూడ సంహింపశక్యము గాని ఘోరతపస్సును తన కోరిక సిద్ధించుటకై యథా విధిగా చేసెను(28).

ఇట్లు తపస్సును చేయుచున్న ఆ తారకుని శిరస్సు నుండి గొప్ప తేజస్సు బయల్వెడలి అంతటా వ్యాపించి గొప్ప విపత్తును కలిగించెను. ఓ మహర్షీ!(29). దానిచే ఆ దేవలోకములు దహింపబడుచున్నవా అన్నట్లుండెను. ఓ మునీ! దేవతలు,మునులు అందరూ అన్ని వైపుల నుండియూ దుఃఖమును పొందిరి (30). అపుడు దేవరాజగు ఇంద్రుడు కూడా 'వీడేవడో తపస్సును చేసి నా పదవిని ఊడలాగుకొనునేమో !'అని భయపడెను. (31) పరమేశ్వరుడు అకాలములో బ్రహ్మంజ ప్రలయమును చేయుచున్నాడని దేవతలు సందేహమును పొందిరి. వారికి నిశ్చయము కలుగలేదు(32). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 134 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. do you enter into a partnership of joy, which brings indeed terrible toil and profound sadness, but also a great and ever-increasing delight. - 3 🌻*

That is only natural, but at the same time one does feel that many of them might take up the new ideas a little more quickly, and it is certain that things of this sort do spread in a definite sort of ratio. One man can state a view and make a little impression; ten men can make more than ten times the impression; a hundred men can make vastly more than a hundred times the impression that one man could, unless he happened to be a rare genius.

We have some thirty thousand members in our Society; I think if all of them were really taking this higher philosophical view of life, and were thereby obviously avoiding a great amount of suffering, they would form a powerful and striking example. In that way we could help a vast number who as yet do not know anything about the higher side of things.

509. When we begin to see that what is being done is always the best – the best under the circumstances for everybody – our sorrow is no longer of the same kind as before. We are just as sympathetic towards others, but we are no longer overwhelmed by their suffering; we sympathize with them but do not share their feelings. The Masters are profoundly sympathetic with people who are suffering, and yet we could not say that They Themselves share in that suffering, because of Their insight. 

As I have said before, a Master is never sad, never depressed. It has seemed to me sometimes, however, as though even They could be disappointed with people. I do not know that I ought to say even as much as that, but I know this, that They make very strong efforts sometimes to bring about certain results, and yet those results, through the failure of Their instruments, are not brought about. I do not know whether They foresee from the beginning that those efforts will fail. 

I cannot but feel that in many cases They do, but yet They make them precisely as though They expected them to succeed. For example, much work was done before the great war in an attempt to avoid it. That effort failed, but whether the Adepts who inaugurated it knew from the beginning that such would be the result I do not know: They worked at it as though They expected it to be successful.

510. Madame Blavatsky in many cases offered people opportunities in a similar way. Sometimes she made every endeavour to persuade them to take them, when she knew from the beginning that they would not do so. I well remember one occasion on which some people came to her to make enquiries. They seemed to me obviously unsuited for any Theosophic knowledge or -work, since they were not at all in the frame of mind in which it would be of use to them. She spoke to these mere casual strangers, and told them about quite intimate things which she hoped to do in the Society. 

They were rather sneering people, who did not seem in the least worthy of such confidence, and when they went away the Countess Wachtmeister said: “Madame, why did you tell those people these things? It seems certain they are not the sort of people to whom it would do any good. They will only go away and sneer, and perhaps do us harm.” Madame Blavatsky replied: “Well, my dear, some karma has brought them to me, and I must give them their chance, and do all I can for them.” 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 13 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సప్తర్షులు - సప్త జాతులు 🌻*

ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు అనబడువారు ఒక్కొక్క తారకను అధిష్టించి పనిచేయుచుందురు. వారి ప్రభావమున మన భూమిపై నరజాతుల స్వభావములు కూడ ఏర్పడుచుండును.  

సప్తర్షులను బట్టి భూగోళము మొత్తమున ఏడు జాతులు వర్తించును‌. అందొక్కొక్క జాతి యందు ఉపజాతులు ఏడు వర్తించును. ఈ జాతులు స్వభావ గుణ కర్మ స్వరూపులుగా ఏర్పడును గాని, రాజకీయపు సరిహద్దులను బట్టి ఏర్పడవు.  

మఱియు ఒక్కొక్క తారకకు అధిదేవత అయిన వెలుగు యొక్క అంశలో ఒక్కొక్క దేహధారి ఈ భూమియందు పనిచేయుచుండును. వీని వివరములన్నియు పురాణేతిహాసముల యందు విస్తారముగా వెదజల్లబడి యున్నవి.  

మనకు బోధపడునట్లు ఆంగ్లమున ఇరువదియవ శతాబ్దమున హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ రచించిన Secret Doctrine గ్రంథము నందును, Alice A Bailey రచించిన The Seven Rays అను శీర్షికతో ప్రకటింపబడిన ఇరువది నాలుగు గ్రంథముల యందును ప్రచురింప బడినవి.

భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹Osho Daily Meditations - 2🌹*
📚. Prasad Bharadwaj

*🍀 2. AMATEURS AND EXPERTS 🍀*

All great discoveries are made by amateurs. It always happens that when you start new work, you are very creative, you are deeply involved, your whole being is in it. Then by and by, as you become acquainted with the territory, rather than being inventive and creative you start being repetitive. This is natural, because the more skilled you become in any work, the more repetitive you become. Skill is repetitive.

So all great discoveries are made by amateurs, because a skilled person has too much at stake. If something new happens, what will happen to the old skill? The person has learned for years and now has become an expert. So experts never discover anything; they never go beyond the limit of their expertise.  

On the one hand, they become more and more skillful, and on the other hand they become more and more dull and the work seems to be a drag. Now there is nothing new that can be a thrill to them-they already know what is going to happen, they know what they are going to do; there is no surprise in it.  

So here is the lesson: It is good to attain to skill, but it is not good to settle with it forever. Whenever the feeling arises in you that now the thing is looking stale, change it. Invent something, add something new, delete something old. Again be free from the pattern-that means be free from the skill-again become an amateur. It needs courage and guts, to become an amateur again, but that's how life becomes beautiful.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 207 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సమీక్ష - 5 🌻*

768. ఆత్మా, భౌతిక ప్రపంచనుభవమును పొందు చున్నపుడు జనన - మరణములు, కష్ట -సుఖములు, పుణ్య - పాపములు మొదలైన ద్వంద్వ అనుభవములు అన్నింటిని, యీ స్థూల రూపమే పొందుచున్నది. 

769. ఆత్మకు స్థూలరూపము నీడ వంటిది. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది.

770. ఆత్మ పొందుచున్న అనుభవములన్నియు తన నీడయైన స్థూలరూపానుభవములే కాని, ఆత్మకు ఎట్టి అనుభవము లేదు.

771. భౌతిక ప్రపంచము పరమాత్మకు ఛాయ కాబట్టి, ప్రపంచ అనుభవములు అన్నియు, అయదార్ధమైనవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 62 / Sri Lalita Sahasranamavali - Meaning - 62 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।*
*విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀*

🍀 254. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - 
ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.

🍀 255. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.

🍀 256. విశ్వరూపా - 
విశ్వము యొక్క రూపమైనది.

🍀 257. జాగరిణీ - 
జాగ్రదవస్థను సూచించునది.

🍀 258. స్వపంతీ - 
స్వప్నావస్థను సూచించునది.

🍀 259. తైజసాత్మికా - 
తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 62 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 62. dhyāna-dhyātṛ-dhyeyarūpā dharmādharma-vivarjitā |*
*viśvarūpā jāgariṇī svapantī taijasātmikā || 62 || 🌻*

🌻 254 ) Dhyana Dhyathru dhyeya roopa -   
She who is personification of meditation, the being who meditates and what is being meditated upon

🌻 255 ) Dharmadhrama vivarjitha -   
She who is beyond Dharma (justice) and Adharma(injustice)

🌻 256 ) Viswa roopa - She who has the form of the universe

🌻 257 ) Jagarini -   
She who is always awake

🌻 258 ) Swapanthi -   
She who is always in the state of dream

🌻 259 ) Thaijasathmika -   
She who is the form of Thaijasa which is microbial concept. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 62 / Sri Vishnu Sahasra Namavali - 62 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*విశాఖ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🌻 62. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |*
*సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్| 62 ‖ 🌻*

🍀 574) త్రిసామా - 
మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.

🍀 575) సామగ: - 
సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.

🍀 576) సామ - 
సామవేదము తానైనవాడు.

🍀 577) నిర్వాణమ్ - 
సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.

🍀 578) భేషజం - 
భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.

🍀 579) భిషక్ - 
భవరోగమును నిర్మూలించు వైద్యుడు.

🍀 580) సంన్యాసకృత్ - 
సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.

🍀 581) శమ: - 
శాంత స్వరూపమైనవాడు.

🍀 582) శాంత: - 
శాంతి స్వరూపుడు.

🍀 583) నిష్ఠా - 
ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.

🍀 584) శాంతి: - 
శాంతి స్వరూపుడు.

🍀 585) పరాయణమ్ - 
పరమోత్కృష్ట స్థానము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 62 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Star Visakha 2nd Padam*

*🌻62. trisāmā sāmagaḥ sāma nirvāṇaṁ bheṣajaṁ bhiṣak |
saṁnyāsakṛcchamaśyāntō niṣṭhā śāntiḥ parāyaṇam || 62 || 🌻*

*Sloka for Visakha 2nd Padam*

🌻 574. Trisāmā: 
One who is praised by the chanters of Sama-gana through the three Samas known as Devavratam.

🌻 575. Sāmagaḥ: 
One who chants the Sama-gana.

🌻 576. Sāma: 
Among the Vedas, I am Sama Veda.

🌻 577. Nirvāṇaṁ: 
That in which all miseries cease and which is of the nature of supreme bliss.

🌻 578. Bheṣajaṁ: 
The medicine for the disease of Samsara.

🌻 579. Bhiṣak: 
The Lord is called Bhishak or physician.

🌻 580. Saṁnyāsakṛt: 
One who instituted the fourth Ashrama of Sanyasa for the attainment of Moksha.

🌻 581. Samaḥ: 
One who has ordained the pacification of the mind as the most important discipline for Sannyasins (ascetics).

🌻 582. Sāntaḥ: 
The peaceful, being without interest in pleasures of the world.

🌻 583. Niṣṭhā: 
One in whom all beings remain in abeyance at the time of Pralaya.

🌻 584. Śāntiḥ: 
One in whom there is complete erasing of Avidya or ignorance. That is Brahman.

🌻 585. Parāyaṇam: 
The state, which is the highest and from which there is no return to lower states.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వసంత నవరాత్రులు 🌹*
*🌻. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 🌻*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే... *‘ఋతూనా కుసుమాతరః’* అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే *ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?*

ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ *‘వసంత నవరాత్రులు’* సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే... తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి ? పదిరాత్రులు జరుపుకోకూడదా ? ఏమిటీ లెక్క ? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అని ‘కొత్త’ అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’ అంటే...
అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం. ఇక తొమ్మి రాత్రులు ఎందుకుచేయాలంటే....

*భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు*

     *శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం*
        *అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం*

శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.   

నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.

*వసంత నవరాత్రి మహిమ*

*ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|*
*శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||*

సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.

సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. *"శ్రీరామో లలితాంబికా"* అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.

మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి , తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి , ప్రశాంత స్థితిని అనుభవించడానికి , నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు. వ్యాస మహర్షి.

నవరాత్రులకు ముందు రోజే కుంకుమ , పూలు , పండ్లు , సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని , మరునాడు (పాడ్యమినాడు) ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ *"సంకల్పం"* చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులూ దేవిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించు కోవడమే *"సంకల్పం".*

తొలినాడు ముందుగా గణపతి పూజ , తరువాత పుణ్యాబవాచనం , అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి , పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. విఘ్ననివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ. పూజ జరుగు చున్న ప్రదేశము , సమయము , పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు , పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికి మనస్సు , పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం.

పూజా వేదికపై నలుదిక్కులా సూర్యుణ్ణి , గణపతిని , శివుణ్ణి , విష్ణువుని , నిలిపి , కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో , నిర్మలమైన భావంతో పూజ సాగించాలి.

*"భావేషు విద్యతే దేవో న పాషాణ న మృణ్మయే|*

*న ఫలం భావహీనానాం తస్మాత్‌ భావో హి కారణమ్‌"||*

అని శాస్రం వివరిస్తోంది. శిలావిగ్రహాలలో , మట్టిబొమ్మలలో దేవుడున్నాడా ? అని అంటే అది *'భావనా'* బలాన్ని బట్టి - అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక ఆ విగ్రహాలనో లేకమట్టిబొమ్మలనో ప్రతిమలుగా కాక , దివ్య శక్తికి ప్రతీకలుగా భావనం చేయడమే సాధనలో తొలిమెట్టు.

శ్రద్ధాళువులైన వారు నవరాత్రులలో యాథాశక్తిగా దేవీ మంత్రాన్ని జపించాలి. గౌరీ పంచాక్షరీ , బాలా షడక్షరీ , నవార్ణ చండికా , పంచదశీ , షోడశీ మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే. గురుముఖతః ఉపదేశం పొంది , విధానం తెలుసుకొని , నియమనిష్ఠలతో మంత్రానుష్ఠానం సాగించాలి.

మంత్రము , యంత్రము , తంత్రము అనేవి మూడూ దేవీ పూజా విధానంలో ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానం అయిన తరువాత పీఠపూజతో ప్రారంభించి షోడశోపచారాలతో దేవిని ఆరాధించి , సహస్రనామావళితో , అష్టోత్తర శతనామాలతో పూజించి , ధూప దీప నైవేద్యాలను , తాంబూల నీరాజనాలను సమర్పించి , యథాశక్తిగా గీత , వాద్య , నృత్య శేషాలతో అర్చించి , ఛత్ర చామరాలతో దేవికి సపర్యలు చేయాలి.

ఈ తొమ్మిది రోజులూ దేవీ సంబంధమైన స్త్రోత్రాలతో , కథలతో దేవీ మహీమా విశేషాలతో కాలాన్ని దేవీ మయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి. కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్య లహరి , సప్తశతి , దేవీ బాగవతం మొదలైన దేవీ సంబంధమైన వాఙ్మయాన్ని పఠనం లేదా శ్రవణం చేయాలి. ఇలా తొమ్మిది రోజులూ పూజించి , పదవనాడు విజయ సూడకంగా విజయోత్సవం నిర్వహించాలి.

ఈ నవరాత్రులలో కుమారీ పూజ , సువాసినీ పూజ బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతి పాత్రమైన విషయాలు. కుమారీ పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆ యా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు , మంగళ ద్రవ్యాలు సమర్పించాలి. *"ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః"* అనే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి , ఉపవాసంతో కాని , ఏక భుక్తంతో కాని , రాత్రి భోజనంతో గాని ఆహార నియమాన్ని విధించుకొని నవరాత్రి వ్రతం పాటించాలి.

*పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య "కుమారిక !"*

*విదియనాడు మూడు సంవత్సరాల కన్య "త్రిమూర్తి ,"*

*తదియ నాడు నాలుగు సంవత్సరాల కన్య "కల్యాణి ,"*

*చవితినాడు ఐదు సంవత్సరాల కన్య "రోహిణి ,"*

*పంచమినాడు ఆఱు సంవత్సరాల కన్య"కాళిక ,"*

*షష్ఠినాడు ఏడు సంవత్సరాల కన్య "చండిక ,"*

*సప్తమినాడు ఎనిమిది సంవత్సరాల కన్య "శాంభవి ,"*

*అష్టమినాడు తొమ్మిది సంవత్సరాల కన్య "దుర్గ ,"*

*నవమినాడు పది సంవత్సరాల కన్య "సుభద్ర"*

ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయః పరిమితి గల కన్యలను ఆరాధించడం వల్ల దారిద్ర్యనాశము , శత్రు వినాశము , దుఃఖ నివృత్తి , ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి.

నవరాత్రి పూజా విధానంలో సప్తమినాడు సరస్వతిని , అష్టమినాడు దుర్గను , నవమినాడు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికీ మహాసరస్వతి , మహాకాళి , మహాలక్ష్మి అని పేర్లు . వీరే ముగ్గురమ్మలు.

నవరాత్రి పూజలలో ఎఱ్ఱని పుష్పాలు , ఎఱ్ఱని గంధం , ఎఱ్ఱని అక్షతలు ఎఱ్ఱని వస్త్రాలు దేవికి సమర్పించి , ఆమెను కుంకుంతో పూజించాలి. ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము. *"రక్త గంధా, రక్త వస్త్రా, రక్తమాల్యాసులేపనా"* అని అమ్మవారిని వర్ణించడంలోని అంతర్యం ఇదే. ఆ తల్లి సర్వారుణ. ఆమెకు సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ ఎఱ్ఱగా ఉండడమే. ఆమెకు అభీష్టమని ఇందలి అంతరార్థం. ఎఱ్ఱని రంగు అగ్నివర్ణం. *తామగ్ని వర్ణాం తపసా జ్వలన్తీం "* అని వేద వాఙ్మయం వర్ణించింది. పవిత్రతకు సంకేతం అగ్ని. ఆమె ఆ రంగులో ఉన్నది - అంటే - పవిత్రతయే దైవము. అని అర్థం. ఆ రంగులో ఉన్న పూజా ద్రవ్యాలతోనే ఆమెను అరాధించాలి. అంటే సాధకుడు పవిత్ర హృదయం కలవాడై ఉండాలి - అని అంతరార్థం.

వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.

రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి , దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని , దేవిని ఆరాధించి , సకల సంపదలనూ పొంది, దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.

కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఆధ్యాత్మికసందేశాలు #భక్తిసందేశాలు
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment