8-JUNE-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-47 / Bhagavad-Gita - 1-47🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 615 / Bhagavad-Gita - 615 - 18-26🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 416 417 / Vishnu Sahasranama Contemplation - 416, 417🌹
4) 🌹 Daily Wisdom - 122🌹
5) 🌹. వివేక చూడామణి - 85🌹
6) 🌹Viveka Chudamani - 85🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 85🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 28🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalita Chaitanya Vijnanam - 276 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 47 / Bhagavad-Gita - 47 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 47 🌴*

47. సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జున: సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానస: ||

🌷. తాత్పర్యం : 
సంజయుడు పలికెను: రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్భాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.

🌷. భాష్యము : 
శత్రుసైన్యము నందలి పరిస్థితిని పరిశీలించినపుడు అర్జునుడు రథమునందు నిలబడియే యుండెను. కాని పిదప అతడు శోకముచే మిగుల నొచ్చి ధనుర్బాణములను పడవైచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. అటువంటి దయ మరియు మృదుహృదయము కలిగి శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ యందు నిలిచిన మనుజుడే ఆత్మజ్ఞానమును స్వీకరించుటకు అర్హుడై యున్నాడు.

శ్రీమద్భగవద్గీత యందలి “కురుక్షేత్రరణరంగమున సైనికపరిశీలనము” అను ప్రథమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 47 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 1 - Vishada Yoga - 47 🌴*

47. sañjaya uvāca
evam uktvārjunaḥ saṅkhye
rathopastha upāviśat
visṛjya sa-śaraṁ cāpaṁ
śoka-saṁvigna-mānasaḥ

🌷 Translation : 
Sañjaya said: Arjuna, having thus spoken on the battlefield, cast aside his bow and arrows and sat down on the chariot, his mind overwhelmed with grief.

🌷 Purport : 
While observing the situation of his enemy, Arjuna stood up on the chariot, but he was so afflicted with lamentation that he sat down again, setting aside his bow and arrows. Such a kind and soft-hearted person, in the devotional service of the Lord, is fit to receive self-knowledge.

Thus end the Bhaktivedanta Purports to the First Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Observing the Armies on the Battlefield of Kurukṣetra.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 615 / Bhagavad-Gita - 615 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 26 🌴*

26. ముక్తసఙ్గోనహంవాదీ ధృత్యుత్సాహసమన్విత: |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికార: కర్తా సాత్త్విక ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : 
త్రిగుణ సంగత్వరహితముగా మిథ్యాహంకారము లేకుండా నిశ్చయము మరియు ఉత్సాహములను గూడి, జయాపజయములందు నిర్వికారుడై తన ధర్మమును నిర్వర్తించువాడు సాత్త్వికకర్త యనబడును.

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాయుతుడు సర్వదా ప్రకృతి త్రిగుణములకు అతీతుడైయుండును. మిథ్యాహంకారము మరియు గర్వములకు అతీతుడై యుండుటచే తన కొసగబడిన కర్మ యొక్క ఫలమును అతడు ఆశించకుండును. అయినను అట్టి కర్మ పూర్తియగు నంతవరకును అతడు పూర్ణమగు ఉత్సాహమును కలిగియుండును. 

కార్యసాధనలో కలుగు క్లేశములను లెక్క పెట్టక సదా ఉత్సాహపూర్ణుడై యుండును. జయాపజయములను పట్టించుకొనక అతడు సుఖదుఃఖములందు సమచిత్తమును కలిగియుండును. అటువంటి కర్త సత్త్వగుణమునందు స్థితిని కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 615 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 26 🌴*

26. mukta-saṅgo ’nahaṁ-vādī dhṛty-utsāha-samanvitaḥ
siddhy-asiddhyor nirvikāraḥ kartā sāttvika ucyate

🌷 Translation : 
One who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, and without wavering in success or failure is said to be a worker in the mode of goodness.

🌹 Purport :
A person in Kṛṣṇa consciousness is always transcendental to the material modes of nature. He has no expectations for the result of the work entrusted to him, because he is above false ego and pride. Still, he is always enthusiastic till the completion of such work. 

He does not worry about the distress undertaken; he is always enthusiastic. He does not care for success or failure; he is equal in both distress and happiness. Such a worker is situated in the mode of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 416, 417 / Vishnu Sahasranama Contemplation - 416, 417 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻416. ఋతుః, ऋतुः, R̥tuḥ🌻*

*ఓం ఋతవే నమః | ॐ ऋतवे नमः | OM R̥tave namaḥ*

కాలాత్మనర్తుశబ్దేన లక్ష్యత ఇత్యృతుర్హరిః

ఋ - గతి - ప్రాపణయోః అనగా నడుచుట - చేరుట - చేర్చుట అను ధాతువునుండి ఋచ్ఛతి అనగా ముందునకు సాగును అను అర్థములో 'ఋతుః' అను శబ్దము ఏర్పడును. రెండు చాంద్రమాన మాసములతో ఏర్పడు పరిమిత కాలమును వాడుకలో ఋతుః అనుచున్నాము. ఆ పదములకు లక్షణావృత్తిచే కాలము అను అర్థము చెప్పుకొన్నచో కాల రూపుడుగా పరమాత్ముడు ఋతు శబ్దమునకు అర్థముగా అగుచున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 416🌹*
📚. Prasad Bharadwaj

*🌻416. R̥tuḥ🌻*

*OM R̥tave namaḥ*

Kālātmanartuśabdena lakṣyata ityr̥turhariḥ / कालात्मनर्तुशब्देन लक्ष्यत इत्यृतुर्हरिः

From the root R̥ - gati - prāpaṇayoḥ meaning progress - arrive - deliver R̥cchati i.e., with a meaning of moving forward, the word 'R̥tuḥ' is formed. The confined period between two lunar months is termed as R̥tuḥ or season. Hence in His aspect of Time or One who is of the nature of Kāla (time), He is signified by the word R̥tu (season); so R̥tuḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 417 / Vishnu Sahasranama Contemplation - 417🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻417. సుదర్శనః, सुदर्शनः,Sudarśanaḥ🌻*

*ఓం సుదర్శనాయ నమః | ॐ सुदर्शनाय नमः | OM Sudarśanāya namaḥ*

సుదర్శనః, सुदर्शनः, Sudarśanaḥ

శోభనం నిర్వాణఫలం దర్శనం జ్ఞానమస్యహి ।
పద్మ పత్రాయతే స్య వీక్షణే దర్శనే శుభే ।
సుఖేన దృశ్యతే భక్తైర్వేతి విష్ణుః సుదర్శనః ॥

ఎవని దర్శనము అనగా జ్ఞానము మోక్షరూపఫలప్రదమో అట్టివాడు. ఏ పద్మ పత్రాలవంటి చల్లని చూపుగల కన్నుల దర్శనము శుభకరమో అట్టికన్నులు గలవాడు సుదర్శనుడు. భక్తులు తేలికగా దర్శింపగల ఆ విష్ణుదేవుడు సుదర్శనుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 417🌹*
📚. Prasad Bharadwaj

*🌻417. Sudarśanaḥ🌻*

*OM Sudarśanāya namaḥ*

Śobhanaṃ nirvāṇaphalaṃ darśanaṃ jñānamasyahi,
Padma patrāyate sya vīkṣaṇe darśane śubhe,
Sukhena dr̥śyate bhaktairveti viṣṇuḥ sudarśanaḥ.

शोभनं निर्वाणफलं दर्शनं ज्ञानमस्यहि ।
पद्म पत्रायते स्य वीक्षणे दर्शने शुभे ।
सुखेन दृश्यते भक्तैर्वेति विष्णुः सुदर्शनः ॥

Darśana, knowledge of Him leads to the auspicious fruit of liberation. So, He is Sudarśanaḥ. Or His darśana, eyes are auspicious which are like lotus petals. He is seen or realized easily by devotees, So Lord Viṣṇu is Sudarśanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 122 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 1. The Realm of the Infinite 🌻*

An analysis of the nature of the world discloses its dependence on a reality higher than its own. It is subject to a teleological direction of its movements towards an end beyond itself. 

Dissatisfaction with the superficial experiences which one has in life is a tacit admission of a higher standard of reality. Every want, every wish and ambition, every type of wonder, surprise or mystery, every sense of a ‘beyond oneself’ suggests the existence of something outside the limitations which it indicates. 

‘Something is wanting’ means that what is wanted exists. That we are miserable shows that there is an ideal of happiness. The consciousness of imperfection implies the possibility of perfection. 

To recognise the finitude of oneself is to step at once into the realm of the infinite. When finitude is known, the fact of the contingency of the knower’s transcending it is implied in it. The finite has no significance except in contradistinction to the infinite.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 85 / Viveka Chudamani - 85🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 21. అహంభావము - 1 🍀*

293. ఈ వస్తు ప్రపంచము పూర్తిగా అసత్యము. వ్యక్తి యొక్క క్షణభంగురమైన అహం కూడా అసత్యమే. ఏవిధముగా తనకు తాను అది తెలుసుకొని చెప్పగలరు? అది అహం యొక్క భావన మాత్రమే. క్షణం మాత్రమే ఉండేది. 

294. అయితే నిజమైన 'నేను' అనేది అహమును, మిగిలిన ప్రపంచమును తెలుసుకొంటుంది. అదే సాక్షి ఆత్మ. అది ఎల్లప్పుడు గాఢ నిద్రలో కూడా ఉంటుంది. సృతులు ఏమి చెప్పుచున్నవంటే ఆత్మ పుట్టుకలేనిది, శాశ్వతమైనది అని. అందువలన పరమాత్మ స్థూల పదార్థములకు అతీతమైనది. 

295. వస్తువులలో ఈ మార్పును గ్రహించేవాడు సాక్షి. ఈ వస్తువులలో జరిగే మార్పు నిజానికి శాశ్వతమైన మార్పులేని బ్రహ్మానికి చెందినది. ఈ అసత్యాలన్ని స్థూల, సూక్ష్మ శరీరాలకు చెందినవే. ఇదంతా వివరంగా ఊహల ద్వారా కలల్లో, నిద్రలో గ్రహించగలము. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 85 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 21. Ego Feeling - 1 🌻*

293. This objective universe is absolutely unreal; neither is egoism a reality, for it is observed to be momentary. How can the perception, "I know all", be true of egoism etc., which are momentary ?

294. But the real ‘I" is that which witnesses the ego and the rest. It exists always, even in the state of profound sleep. The Shruti itself says, "It is birthless, eternal", etc. Therefore the Paramatman is different from the gross and subtle bodies.

295. The knower of all changes in things subject to change should necessarily be eternal and changeless. The unreality of the gross and subtle bodies is again and again clearly observed in imagination, dream and profound sleep.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 96 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 77. నూతనత్వము 🌻*

నిర్ణయమందలి వైవిధ్యమునందొక ఆనందము కలదు. వైవిధ్యము ఆనందహేతువు. క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అను సామెతలో సత్యమున్నది. తెలిపిన విషయమునే మరల తెలుపుచున్నను తెలుపు విధానమున క్రొత్తదన మున్నచో శ్రోత లానందింతురు. సృష్టియందీ క్రొత్తదనముండుట చేతనే ఆకర్షణీయ ముగ నుండును. 

ప్రతి సూర్యోదయము, ప్రతి పౌర్ణమి, ప్రతి ఋతువు క్రొత్తగనే యుండును. వైవిధ్యము ఒక నూతనత్వమును కొని తెచ్చి ఆసక్తిని, ఆనందమును కలిగించును. అనుభవించు వారికి చిత్తశాంతి యగును. అట్లు క్రొత్త క్రొత్తగ బోధించుట సద్బోధకుని నైపుణ్యము. 

అదే భోజనమైనను క్రొత్త క్రొగ వండినచో తినువారి కాసక్తి కలుగును. అవే వస్తువులైనను అమరికలో మార్పు చేయుటచే క్రొత్తదనముద్భవించును. ఈ రహస్యము తెలిసిన వైద్యుడు అవే మందులిచ్చుచున్నను, మాటలతో రోగిని ఉత్సాహపరచుచు అతని యందు ఆనందముద్భవింప చేయవలెను. ఆనందము కలిగించుట అసలైన వైద్యము. ఆనందించునపుడు శరీరగ్రంథులు చక్కగ స్రవించును. దేహమునకు వలసిన జీవసార ముద్భవించి స్వస్థత చేకూర్చును. ఆనందపరచువాడు నిజమైన ఆత్మీయుడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 28 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. గురువుతో వుండడమంటే నువ్వు నీ లోపలికి చూసుకోవడమే. 🍀*

మనం బయటివి వింటూ పోతూ వుంటాం. దాంతో లోపల్నించీ వచ్చే మాటల్ని వినం. అవి నీ అంతరాంతరాల మాటలు. మనం ఉపరితలంలో జీవిస్తాం. మనసులో జీవిస్తాం. మనసెంత శబ్దం చేస్తుందంటే లోపలి చిన్ని శబ్దాన్ని కూడా విననియ్యరు. గురువు ఒక ఉపకరణం మాత్రమే. ఎందుకంటే నువ్వు బయటికి వింటూ వుంటావు. గురువు బాహ్యం నించీ ఏది చెబుతున్నాడో నీ అస్తిత్వం అంతరాళాల నించీ శతాబ్దాల నించీ చెబుతోంది.

గురువుతో వుండడమంటే ఒక రోజు నువ్వు కళ్ళు మూసుకుని నీ లోపలికి చూసుకోవడం. నీ అంతరాత్మ చెబుతున్నది వినడం. సహజత్వం ఎప్పుడూ సరైందే. మేధస్తు కరెక్టు కావచ్చు. తప్పు కావచ్చు. అక్కడ సందేహానికి అవకాశముంది అక్కడ నిస్సందేహానికి ఆస్కారం లేదు. అంతస్సాక్షి తెలిసిన మనిషి తప్పు చెప్పడు. తనలోని అస్తిత్వ స్వరాన్ని అనుసరిస్తారు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 277 / Sri Lalitha Chaitanya Vijnanam - 277 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*

*🌻 277. 'భగమాలినీ' 🌻* 

భగములు మాలికగ ఏర్పరచి ధరించునది శ్రీదేవి అని అర్థము.
'భ' అనగా వెలుగు. 'గ' అనగా గతి, వ్యాపకశక్తి. శ్రీదేవి తన వెలుగును వ్యాప్తి చేయుటకు, బిందువుగ నున్న తాను త్రికోణముగ ఏర్పడును. భగ శబ్దమునకు మూలార్థమిది. భగవంతుడు, భగవతి, అని శివ పరముగను, శ్రీ పరముగను, వ్యాపించుచు అవతరించుచు అంతర్యామియై చరించుచు నున్న తత్త్వమును భగవత్ తత్త్వమందురు. దీనిని గూర్చి తెలుపునదియే భాగవతము. అది దేవీ భాగవతముగ నున్నది. కృష్ణపరముగ శ్రీమద్భాగవతముగ నున్నది. 

ఇందు దైవము లీలలు వివరింపబడుట ప్రధానముగ నుండును. త్రికోణములుగ వ్యాప్తి చెందుట వలన, వానిని తాను ధరించి యుండుట వలన భగమాలిని అను నామము కలిగినది. ఏడు లోకములు ఏడు త్రికోణములు. వీనిని ధరించి యున్నది భగవత్ తత్త్వము. త్రిస్సప్తగ (3 x 7) సృష్టి నిర్మాణము జరిగినదని, నవావరణలుగ తొమ్మిది త్రికోణములతో సృష్టి నిర్మాణము జరిగినదని, పంక్తిగ 5 త్రికోణములుగ సృష్టి నిర్మాణము జరిగినదని అనేక విధములుగ ఋషులు సృష్టి నిర్మాణమును దర్శించిరి. 

అన్నిటికీ మూలము త్రికోణమే, త్రికోణమే సృష్టికాధారము. తంత్రమున ఈ త్రికోణమును స్త్రీ యోనిగ కూడ భావించి, పూజింతురు. స్త్రీ యోని అను భావముకన్న త్రిభుజ, త్రికోణము
అన్న భావము కలియుగమున శ్రేయస్కరము. త్రికోణ మెచ్చట గోచరించిననూ పూజ్య భావము కలుగుట ఉపాసకునికి శుభప్రదము. త్రికోణములను ప్రతి కార్యమునందు గుర్తించుట దర్శన విద్య. 

కనపడు ప్రతి కార్యమునందు కనపడక త్రికోణ కార్యమున్నది. వినబడు వైఖరి వాక్కునకు ఆధారముగ వినబడని పరా పశ్యంతి మధ్యమ వాక్కు లున్నవి. కనబడు ప్రతి దృశ్యమునకు వెనుక చూడబడుట, చూచుట, చూచుశక్తి యున్నవి. మనము చేయు ప్రతి పనికి వెనుక సంకల్పము నిర్వర్తించు జ్ఞానము, క్రియ వున్నవి. కనబడుచున్న సష్టికి వెనుక క్రియాశక్తి,
జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి యున్నవి. 

వెలుగు అవరోహణము చెందుచూ సూక్ష్మము నుండి స్థూలమునకు త్రికోణాత్మకముగ దిగివచ్చును. మరల ఆరోహణము చేయుటకు త్రికోణములను సమన్వయించుకొని కేంద్రమును జేరుటయే మార్గము.  

అందులకే శ్రీ చక్రమున త్రికోణములు అధో ముఖముగను, ఊర్ధ్వముఖముగను ఏర్పరచబడినవి. భగమాలిని నామము శ్రీచక్రమునే సూచించును. శ్రీచక్రము సృష్టి నిర్మాణమును సూచించును. అందన్నియూ త్రికోణములే గోచరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 277 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀*

*🌻 Bhagamālinī भगमालिनी (277) 🌻*

Bhaga has many meanings. Goddess Savitṛī is also addressed as Bhaga. It also means good fortune, happiness, welfare, prosperity, dignity, majesty, distinction, excellence, beauty, loveliness, etc.

She is in the form of Bhagamālinī, one of the tithi nitya devi-s. There are fifteen tithi nitya devi-s, one nitya devi-s for each lunar day. Tithi means one lunar day. In her mantra ‘bhaga’ appears several times. Hence this tithi nitya devi is called Bhagamālinī. They are worshipped during Śrī Cakra navāvaraṇa pūja. 

In Liṅga Purāṇa there is a reference (I.99.6, 7) to a goddess called Bhagā. “She is the mother of the universe. Her name is Bhaga. She is the threefold pedestal (the bottom portion of Liṅga) of the deity, in the form of Liṅga”. This description perfectly fits Umā and Maheśvarā (Śaktī and Śiva). The pedestal on which Liṅga is placed is called Bhagā.

Bhagā also means the six qualities of Śaktī which is explained in nāma 279. She is wearing a garland twined with these six qualities of prosperity.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment