మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 13
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 13 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సప్తర్షులు - సప్త జాతులు 🌻
ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు అనబడువారు ఒక్కొక్క తారకను అధిష్టించి పనిచేయుచుందురు. వారి ప్రభావమున మన భూమిపై నరజాతుల స్వభావములు కూడ ఏర్పడుచుండును.
సప్తర్షులను బట్టి భూగోళము మొత్తమున ఏడు జాతులు వర్తించును. అందొక్కొక్క జాతి యందు ఉపజాతులు ఏడు వర్తించును. ఈ జాతులు స్వభావ గుణ కర్మ స్వరూపులుగా ఏర్పడును గాని, రాజకీయపు సరిహద్దులను బట్టి ఏర్పడవు.
మఱియు ఒక్కొక్క తారకకు అధిదేవత అయిన వెలుగు యొక్క అంశలో ఒక్కొక్క దేహధారి ఈ భూమియందు పనిచేయుచుండును. వీని వివరములన్నియు పురాణేతిహాసముల యందు విస్తారముగా వెదజల్లబడి యున్నవి.
మనకు బోధపడునట్లు ఆంగ్లమున ఇరువదియవ శతాబ్దమున హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ రచించిన Secret Doctrine గ్రంథము నందును, Alice A Bailey రచించిన The Seven Rays అను శీర్షికతో ప్రకటింపబడిన ఇరువది నాలుగు గ్రంథముల యందును ప్రచురింప బడినవి.
భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment