నిర్మల ధ్యానాలు - ఓషో - 28


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 28 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. గురువుతో వుండడమంటే నువ్వు నీ లోపలికి చూసుకోవడమే. 🍀


మనం బయటివి వింటూ పోతూ వుంటాం. దాంతో లోపల్నించీ వచ్చే మాటల్ని వినం. అవి నీ అంతరాంతరాల మాటలు. మనం ఉపరితలంలో జీవిస్తాం. మనసులో జీవిస్తాం. మనసెంత శబ్దం చేస్తుందంటే లోపలి చిన్ని శబ్దాన్ని కూడా విననియ్యరు. గురువు ఒక ఉపకరణం మాత్రమే. ఎందుకంటే నువ్వు బయటికి వింటూ వుంటావు. గురువు బాహ్యం నించీ ఏది చెబుతున్నాడో నీ అస్తిత్వం అంతరాళాల నించీ శతాబ్దాల నించీ చెబుతోంది.

గురువుతో వుండడమంటే ఒక రోజు నువ్వు కళ్ళు మూసుకుని నీ లోపలికి చూసుకోవడం. నీ అంతరాత్మ చెబుతున్నది వినడం. సహజత్వం ఎప్పుడూ సరైందే. మేధస్తు కరెక్టు కావచ్చు. తప్పు కావచ్చు. అక్కడ సందేహానికి అవకాశముంది అక్కడ నిస్సందేహానికి ఆస్కారం లేదు. అంతస్సాక్షి తెలిసిన మనిషి తప్పు చెప్పడు. తనలోని అస్తిత్వ స్వరాన్ని అనుసరిస్తారు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jun 2021

No comments:

Post a Comment