🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 378 / Vishnu Sahasranama Contemplation - 378🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻378. కరణమ్, करणम्, Karaṇam🌻
ఓం కరణాయ నమః | ॐ करणाय नमः | OM Karaṇāya namaḥ
కరణం జగదుత్పత్తౌ యత్సాధకతమం స్మృతమ్ ।
తద్బ్రహ్మ కరణం ప్రోక్తం వేదవిద్యావిశారదైః ॥
సాధకతమమగుదానిని అనగా కార్య సాధకములగువానిలో అతి ప్రధానమగుదానిని 'కారణమ్' అందురు. ఈ విష్ణు పరమాత్మ జగదుద్పత్తి విషయమున 'సాధకతమ' తత్త్వము గదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 378🌹
📚. Prasad Bharadwaj
🌻 378. Karaṇam 🌻
OM Karaṇāya namaḥ
करणं जगदुत्पत्तौ यत्साधकतमं स्मृतम् ।
तद्ब्रह्म करणं प्रोक्तं वेदविद्याविशारदैः ॥
Karaṇaṃ jagadutpattau yatsādhakatamaṃ smr̥tam,
Tadbrahma karaṇaṃ proktaṃ vedavidyāviśāradaiḥ.
The most extraordinary cause for the origination of the world. Since Lord Viṣṇu is the most important factor in the generation of this universe, He is Karaṇam.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 379 / Vishnu Sahasranama Contemplation - 379🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 379. కారణమ్, कारणम्, Kāraṇam 🌻
ఓం కారణాయ నమః | ॐ कारणाय नमः | OM Kāraṇāya namaḥ
కారణమ్, कारणम्, Kāraṇam
ఉపాదానం నిమిత్తం చ జగతః కారణమ్ స్మృతమ్ ।
తదేవేతి మహద్బ్రహ్మ కారణం పరికీర్త్యతే ॥
లోగడ చెప్పినట్లు జగదుద్పత్తికి ఉపాదాన కారణమును, నిమిత్త కారణమును పరమాత్ముడే గనుక 'కారణమ్'
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ.ఆద్యంతశూన్యంబు నవ్యయంబై తగు తత్త్వ మింతకు నుపాదాన మగుటగుణవిషయములు గైకొని కాలమును మహదాది భూతములు ద న్నాశ్రయింపగాలానురూపంబుఁ గైకొని యీశుండు దన లీలకై తనుఁ దా సృజించెఁగరమొప్ప నఖిలలోకములందుఁ దా నుండుఁ దనలోన నఖిలంబుఁ దనరుచుండుఁతే.గాన విశ్వమ్మునకుఁ గార్యకారణములు దాన; య మ్మహాపురుషుని తనువు వలనఁబాసి విశ్వంబై వెలియై ప్రభాస మొందె, మానితాచార! యీ వర్తమాన సృష్టి. (342)
మొదలు తుద లేనిది, తరిగిపోనిదీ ఐన తత్త్వమే ఈ సృష్టికంతటికీ ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థాలూ, మహత్తూ, పంచభూతాలు తన్ను ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించినవాడై వినోదానికై తనను తాను సృష్టించుకొన్నాడు. ఈ విధంగా సృష్టించిన సమస్తలోకాలందూ ఈశ్వరుడుంటాడు. ఆ యీశ్వరునియందు సమస్త లోకాలూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యమూ, కారణమూ రెండూ తానే. ఆ పరమపురుషుని శరీరం నుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుతున్నది. ఈ విధంగా వర్తమాన సృష్టి ఏర్పడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 379🌹
📚. Prasad Bharadwaj
🌻379. Kāraṇam🌻
OM Kāraṇāya namaḥ
Upādānaṃ nimittaṃ ca jagataḥ kāraṇam smr̥tam,
Tadeveti mahadbrahma kāraṇaṃ parikīrtyate.
उपादानं निमित्तं च जगतः कारणम् स्मृतम् ।
तदेवेति महद्ब्रह्म कारणं परिकीर्त्यते ॥
Since He is both the material and the instrumental cause, He is Kāraṇam.
Śrīmad Bhāgavata - Canto 3, Chapter 11
Tadāhurakṣaraṃ brahma sarvakāraṇakāraṇam,
Viṣṇordhāma paraṃ sākṣātpuruṣasya mahātmanaḥ. 41.
:: श्रीमद्भागवते तृतीयस्कन्धे एकादशोऽध्यायः ::
तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणम् ।
विष्णोर्धाम परं साक्षात्पुरुषस्य महात्मनः ॥ ४१ ॥
The Supreme Brahma, is therefore said to be the original cause of all causes. Thus the spiritual abode of Viṣṇu is eternal without a doubt, and it is also the abode of Mahā-Viṣṇu, the origin of all manifestations.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
26 Apr 2021
No comments:
Post a Comment