వివేక చూడామణి - 66 / Viveka Chudamani - 66


🌹. వివేక చూడామణి - 66 / Viveka Chudamani - 66 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 6 🍀


236. మాయకు లోనైన వ్యక్తి పొరపాటున బ్రహ్మమును బ్రహ్మమని భ్రమించిన అది బ్రహ్మమే అవుతుంది. వెండి ముత్యపు చిప్ప రంగునే కలిగి ఉంటుంది. అది బ్రహ్మమును విశ్వముగా భావించుట వంటిది. విశ్వమనేది కేవలము పేరు మాత్రమే.

237, 238. ఏది ఏవిధముగా పలికినప్పటికి ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము.

మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 66 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj


🌻 19. Brahman - 6 🌻

236. Whatever a deluded man perceives through mistake, is Brahman and Brahman alone: The silver is nothing but the mother-of-pearl. It is Brahman which is always considered as this universe, whereas that which is superimposed on the Brahman, viz. the universe, is merely a name.

237-238. Hence whatever is manifested, viz. this universe, is the Supreme Brahman Itself, the Real, the One without a second, pure, the Essence of Knowledge, taintless, serene, devoid of beginning and end, beyond activity, the Essence of Bliss Absolute –

Transcending all the diversities created by Maya or Nescience, eternal, ever beyond the reach of pain, indivisible, immeasurable, formless, undifferentiated, nameless, immutable, self-luminous.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2021

No comments:

Post a Comment