2) 🌹. శివ మహా పురాణము - 391🌹
3) 🌹 Light On The Path - 138🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -19🌹
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 213🌹
6) 🌹 Osho Daily Meditations - 8 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 68 / Lalitha Sahasra Namavali - 68🌹
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasranama - 68🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -191 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 32
*🍀 32. సమదర్శనము - ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలెనే ఆత్మలుగ భావించుచు, వారి యందలి ఆత్మను దర్శించుచు, వారి సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగ సమవేదన చెందువాడు యోగులలో శ్రేష్ఠుడని నా మతము. జీవరాసు లన్నిటికిని మూల మాత్మయే. స్వభావ వైవిధ్యము జీవుల పరిపక్వతను బట్టి ఏర్పడినది. పరిపక్వత యందలి భేదము వలన జీవుల యందు సుఖదుఃఖము లేర్పడును. ఇట్టి విధముగ జీవుల స్వభావ భేదమును బట్టి వారి వారికి కలుగు సుఖదుఃఖములను, పక్వత చెందిన ఆత్మయోగి జీవుల యందు సానుభూతి కలిగి యుండును. వారి దుఃఖములను తన దుఃఖములుగ సహవేదన అనుభవించును. ఈ ఆశయము సిద్ధించు వరకు యోగసాధన సాగుచునే యుండ వలెను.🍀*
ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వాయది వాదుఃఖం సయోగీ పరమో మతః || 32
ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలెనే ఆత్మలుగ భావించుచు, వారి యందలి ఆత్మను దర్శించుచు, వారి సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగ సమవేదన చెందువాడు యోగులలో శ్రేష్ఠుడని నా మతము. జీవరాసు లన్నిటికిని మూల మాత్మయే. ఆత్మ కేంద్రముగ త్రిగుణములు, పంచభూతములు రూపముగ నేర్పడి, రూప కదలికకు ప్రాణము లేర్పడును.
అందరి యందున్నది ఆత్మయే. అందరి రూపములు త్రిగుణములు మరియు పంచభూతముల సమ్మేళ నమే. అందరియందు కదలిక కలిగించునది ప్రాణమే. అందరి యందలి చైతన్యము కూడ విశ్వచైతన్యమే. జీవుల వైవిధ్యము మరి ఎచ్చటి నుండి ఏర్పడినది? వారి వారి స్వభావమును బట్టి ఏర్పడినది. స్వభావ వైవిధ్యమును బట్టియే గుణ సమ్మేళనము నందు, పంచభూతముల సమ్మేళనము నందు వైవిధ్య మేర్పడినది. తత్కారణముగనే ప్రాణగతుల వైవిధ్య మేర్పడినది.
స్వభావ వైవిధ్యము జీవుల పరిపక్వతను బట్టి ఏర్పడినది. పచ్చికాయ వగరుగ నుండగ, పండు తీయగ, రుచిగ నుండును. పరిపక్వత యందలి భేదము వలన జీవుల యందు సుఖదుఃఖము లేర్పడును. ఇట్టి విధముగ జీవుల స్వభావ భేదమును బట్టి వారి వారికి కలుగు సుఖదుఃఖములను, పక్వత చెందిన ఆత్మయోగి జీవుల యందు సానుభూతి కలిగి యుండును. వారి దుఃఖములను తన దుఃఖములుగ సహవేదన మనుభవించును.
దానికి కారణము, ఇరువురి యందలి మూలము ఆత్మయే కదా! నిజమగు యోగులు ఇతరుల దుఃఖమునకు సంతసించరు. తటస్థముగ గూడ నుండరు. వారియందు సానుభూతి కలిగి తగు విధముగ హితము గావింతురు. ఇట్టి కారుణ్యము గలవారే ఆత్మ యోగమున నుండగలరు. వారే నిజమగు భక్తులు కూడ. కేవలము వాత్సల్యము చూపువారు కపటులు.
ఇట్టి కారుణ్య భావము సోదరత్వము అని పిలువబడును. సోదరుల పైనే కరుణ లేనివాడు ఆత్మ సోదరత్వమెట్లు సాధించ గలడు. ఈ శ్లోకమున “సర్వత్ర సమం పశ్యతి" అని భగవానుడు పలికినాడు. సర్వత్ర అను పదము సమస్తమగు ప్రాణులను సమముగ దర్శించుట అని అర్థమిచ్చును. ఆత్మ దర్శనమే సమదర్శనమని తెలియవలెను.
దేశ కాల మత జాతి భేదముల నధిగమించి ఆత్మను దర్శించువాడే యోగి గాని, ఇతరులెట్లు యోగులు కాగలరు! ఆత్మ దర్శనునకు సర్వము తానుగనే దర్శన మగుచుండును. కనుక వారి బాగోగులు తనకు సహవేదన కలిగించుట సహజము. అట్టి సహజ స్థితి యందున్న వాడు యోగులలో శ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు తన అభిప్రాయమును వెల్లడించి నాడు. ఈ ఆశయము సిద్ధించు వరకు యోగసాధన సాగుచునే యుండ వలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 391🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 17
*🌻. ఇంద్ర మన్మథ సంవాదము - 2 🌻*
మన్మథుడు ఇంద్రుని ఈ పలుకులను విని, చిరునవ్వుతో మరియు ప్రేమతో గంభీరముగా నిట్లు పలికెను (16).
మన్మథుడిట్లు పలికెను-
నీవు ఇట్లు ఏల పలుకుచుంటివి? నేను నీకు సమాధానమునీయను. ఉపకారమును చేయు మిత్రుని, కృత్రిమ మిత్రుని లోకమునందు పరిశీలించెదరే గాని, వారి గురించి మాటలాడరు (17). కష్టము కలిగినప్పుడు అధికముగా మాటలాడు వాడు కార్యమునేమి చేయగలడు? మహారాజా! ప్రభూ! అయిననూ చెప్పెదను. వినుము (18). నీ పదవిని లాగుకొనుటకై ఎవరైననూ ఘోరపతపస్సును చేయుచున్నాడా యేమి? ఓ మిత్రమా! అట్టి నీ శత్రువును నిశ్చితముగా పడకొట్టగలను (19). ఒక సుందరి యొక్క వాలు చూపుతో దేవతలను గాని, ఋషులు రాక్షసులు మొదలగు వారిని గాని, క్షణములో భ్రష్టులను చేయగలను. మానవులు నాకు లెక్క కాదు (20).
వజ్రము, ఇతర అనేక ఆయుధములు దూరములో నుండుగాక! మిత్రుడనగు నేను వచ్చిన తరువాత అవి దేనికి పనికి రాగలవు? (21) బ్రహ్మను గాని, విష్ణువును గాని నేను నిస్సంశయముగా భ్రష్టుని చేయగలను. ఇతరుల లెక్కలేదు. నేను శివునియైనను పడగొట్టగలను (22). నాకు అయిదు బాణములు మాత్రమే గలవు. అవి పుష్పములచే చేయబడినవి. మృదువైనవి. నా ధనస్సు పుష్పములచే నిర్మింపబడి మూడు భాగములుగా నున్నది. నారిత్రాడును తుమ్మెదలు సమగూర్చును (23). నాకు మిత్రుడు, మంత్రియగు వసంతుడే నా సైన్యము. అయిదు బాణములే నా బలము. హే దేవా! చంద్రుడు నాకు మిత్రుడు (24).
శృంగారము నాకు సేనాధ్యక్షుడు. హావ భావములే నా సైనికులు. ఇంద్రా! నా బాణములన్నియూ మృదవైనవి. నేను గూడ అట్టివాడనే (25). ఏ కార్యము దేనిచే పూర్తియగునో, బుద్ధిమంతుడు ఆ కార్యమును ఆ సాధనముతో పూర్తి చేయవలెను. నాకు ఏ కార్యము ఉచితమో, దానియందు నన్ను సంపూర్ణముగా నియోగించుము (26).
బ్రహ్మ ఇట్లు పలికెను-
వాని ఈ మాటలను విని ఇంద్రుడు మిక్కిలి ఆనందించి, నమస్కరించి, ప్రేమికులకు సుఖమునిచ్చు మన్మథునితో నిట్లు పలికెను (27).
ఇంద్రుడిట్లు పలికెను-
వత్సా! మన్మథా! నేను నామనస్సులో తలపెట్టిన కార్యమును చేయుటకు నీవే సమర్థుడవై ఉన్నావు. నీవు గాక మరియొకరి వలన ఈ పని సంభవము గాదు (28). మన్మథా! మిత్రశ్రేష్ఠమా! ఈనాడు నిన్ను చూడవలెననే కోరిక కలుగుటకు గల వాస్తవ కారణమును చెప్పెదను. వినుము (29). తారకుడనే మహారాక్షసుడు బ్రహ్మ నుండి అద్భుతమగు వరమును పొంది, అందరికీ దుఃఖమును కలిగించుచున్నాడు. ఆతనిని జయించగలవారు లేరు (30). ఆతడు లోకములను పీడించుచున్నాడు. ధర్మములన్నియూ అనేక విధములుగా భ్రష్టమైనవి. దేవతలు, ఋషులు, ఇతరులు అందరు దుఃఖితులై ఉన్నారు (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 138 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 5 🌻*
*🍁 527. Know, O disciple, that those who have passed through the silence, and felt its peace and retained its strength, they long that you shall pass through it also. 🍁*
528. Certainly they do, because those who have unfolded the faculties of the soul know the whole system, and see it all in action before them, and because they see it, they yearn that every one shall see it.
They realize that part of that plan is that we should all help. Therefore they desire that every one as soon as possible should be brought to see that his duty is to assist, that that is the real work of the world.
We all have subsidiary work to do; we have our part to play on the stage of the physical world, and we must play that part as well, as nobly, as we can; it does not matter what it is, it matters only that we should play it well. But we must remember that behind that is the real soul-life, and that is the thing of greatest importance.
529. We live in an atmosphere where the means is taken for the end. Most of our education is built on that plan. For example, people are taught geometry and mathematics, but are never shown that these lead to a comprehension of how the great Architect has constructed His universe. So long as we take them as ends in themselves they lead nowhere in particular; but if we follow them up as did the ancients who invented them, we shall find they are of great use.
Pythagoras taught the value of numbers and of geometry, but he taught it to the physikoi, that is, to those who were learning the secrets of life. They learnt them in order to comprehend life better, and it is from that point of view that we should study all things, not merely to make material and commercial calculations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 19 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భయము ఒక మానసిక బలహీనత 🌻*
ప్రస్తుత మానవుని మానసిక బలహీనతలో భయమొకటి. పశుపక్ష్యాదులకును భయము కలదు. కాని తమను తాము కాపాడుకొను అంశము వరకే వాని భయము పరిమితము.
పశువుల నుండి పరిణమించిన నరుడు పశుప్రవృత్తియగు భయము కలిగియుండుటలో ఆశ్చర్యము లేదు. కాని పశువులలో కన్నా నరుని భయము విస్తరించినది.
ఆధునిక మానవుని మనస్సు అత్యధికమైన వేగముతో పనిచేయుట వలన ఇట్లు జరుగుచున్నది. మానవునిలో ఆవేశములు, ఉద్వేగములు బలముగా ఉన్నప్పుడు భయము పెరుగును. గతమును గూర్చిన అతని గుర్తులు, భవిష్యత్తును గూర్చిన ఊహపోహలు అతనిని భయకంపితుని చేయుచున్నవి.
తనకు సన్నిహితులనబడువారికి సంబంధించిన విషాద సమాచారము కూడ ఈ రోజులలో వేగముగా ప్రసారము చేయబడుటతో భయము పెరుగుచున్నది.
భయగ్రస్తుడు కానివాడెవడు? జంతుమానవుడు ప్రకృతి శక్తులను, చీకటిని, తెలియనివానిని గూర్చి భయపడును.
నాగరిక మానవుడు సన్నిహితుల వియోగము, ఆరోగ్యము, ధనము, పలుకుబడి వీని విషయమున భయపడును.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 8 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 NON JUDGMENT 🍀*
*🕉 When you judge, division starts 🕉*
You may be talking in deep conversation with a friend when suddenly you feel like being silent. You want to stop talking, right in the middle of the sentence. So stop right there, and don't even complete the rest of the sentence, because that will be going against nature. But then judgment comes in. You feel embarrassed about what others will think if you suddenly stop talking in the middle of asentence.
If you suddenly become silent they will not understand, so you somehow manage to complete the sentence. You pretend to show interest, and then you finally escape. That is very costly, and there is no need to do it. Just say that conversation is not coming to you now. You can ask to be excused, and be silent.
For a few days perhaps it will be a little troublesome, but by and by people will begin to understand. Don't judge yourself about why you became silent; don't tell yourself that it is not good. Everything is good! In deep acceptance, everything becomes a blessing.
This is how it happened--your whole being wanted to be silent. So follow it. Just become a shadow to your totality, and wherever it goes you have to follow because there is no other goal. You will begin to feel a tremendous relaxation surrounding you.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 68 / Sri Lalita Sahasranamavali - Meaning - 68 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. 68. శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।*
*సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥ 🍀*
🍀 289. శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా -
వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
🍀 290. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా -
అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 68 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 68. śruti-sīmanta-sindūrī-kṛta-pādābja-dhūlikā |*
*sakalāgama-sandoha-śukti-sampuṭa-mauktikā || 68 || 🌻*
🌻 289 ) Sruthi seemantha kula sindhoori kritha padabjha dhooliga -
She whose dust from her lotus feet is the sindhoora fills up in the parting of the hair of the Vedic mother
🌻 290 ) Sakalagama sandoha shukthi samputa maukthika -
She who is like the pearl in the pearl holding shell of Vedas
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 68 / Sri Vishnu Sahasra Namavali - 68 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*అనూరాధ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🌻 68. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |*
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ‖ 68 ‖ 🌻*
🍀 633) అర్చిష్మాన్ -
తేజోరూపుడు.
🍀 634) అర్చిత: -
సమస్త లోకములచే పూజింపబడువాడు.
🍀 635) కుంభ: -
సర్వము తనయందుండువాడు.
🍀 636) విశుద్ధాత్మా -
పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.
🍀 637) విశోధనః -
తనను స్మరించు వారి పాపములను నశింప చేయువాడు
🍀 638) అనిరుద్ధః -
శత్రువులచే అడ్డగింపబడనివాడు.
🍀 639) అప్రతిరథ: -
తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.
🍀 640) ప్రద్యుమ్న: -
విశేష ధనము కలవాడు.
🍀 641) అమిత విక్రమ: -
విశేష పరాక్రమము గలవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 68 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Anuradha 4th Padam*
*🌻 68. arciṣmānarcitaḥ kuṁbhō viśuddhātmā viśōdhanaḥ |*
*aniruddhōpratirathaḥ pradyumnōmitavikramaḥ || 68 || 🌻*
🌻 633. Arciṣmān:
He by whose rays of light (Archish), the sun, the moon and other bodies are endowed with rays of light.
🌻 634. Arcitaḥ:
One who is worshipped by Brahma and other Devas who are themselves the objects of worship in all the worlds.
🌻 635. Kumbhaḥ:
He who contains in Himself every thing as in a pot.
🌻 636. Viśuddhātmā:
Being above the three Gunas, Satva, Rajas and Tamas, the Lord is pure spirit and is also free from all impurities.
🌻 637. Viśōdhanaḥ:
One who destroys all sins by mere remembrance.
🌻 638. Aniruddhaḥ:
The last one of the four Vyuhas - Vasudeva, Samkarshana, Pradyumna and Aniruddhaḥ. Or one who, cannot be obstructed by enemies.
🌻 639. Aprati-rathaḥ:
One who has no Pratiratha or an equal antagonist to confront.
🌻 640. Pradyumnaḥ:
One whose Dyumna or wealth is of a superior and sacred order. Or one of the four Vyuhas.
🌻 641. Amitavikramaḥ:
One of unlimited prowess. Or one whose prowess cannot be obstructed by any one.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment