వివేక చూడామణి - 65 / Viveka Chudamani - 65
🌹. వివేక చూడామణి - 65 / Viveka Chudamani - 65 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 19. బ్రహ్మము - 5 🍀
232. ఈ విశ్వము మొత్తము బ్రహ్మముతో నిండి, దీని ప్రభావము వలన ప్రపంచమేర్పడి, వేరుగా పల్కుట వలన పరమాత్మ యొక్క ఉనికి అసత్యమని చెప్పబడుచున్నది. ఇది సరైన నిర్ణయము కాదని జ్ఞానులకు తెలుసు.
233. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ రహస్యమును తెలిసినవాడగుటచే ఇట్లు పలికెను ‘’నేను ఈ ప్రపంచములో లేను, ఈ ప్రపంచము నాలో లేదు’’.
234. ఈ విశ్వము నిజమైనట్లైయిన దానిని గాఢ నిద్రలో కూడా తెలుసుకొనగలము. అలా తెలుసుకొన లేక పోయిన అది కలల వలె నిజము కాదని భావము.
235. అందువలన ఈ విశ్వము పరమాత్మ లేనిచో లేనిదే అవుతుంది. ఈ ప్రపంచము యొక్క ప్రత్యేక ఉనికి నిజము కాదు. ఆకాశము నీలమని చెప్పుచుండుట నిజము కాదు. నిజానికి దానికి ఏ రంగు లేదు. ఈ విధమైన భ్రమలతో కూడిన నిర్ణయాలకు ఏ విధమైన అర్థము లేదు. ఇది తాడును చూసి పామని భ్రమించినట్టిది. మాయ వలన అలా అనిపిస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 65 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 19. Brahman - 5 🌻
232. If the universe, as it is, be real, there would be no cessation of the dualistic element, the scriptures would be falsified, and the Lord Himself would be guilty of an untruth. None of these three is considered either desirable or wholesome by the nobleminded.
233. The Lord, who knows the secret of all things has supported this view in the words: "But I am not in them"… "nor are the beings in Me".
234. If the universe be true, let it then be perceived in the state of deep sleep also. As it is not at all perceived, it must be unreal and false, like dreams.
235. Therefore the universe does not exist apart from the Supreme Self; and the perception of its separateness is false like the qualities (of blueness etc., in the sky). Has a superimposed attribute any meaning apart from its substratum ? It is the substratum which appears like that through delusion.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
23 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment