మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 19


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 19 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భయము ఒక మానసిక బలహీనత 🌻


ప్రస్తుత మానవుని మానసిక బలహీనతలో భయమొకటి. పశుపక్ష్యాదులకును భయము కలదు. కాని తమను తాము కాపాడుకొను‌ అంశము వరకే వాని భయము పరిమితము.

పశువుల నుండి పరిణమించిన నరుడు పశుప్రవృత్తియగు భయము కలిగియుండుటలో ఆశ్చర్యము‌ లేదు. కాని పశువులలో కన్నా నరుని భయము విస్తరించినది.

ఆధునిక మానవుని మనస్సు అత్యధికమైన వేగముతో పనిచేయుట వలన ఇట్లు జరుగుచున్నది. మానవునిలో ఆవేశములు, ఉద్వేగములు బలముగా ఉన్నప్పుడు భయము పెరుగును. గతమును గూర్చిన అతని గుర్తులు, భవిష్యత్తును గూర్చిన ఊహపోహలు అతనిని భయకంపితుని చేయుచున్నవి.

తనకు సన్నిహితులనబడువారికి సంబంధించిన విషాద సమాచారము కూడ ఈ రోజులలో వేగముగా ప్రసారము చేయబడుటతో భయము పెరుగుచున్నది.

భయగ్రస్తుడు కానివాడెవడు? జంతుమానవుడు ప్రకృతి శక్తులను, చీకటిని, తెలియనివానిని గూర్చి భయపడును.

నాగరిక మానవుడు సన్నిహితుల వియోగము, ఆరోగ్యము, ధనము, పలుకుబడి వీని విషయమున భయపడును.

🌹 🌹 🌹 🌹 🌹


28 Apr 2021

No comments:

Post a Comment