నిర్మల ధ్యానాలు - ఓషో - 9


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 9 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహంకారం ఆవిరి కావడమే సంపూర్ణమైన సమర్పణ 🍀


సంపూర్ణ సమర్పణ వున్నపుడే అస్తిత్వంతో మనకు ఒప్పందం కుదురుతుంది. అంతకు మించి మరో మార్గం లేదు. నీళ్ళు నూరు డిగ్రీల వేడికి ఆవిరయినట్లు మన అహంకారం ఆవిరి కావడమే సంపూర్ణమైన సమర్పణ.

ఎప్పుడు నువ్వు కేవలం శూన్యంగా వుంటావో అప్పుడు లోపల ఎవరూ వుండరు అది గొప్ప నిశ్శబ్దం, గొప్ప శాశ్వతత్వం. సరిహద్దులు లేనితనం, ఐతే అక్కడ ఎవరూ లేరు. సమస్త ఆకాశం నీలోకి ప్రవేశించే సందర్భమది.

అది భూమ్యాకాశాల కలయిక. అక్కడ నువ్వు అశాశ్వతత్వం నించీ శాశ్వతమైన ఆత్మగా పరివర్తన చెందుతావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2021

No comments:

Post a Comment