దేవాపి మహర్షి బోధనలు - 76
🌹. దేవాపి మహర్షి బోధనలు - 76 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 57. మా కొలబద్ద 🌻
సాధకులను అంతేవాసులుగ ఎన్నుకొనుటకు మా వద్ద ఒక కొలబద్ద ఉన్నది. మీరు మీ దైనందిన జీవితమున చిన్న చిన్న విషయముల యందు, చిల్లర విషయములయందు అసత్యమాడుదురా? ఆడరా? అనునది ఈ కొలబద్ద.
అవసరము లేకున్న కూడ అబద్ధము లాడుట మీ యందు మేము తరచు గమనించు చుందుము. ఈ యలవాటు అపాయకరమైనది. ఈ యలవాటుగల సాధకునకు త్రికరణ శుద్ధి అనునది అసాధ్యము. ఎన్ని మంచి గుణము లున్నను, ఎంత సమర్థతయున్నను దీనివలన సమస్తము భ్రష్టము చెందును.
అసత్యభాషణము సత్యదర్శనమునకు పూర్తిగ వ్యతిరేకము. దివ్యలోకము లన్నియు సత్య మాధారముగ నిలబడియున్నవి. భాషణమున సత్యము లేనివాడు దివ్యలోకముల కెట్లు ఎగబ్రాకగలడు? మిమ్ముల నంతేవాసులుగ అంగీకరించుటకు మీ యందు గల ఈ స్వభావము గోడవలె అంతరాయము కలిగించుచున్నది.
ఈ కంచుగోడను మీరే నిర్మూలించు కొనవలెను. విషయము చిన్నదే యైనను, దాని వలన కలుగు అపాయము చాల పెద్దది. చిన్న అగ్గిపుల్ల కారణముగ వందలకొద్ది ఇండ్లు దగ్ధము కాగలవు. ఈ విషయమున కొంత శ్రద్ధ వహింపుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment