శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 256 / Sri Lalitha Chaitanya Vijnanam - 256


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 256 / Sri Lalitha Chaitanya Vijnanam - 256 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀

🌻 256. 'విశ్వరూపా'🌻

విశ్వము యొక్క రూపము కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత రూపమే విశ్వము. ఈ రూపము స్థూలము, సూక్ష్మము కూడ. ఆమె నుండి వెలువడు వెలుగునుండి సూక్ష్మము స్థూలముగ రూప మేర్పడును. విశ్వరూపము ఆమె రూపము కంటె వేరు కాదు.

రూపములు వచ్చి పోవుచుండును. వానికి వృద్ధి ఉన్నది. క్షయ మున్నది. ఇన్ని రూపములు వచ్చి పోవుటకు మూలమగు శ్రీమాత రూపము కల్పాంతము వఱకు వృద్ధి క్షయములు లేనిది. ఈ రూపము 16 కళలు కలిగి యుండుటచే శ్రీమాతను షోడశి అని కూడ కీర్తింతురు. ఇది శ్రీమాత సచ్చిదానంద రూపము. ఈ పదహారు కళలు గల సచ్చిదానంద రూపమును 'సాదా' అని పిలుతురు.

ఈ సాదా రూపమును చూచుటకే యోగులు, సిద్ధులు, ఋషులు, భక్తులు తపన చెందు చుందురు. గురు ముఖమున శ్రీ విద్యను గ్రహించి ఉపాసన చేయుచు తదనుగుణమైన దీక్షను వహించు వారికి ఈ రూప దర్శనము జరుగ గలదు. ఈ సచ్చిదానంద రూపమునే సృష్టి యందు దైవ మందురు. ఈ రూపము స్త్రీ రూపము కాదు. పురుష రూపము కాదు. స్త్రీ రూపముగ చూచువారికి స్త్రీ రూపముగ గోచరించును. పురుష రూపముగ ధ్యానించు వారికి పురుష రూపముగ గోచరించును.

లింగ భేదము లేని రూప మిది. శ్రీ మహావిష్ణువు, శ్రీ లలిత, శ్రీకృష్ణుడు అనుచు భక్తులారాధించు రూపమిదియే. విశ్వరూప అని శ్రీమాతను, విశ్వరూపుడని శ్రీమహావిష్ణువును సంబోధింతురు. లింగభేదము సృష్టి అవరోహణ క్రమములో నాలుగవ స్థితియందు కలుగుచున్నది. అంతకు ముందు స్థితులలో లింగభేదము లేదు. ఉన్నతమైన యోగీశ్వరులు స్త్రీ పురుష భావములను సమన్వయించుకొని యుందురు. అట్టివారి రూపములు స్త్రీలకు పురుషునివలె ఆకర్షణీయముగ నుండును. అట్లే పురుషులకు స్త్రీ రూపమువలె ఆకర్షణీయముగ నుండును. భూమిపై అట్టి రూపముతో సంచరించిన వాడు శ్రీకృష్ణుడు, జగద్గురు వగు మైత్రేయ మహర్షి కూడ శ్రీకృష్ణానుగ్రహమున ఇట్టి రూపమునే ధరించి యున్నాడు.

శ్రీమాత విశ్వరూపమును ధ్యానించు విధానమే విష్ణూపాసన మందురు. స్థూల సూక్ష్మ సకల సృష్టి రూపములను శ్రీదేవి రూపములుగ భావించుట ఈ ఉపాసనా మార్గము. జీవులు కూడ స్వయముగ వెలుగు రూపము గలవారే. వారికిని వారి వెలుగు రూపము నుండి స్థూల రూపము లేర్పడు చుండును. స్థూల రూపములు క్షరములు. అవి వచ్చి పోవుచుండును. వెలుగు రూపము కల్పాంతము వరకు శాశ్వతము. జీవుల అస్తిత్వము సత్ చిత్ ల అస్తిత్వమే గనుక వారి దివ్య రూపమును వారియందు అంగుష్ఠమాత్ర రూపమున దర్శించుట కూడ యోగవిద్య యందు ఉపదేశించబడినది. ఈ మార్గమున దైవమును చేరు విధాన ముండును. ఈ కారణముగనే రూప ధ్యానము గూడ విశిష్ట మార్గముగ తెలుపబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 256 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Viśvarūpā विश्वरूपा (256) 🌻


Beginning from this nāma, next 19 nāma-s till 274 talk about the difference between the soul and the Brahman.

Viśvarūpā means omnipresent. This nāma discusses the manifold nature of the Brahman. The omnipresence is the unique nature of the Brahman. The creation of the universe was discussed in nāma 250. The Brahman has different forms and shapes as the Brahman exists in every living and non-living being in this universe. In the case of non-living beings, they do not have souls and hence no action takes place on their own. There is no place in the universe, where the Brahman does not exist.

The creation takes place first in the form of total darkness. From this darkness intellect arises. From intellect the ego and this ego gives rise to the modifications of the five elements which ultimately creates lives in this universe. This universe is manifested through three different factors viz. gross, subtle and casual which give rise to vaiśvānarā, hiraṇyagarbha and Īśvarā. These three exist in three stages of a human life awake, dream and deep sleep.

Scriptures accept only creation, sustenance, and destruction. But tantra śāstrās talk about additional two acts of the Brahman tirodhāna and anugraha (details of these two acts are discussed in nāma-s 270 and 273. For basic information, please refer nāma-s 249 and 250) corresponding to additional two stages viz. turya and turyātīta. Turya is the transcendental stage. The consciousness transcending the turya stage becomes devoid of duality. In the next and the ultimate stage the consciousness further gets purified and merges into the Supreme Self.

This state of consciousness is called turyātīta. The union of soul with the Brahman takes place here and finally gets bonded in kaivalya, the ultimate state. The journey of the soul stops here and it ceases to exist. One has to take efforts to have such a union and it does not happen automatically like the first three stages of sleep, dream and deep sleep. The vaiśvānarā, hiraṇyagarbha, and Īśvarā are the three Gods, Brahma, Viṣṇu and Rudra. They are popularly known as the lords of creation, sustenance and contraction.

Generally, one is aware of the first two stages viz. awake and dream stages. In the third stage of deep sleep none is aware of what is happening around, the stage of unconsciousness. A yogi can reach the other two stages, as he knows consciously that he is Śiva himself. Śiva Sūtra (III.25) says, “Śiva-tulyo jāyate”, which means ‘that yogi becomes like Śiva.’

When his consciousness realizes the Brahman, the effects of his karmas wither from him and he reaches a stage where there is neither happiness nor sorrow. When the mind ceases to think or when the mind disassociates from the sensory organs such a stage is attained. Only in this stage, Viśvarūpa is realized. She is the Viśvarūpa, the omnipresent.

In Bhagavad Gīta (XI.16), Arjuna addresses Kṛṣṇa, “Oh! Lord of the universe, I see you endowed with numerous arms, bellies, mouths and eyes and having innumerable forms extended on all sides. I see neither your beginning, nor middle and nor even your end, manifested as you are in the form of universe.” Viśvarūpā is used here to mean Kṛṣṇa’s manifestation in the form of whole universe.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 Apr 2021

No comments:

Post a Comment