శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 251 / Sri Lalitha Chaitanya Vijnanam - 251
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 251 / Sri Lalitha Chaitanya Vijnanam - 251 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀
🌻 251. 'చిన్మయీ' 🌻
చైతన్యమయమైనది శ్రీదేవి అని అర్థము. చిన్మయమనగా చైతన్యమయము. శ్రీమాతయే సృష్టి చైతన్యము. ఆమె ఉద్భవించుటయే సృష్టి మేల్కాంచుట. సృష్టిలోని ప్రతి వస్తువు నందు కూడ ఆమె ప్రభావమే మేల్కాంచి యుండును. గుణ రూపమున మనకు గోచరించుచుండును.
ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు, కారముగ ఆహార పదార్థములలో గోచరించునది శ్రీమాతయే. అట్లే పండ్లయందు వివిధమగు రుచులుగను, పువ్వులయందు సుగంధములుగను, సుగంధ ద్రవ్యములయందు సువాసనలుగను శ్రీమాత గోచరించును.
పంచభూతముల యందు ఆయా గుణములతో గోచరించును. జంతువుల యందు, మానవుల యందు వారి వారి స్వభావములకు మూలమైన సత్వ, రజస్తమో గుణ సంమిశ్రమముగ భాసించును.
అట్లే దేవతలయందు, దానవులయందు కూడ భాసించును. శ్రీమాత చైతన్యము త్రిగుణాత్మకమై సృష్టి అంతయూ ఆవరించి యుండగ త్రిగుణముల మిశ్రమమును బట్టి అనేకానేక జీవుల ప్రవర్తనము లుండును. గుణముల మిశ్రమములలోని భేదములే జీవుల స్వభావములోని భేదములుగ గోచరించును.
అందరూ జీవులే! జీవులుగ అందరూ శ్రీమాత సంతానమే! వారి నావరించి యుండు త్రిగుణముల మిశ్రమము వారి వారి అనుభవములకు సంబంధించి యుండును. మంచి చెడులు, ఉచ్చ నీచములు, కుడిఎడమలు, స్థూల సూక్ష్మములు అన్నియూ గుణముల మిశ్రమమే. అన్నిటి యందు గల ఈ గుణ మిశ్రమమున కాధారము శ్రీమాత చైతన్యమే. ఈ చైతన్య ముద్భవించనిచో జీవులందరూ నిద్రాణమగు స్థితి యందుందురు.
నిద్రాణ స్థితిలో రాజు, బంటు, పోలీసు, దొంగ, తెలిసినవారు, తెలియనివారు అందరూ సమానులే. సృష్టి క్రీడ అంతయూ గుణములుగ చైతన్యము మేల్కాంచినపుడే యుండును. ఈ చైతన్య స్వరూపము శ్రీమాత. త్రిగుణాత్మకము కాని ఈ చైతన్యమును శుద్ధ చైతన్య మందురు. శుద్ధ చైతన్యమున ఇచ్ఛ కాని, ఆ ఇచ్ఛను నిర్వర్తించవలసిన జ్ఞానముగాని, తత్సంబంధిత క్రియగాని ఇంకనూ మేల్కాంచి యుండవు. కేవలము చైతన్యమే యుండును.
తానున్నాను అన్న భావన తప్ప మరియొక భావన లేని స్థితి యది. ఈ శుద్ధ చైతన్య స్వరూపమే చిన్మయ స్వరూపము. ఈ స్వరూపము సత్య ప్రకాశముగ నుండును. స్వయం ప్రకాశముగ నుండును. తనకు తానే సహజమగు వెలుగుగ నుండును. సత్యమే తానుగ నున్నానను జ్ఞానమే (భావమే) ఈ వెలుగు.
అట్టి చేతన యందు సహజమగు ఆనంద ముండును. సత్, చిత్ అను ప్రకాశముగ మాత్రమే నుండుట వలన, త్రిగుణముల యందింకను జొరబడకుండుట వలన, ఎట్టి కోరిక లేకుండుట వలన పరిపూర్ణమైన ఆనంద ముండును. కేవలము సత్ చిత్లే యున్నప్పుడు కలుగు ఆనందము వర్ణనాతీతము. అదియే పరమానందము ఈ స్థితిని సత్ చిత్ ఆనందా- సచ్చిదానంద అందురు. ఈ సచ్చిదానంద స్థితి శ్రీదేవి సహజ స్థితి. జీవులకది గమ్యము.
త్రిగుణముల కావల ఈ చిన్మయ స్థితిని జీవుడు పొందగలడు. త్రిగుణముల కీవల సంసార బంధమున నుండును. చిన్మయ స్థితిని పొందినవారు త్రిగుణములలో ప్రవేశించినను బంధింప బడక నుందురు. వారే ముక్తజీవులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 251 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Cinmayī चिन्मयी (251) 🌻
She is in the form pure consciousness. Cin here means cit. Pure consciousness is that stage of awareness, where there is no differentiation between the known, the knower and the knowledge. The absence of this triad while realising the Brahman, is pure cit (also chit) or consciousness. Please refer nāma 254 also.
{Further reading on consciousness: Consciousness can be explained as an alert cognitive state in which one is aware of himself and his situation. Brahman is pure consciousness known as cit. When cit becomes reflected as cosmic conscience in the form of God, it does not lose its omniscience and omnipotence. When cit is reflected as individual conscience, it degenerates from absolute consciousness to limited individual consciousness. This is known as citta (individual conscience) and is different from cit.
The cosmic conscience, the Brahman initiates macrocosmic manifestation of prakṛti while the individual conscience initiates the microcosmic manifestation. Both cit and citta set in evolutionary forces into motion. There are different levels of consciousness, the lowest being the stage of action and the highest being turya and finally turyātīta.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment