దేవాపి మహర్షి బోధనలు - 77


🌹. దేవాపి మహర్షి బోధనలు - 77 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 58. శంబళ 🌻


శంబళ మానవజాతికి శాంతి, దాంతి, ఆనందము కలిగించును. శంబళ దైవమునకు మార్గము. శంబళ సత్యాన్వేషకులకు ధృవతారం కొందరికి శంబళ సత్యము. కొందరికి శంబళ కల్పితము. మరికొందరికి శంబళ జీవితాశయము. ఇంకొందరికి శంబళ సర్వ సంపద ప్రదాత.

శంబళ భూమి ప్రజ్ఞ, దేహమునకు జీవుడెట్లో భూమికి శంబళ అట్లే. జీవునకెట్లు ఒక నామమున్నదో శంబళ ప్రజ్ఞకు కూడ నామము కలదు. ఆ నామమే సర్వపూజ్యమైన సనత్కుమార నామము. అతని నుండియే భూమికి ప్రాణము, తెలివి ప్రసార మగుచున్నవి.

అతని హృదయము ఒక అద్భుతమైన రజత పద్మము. అతని హృదయమే ఆదిత్య హృదయము కూడ, ఆదిత్యుని హృదయమునందు ఏ ప్రజ్ఞ వసించు చున్నదో అదియే సనత్కుమారుని హృదయమున గూడ వసించి యున్నది. సప్తకిరణముల ప్రజ్ఞను సప్తగ్రహముల ద్వారా తా నందుకొనుచు సనత్కుమారుడు భూమికందించుచున్నాడు.

దేహము యొక్క అస్థిత్వమునకు జీవాత్మ ఎట్లు సత్యమో, భూమి భూమిజీవుల అస్థిత్వమునకు సనత్కుమారుడట్టి సత్యము. భూమిపై జీవుల పరిణామమునకు, పరిణితికి, పరిపూర్ణతకు సనత్కుమారుడే అధిపతి. నిజమునకు అతడు పరిపూర్ణ అగ్ని స్వరూపుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2021

No comments:

Post a Comment