విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 416, 417 / Vishnu Sahasranama Contemplation - 416, 417
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 416 / Vishnu Sahasranama Contemplation - 416🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻416. ఋతుః, ऋतुः, R̥tuḥ🌻
ఓం ఋతవే నమః | ॐ ऋतवे नमः | OM R̥tave namaḥ
కాలాత్మనర్తుశబ్దేన లక్ష్యత ఇత్యృతుర్హరిః
ఋ - గతి - ప్రాపణయోః అనగా నడుచుట - చేరుట - చేర్చుట అను ధాతువునుండి ఋచ్ఛతి అనగా ముందునకు సాగును అను అర్థములో 'ఋతుః' అను శబ్దము ఏర్పడును. రెండు చాంద్రమాన మాసములతో ఏర్పడు పరిమిత కాలమును వాడుకలో ఋతుః అనుచున్నాము. ఆ పదములకు లక్షణావృత్తిచే కాలము అను అర్థము చెప్పుకొన్నచో కాల రూపుడుగా పరమాత్ముడు ఋతు శబ్దమునకు అర్థముగా అగుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 416🌹
📚. Prasad Bharadwaj
🌻416. R̥tuḥ🌻
OM R̥tave namaḥ
Kālātmanartuśabdena lakṣyata ityr̥turhariḥ / कालात्मनर्तुशब्देन लक्ष्यत इत्यृतुर्हरिः
From the root R̥ - gati - prāpaṇayoḥ meaning progress - arrive - deliver R̥cchati i.e., with a meaning of moving forward, the word 'R̥tuḥ' is formed. The confined period between two lunar months is termed as R̥tuḥ or season. Hence in His aspect of Time or One who is of the nature of Kāla (time), He is signified by the word R̥tu (season); so R̥tuḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 417 / Vishnu Sahasranama Contemplation - 417🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻417. సుదర్శనః, सुदर्शनः,Sudarśanaḥ🌻
ఓం సుదర్శనాయ నమః | ॐ सुदर्शनाय नमः | OM Sudarśanāya namaḥ
సుదర్శనః, सुदर्शनः, Sudarśanaḥ
శోభనం నిర్వాణఫలం దర్శనం జ్ఞానమస్యహి ।
పద్మ పత్రాయతే స్య వీక్షణే దర్శనే శుభే ।
సుఖేన దృశ్యతే భక్తైర్వేతి విష్ణుః సుదర్శనః ॥
ఎవని దర్శనము అనగా జ్ఞానము మోక్షరూపఫలప్రదమో అట్టివాడు. ఏ పద్మ పత్రాలవంటి చల్లని చూపుగల కన్నుల దర్శనము శుభకరమో అట్టికన్నులు గలవాడు సుదర్శనుడు. భక్తులు తేలికగా దర్శింపగల ఆ విష్ణుదేవుడు సుదర్శనుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 417🌹
📚. Prasad Bharadwaj
🌻417. Sudarśanaḥ🌻
OM Sudarśanāya namaḥ
Śobhanaṃ nirvāṇaphalaṃ darśanaṃ jñānamasyahi,
Padma patrāyate sya vīkṣaṇe darśane śubhe,
Sukhena dr̥śyate bhaktairveti viṣṇuḥ sudarśanaḥ.
शोभनं निर्वाणफलं दर्शनं ज्ञानमस्यहि ।
पद्म पत्रायते स्य वीक्षणे दर्शने शुभे ।
सुखेन दृश्यते भक्तैर्वेति विष्णुः सुदर्शनः ॥
Darśana, knowledge of Him leads to the auspicious fruit of liberation. So, He is Sudarśanaḥ. Or His darśana, eyes are auspicious which are like lotus petals. He is seen or realized easily by devotees, So Lord Viṣṇu is Sudarśanaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
08 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment