శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 277 / Sri Lalitha Chaitanya Vijnanam - 277
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 277 / Sri Lalitha Chaitanya Vijnanam - 277 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀
🌻 277. 'భగమాలినీ' 🌻
భగములు మాలికగ ఏర్పరచి ధరించునది శ్రీదేవి అని అర్థము.
'భ' అనగా వెలుగు. 'గ' అనగా గతి, వ్యాపకశక్తి. శ్రీదేవి తన వెలుగును వ్యాప్తి చేయుటకు, బిందువుగ నున్న తాను త్రికోణముగ ఏర్పడును. భగ శబ్దమునకు మూలార్థమిది. భగవంతుడు, భగవతి, అని శివ పరముగను, శ్రీ పరముగను, వ్యాపించుచు అవతరించుచు అంతర్యామియై చరించుచు నున్న తత్త్వమును భగవత్ తత్త్వమందురు. దీనిని గూర్చి తెలుపునదియే భాగవతము. అది దేవీ భాగవతముగ నున్నది. కృష్ణపరముగ శ్రీమద్భాగవతముగ నున్నది.
ఇందు దైవము లీలలు వివరింపబడుట ప్రధానముగ నుండును. త్రికోణములుగ వ్యాప్తి చెందుట వలన, వానిని తాను ధరించి యుండుట వలన భగమాలిని అను నామము కలిగినది. ఏడు లోకములు ఏడు త్రికోణములు. వీనిని ధరించి యున్నది భగవత్ తత్త్వము. త్రిస్సప్తగ (3 x 7) సృష్టి నిర్మాణము జరిగినదని, నవావరణలుగ తొమ్మిది త్రికోణములతో సృష్టి నిర్మాణము జరిగినదని, పంక్తిగ 5 త్రికోణములుగ సృష్టి నిర్మాణము జరిగినదని అనేక విధములుగ ఋషులు సృష్టి నిర్మాణమును దర్శించిరి.
అన్నిటికీ మూలము త్రికోణమే, త్రికోణమే సృష్టికాధారము. తంత్రమున ఈ త్రికోణమును స్త్రీ యోనిగ కూడ భావించి, పూజింతురు. స్త్రీ యోని అను భావముకన్న త్రిభుజ, త్రికోణము
అన్న భావము కలియుగమున శ్రేయస్కరము. త్రికోణ మెచ్చట గోచరించిననూ పూజ్య భావము కలుగుట ఉపాసకునికి శుభప్రదము. త్రికోణములను ప్రతి కార్యమునందు గుర్తించుట దర్శన విద్య.
కనపడు ప్రతి కార్యమునందు కనపడక త్రికోణ కార్యమున్నది. వినబడు వైఖరి వాక్కునకు ఆధారముగ వినబడని పరా పశ్యంతి మధ్యమ వాక్కు లున్నవి. కనబడు ప్రతి దృశ్యమునకు వెనుక చూడబడుట, చూచుట, చూచుశక్తి యున్నవి. మనము చేయు ప్రతి పనికి వెనుక సంకల్పము నిర్వర్తించు జ్ఞానము, క్రియ వున్నవి. కనబడుచున్న సష్టికి వెనుక క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి యున్నవి.
వెలుగు అవరోహణము చెందుచూ సూక్ష్మము నుండి స్థూలమునకు త్రికోణాత్మకముగ దిగివచ్చును. మరల ఆరోహణము చేయుటకు త్రికోణములను సమన్వయించుకొని కేంద్రమును జేరుటయే మార్గము.
అందులకే శ్రీ చక్రమున త్రికోణములు అధో ముఖముగను, ఊర్ధ్వముఖముగను ఏర్పరచబడినవి. భగమాలిని నామము శ్రీచక్రమునే సూచించును. శ్రీచక్రము సృష్టి నిర్మాణమును సూచించును. అందన్నియూ త్రికోణములే గోచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 277 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀
🌻 Bhagamālinī भगमालिनी (277) 🌻
Bhaga has many meanings. Goddess Savitṛī is also addressed as Bhaga. It also means good fortune, happiness, welfare, prosperity, dignity, majesty, distinction, excellence, beauty, loveliness, etc.
She is in the form of Bhagamālinī, one of the tithi nitya devi-s. There are fifteen tithi nitya devi-s, one nitya devi-s for each lunar day. Tithi means one lunar day. In her mantra ‘bhaga’ appears several times. Hence this tithi nitya devi is called Bhagamālinī. They are worshipped during Śrī Cakra navāvaraṇa pūja.
In Liṅga Purāṇa there is a reference (I.99.6, 7) to a goddess called Bhagā. “She is the mother of the universe. Her name is Bhaga. She is the threefold pedestal (the bottom portion of Liṅga) of the deity, in the form of Liṅga”. This description perfectly fits Umā and Maheśvarā (Śaktī and Śiva). The pedestal on which Liṅga is placed is called Bhagā.
Bhagā also means the six qualities of Śaktī which is explained in nāma 279. She is wearing a garland twined with these six qualities of prosperity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment